Telugu News Trending Viral Video: Pakistan Journalist Stands in Neck Deep Water to Report About Floods, Internet Says Hats Off
Viral Video: న్యూస్ రిపోర్టర్ సాహసం.. మెడలోతు నీటిలో దిగి వరదలపై రిపోర్టింగ్.. నెట్టింట వీడియో వైరల్
పాకిస్తాన్‌ను వరదలు ముంచెత్తుతున్న క్రమంలో.. దేశంలోని వరదల పరిస్థితిని రిపోర్ట్ చేసేందుకు ఓ టీవీ జర్నలిస్టు మెడలోతు నీటిలో దిగి రిపోర్టింగ్ చేస్తున్నాడు. అతడి శరీరం మొత్తం నీటిలో మునిగి ఉంది.
Viral Video: న్యూస్ లైవ్ రిపోర్టింగ్ చేయడమంటే అంత ఈజీ కాదు.. ముఖ్యంగా ప్రకృతి బీభత్సం ఏర్పడిన సమయంలో రిపోర్టింగ్ చేయడం అంటే కత్తిమీద సామే అని చెప్పవచ్చు. రిపోర్టింగ్ చేసే క్రమంలో పాత్రికేయులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒక్కోసారి ప్రాణాలకు తెగించి ముందుకు వెళ్లాల్సి వస్తుంది. అలాంటి సందర్భంలో కూడా కొందరు వెనకడుకు వేయరు. వార్తలను ఉన్నది ఉన్నట్టు చూపించేందుకు ఎంతదూరమైనా వెళ్తారు. ఇందుకు సజీవ సాక్ష్యంగా ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఓ పాకిస్తానీ జర్నలిస్ట్ మెడలోతు నీటిలో వరదలను కవరేజ్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
— Anurag Amitabhانوراگ امیتابھअनुराग अमिताभ (@anuragamitabh) August 27, 2022
పాకిస్తాన్‌ను వరదలు ముంచెత్తుతున్న క్రమంలో.. దేశంలోని వరదల పరిస్థితిని రిపోర్ట్ చేసేందుకు ఓ టీవీ జర్నలిస్టు మెడలోతు నీటిలో దిగి రిపోర్టింగ్ చేస్తున్నాడు. అతడి శరీరం మొత్తం నీటిలో మునిగి ఉంది. తల, మైక్ మాత్రమే వీడియోలో కనిపిస్తున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు రిపోర్టర్ అంకితభావాన్ని, పని తీరును ప్రశంసించారు. అలాగే, రిపోర్టర్‌ను ప్రమాదంలో పడేసినందుకు న్యూస్ చానెల్‌ను కొందరు విమర్శించారు. ‘అత్యంత కఠిన పరిస్థితుల్లో రిపోర్టింగ్ చేసినందుకు మీకు హ్యాట్సాఫ్ సార్’ అంటూ మరికొందరు కామెంట్ చేశారు. ఈ వీడియోను ‘అనురాగ్ అమితాబ్’ అనే యూజర్ ట్విటర్‌లో షేర్ చేశారు.