Viral Video: పాక్‌లో పొలిటీషియన్లపై అసంతృప్తికి పరాకాష్ట.. ‘ఆటోమెటిక్ చెప్పు దెబ్బల మిషన్’ సృష్టి.. ఫుల్ డిమాండ్ అంటున్న నెటిజన్లు

వీడియోను చూసిన తర్వాత, ఒక వినియోగదారు వ్యాఖ్యానిస్తూ, 'రాబోయే కాలంలో ఈ యంత్రానికి డిమాండ్ చాలా పెరగబోతోంది' అని కామెంట్ చేశాడు. మరోవైపు.. చూడ్డానికి ముచ్చటగా ఉండే ఇలాంటి వస్తువును తొలిసారిగా పాకిస్థాన్ కనిపెట్టిందని మరో యూజర్ పేర్కొన్నాడు..!

Viral Video: పాక్‌లో పొలిటీషియన్లపై అసంతృప్తికి పరాకాష్ట.. ‘ఆటోమెటిక్ చెప్పు దెబ్బల మిషన్’ సృష్టి.. ఫుల్ డిమాండ్ అంటున్న నెటిజన్లు
Automatic Laanat Machine
Follow us
Surya Kala

|

Updated on: Aug 20, 2022 | 12:57 PM

Viral Video: జుగాడ్ తయారీ విషయంలో భారతీయులకు ఎవరూ సాటి రారు. మన దేశంలో ఇటువంటి జుగాడ్ వ్యక్తులు ఒకటి కంటే ఎక్కువ మంది ఉన్నారు. వీరు తయారు చేసే దేశీ జుగాడ్ ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. అయితే మన భారతీయుల్లానే.. పొరుగున ఉన్న పాకిస్తాన్ సోదరులు కూడా జుగాడ్ విషయంలో అగ్రస్థానంలో ఉన్నారు. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న పాకిస్థాన్ వీడియో అందుకు సాక్ష్యం. పాకిస్తాన్ ప్రజలు తాజాగా ‘ఆటోమేటిక్ లానాట్ మెషిన్’ తయారు చేశారు. ఆ యంత్రాన్ని చుసిన తర్వాత మీరు కూడా వావ్ అంటారు!

ప్రస్తుతం పాకిస్తాన్ లో ద్రవ్యోల్బణం పెరిపోయింది. తినే వస్తువుల ధరలకు రెక్కలు వచ్చాయి. కనీసం టీ కూడా తాగలేని స్టేజ్ కు జనాభా చేరుకున్నారు. దీంతో ప్రజలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. షాబాజ్ షరీఫ్ పరిపాలనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్నారు. అయితే పాకిస్తాన్ నిరసనకారులు తమ నిరసన భారాన్ని తగ్గించుకోవడానికి.. రాజకీయ నేతలపై, ప్రభుత్వంపై నిరసన తెలియజేయడానికి ‘ఆటోమేటిక్ లానాట్ మెషిన్’ అనే మారుపేరుతో ఒక వినూత్న యంత్రాన్ని రూపొందించారు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోలో.. హోర్డింగ్‌పై పాకిస్తాన్‌కు చెందిన ముగ్గురు నాయకుల ఫోటోలు కనిపిస్తున్నాయి. ఆ హోర్డింగ్ కింద ఒక జుగాడ్ బండి ఆపి.. ఆ మెషీన్‌కి చెప్పులు తగిలించి ఉంది. కింద ఉన్నవాళ్ళు తాడు లాగగానే, నాయకుల చిత్రాల దగ్గరకు ఆ చెప్పుల స్టాండ్ వెళ్తోంది. అంతేకాదు.. ఆ చెప్పులు ఏకకాలంలో రాజకీయ నేతల పోస్టర్లను కొడుతోంది. ఈ చర్యల ద్వారా పాక్ ప్రజలు నిరసన తెలుపుతున్నట్లు  తెలుస్తోంది.

ఈ మనోహరమైన వీడియోను మేజర్ గౌరవ్ ఆర్య ట్విట్టర్‌లో షేర్ చేశారు. “పాకిస్తాన్‌లోని స్టార్టప్ ఎకోసిస్టమ్ నిజంగా పరిణితిని సాధించింది. ఈ ఆటోమేటిక్‌లానాట్‌మెషిన్ స్వచ్ఛమైన భూమి నుండి సరికొత్త ఆవిష్కరణ” అని క్యాప్షన్ తో షేర్ చేశారు.

వీడియోను చూసిన తర్వాత, ఒక వినియోగదారు వ్యాఖ్యానిస్తూ, ‘రాబోయే కాలంలో ఈ యంత్రానికి డిమాండ్ చాలా పెరగబోతోంది’ అని కామెంట్ చేశాడు. మరోవైపు.. చూడ్డానికి ముచ్చటగా ఉండే ఇలాంటి వస్తువును తొలిసారిగా పాకిస్థాన్ కనిపెట్టిందని మరో యూజర్ పేర్కొన్నాడు..!  ‘ఇది ఆటోమేటిక్ డ్యామ్నింగ్ మెషిన్..అద్భుతం అంటూ రకరకాల మార్గాల్లో ప్రశంసిస్తున్నారు. ఈ వీడియోకు దాదాపు మూడు లక్షల వీక్షణలు, 1850 రీట్వీట్లు, 11 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకున్నది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..