Viral Video: కోడితో పెట్టుకుంటే ఇట్లనే ఉంటది మరి… రన్నింగ్ స్కూటీని రోడ్డుపై అడ్డంగా బొల్తా కొట్టించిందిగా
రోడ్డు మీద డ్రైవింగ్ చేసేటప్పుడు మనం ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే అది మీ తప్పు కాకపోయినా ఒక్కోసారి బలైపోయేది మీరే. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ కోడి కారణంగా ఒక స్కూటీ రైడర్ ప్రమాదానికి గురవుతాడు. రోడ్డు మీద ఎవరూ ఊహించని విధంగా...

రోడ్డు మీద డ్రైవింగ్ చేసేటప్పుడు మనం ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే అది మీ తప్పు కాకపోయినా ఒక్కోసారి బలైపోయేది మీరే. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ కోడి కారణంగా ఒక స్కూటీ రైడర్ ప్రమాదానికి గురవుతాడు. రోడ్డు మీద ఎవరూ ఊహించని విధంగా ఆ ప్రమాదం జరిగింది. దుకే ఈ వీడియో ఇంటర్నెట్‌లో వచ్చిన వెంటనే వైరల్ అయింది.
వైరల్ అవుతున్న ఈ వీడియో స్కూటీ రైడర్ మరియు కోడికి సబంధించినది. స్కూటీ డ్రైవ్ చేస్తున్న వ్యక్తికి కోడి వల్ల పెద్ద ప్రమాదం జరిగింది. ఈ దృశ్యం మొత్తం సమీపంలోని కెమెరాలో రికార్డ్ అయింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి అకస్మాత్తుగా బ్రేకులు వేయడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని వీడియోలోని దృశ్యాలు చూసిన తర్వాఆత అర్థమవుతుంది. ఆ తర్వాత ఆ వ్యక్తికి ఈ పెద్ద ప్రమాదం జరిగింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు. అయితే కోడి కూడా స్కూటీ చక్రాల కింద నలిగిపోయి గాయపడటం చూడవచ్చు.
వీడియో చూడండి:
View this post on Instagram
వీడియోలో అకస్మాత్తుగా ఒక కోడి స్కూటీ రైడర్ ముందుకి రావడాన్ని మీరు చూడవచ్చు. ఆ తర్వాత ఆ వ్యక్తి అకస్మాత్తుగా బ్రేక్‌లు వేస్తాడు. స్కూటీ చక్రం కోడిని ఢీకొట్టింది. దీని కారణంగా స్కూటీ బ్యాలెన్స్ పూర్తిగా తప్పిపోయి మరుసటి క్షణం ఆ యువకుడు రోడ్డుపై ప్రమాదకరంగా పడిపోతాడు. ఈ ప్రమాదం చాలా భయంకరంగా జరిగింది. చూసేవారు కూడా వణికిపోయారు. అతడు పెద్దగా గాయం అయినట్లు ఈ క్లిప్ చూడటం ద్వారా తెలుస్తుంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఒక వినియోగదారుడు అందుకే రోడ్డుమీద అప్రమత్తంగా ఉండాలని చెప్పేది అంటూ కామెంట్స్ పెట్టాడు. అదే సమయంలో మరొకరు నా జీవితంలో మొదటిసారి ఈ స్థాయి ప్రమాదకరమైన స్టంట్‌ను చూశానని రాశాడు. మరొకరు వీడియోపై వ్యాఖ్యానిస్తూ కోడి కారణంగా ఎవరైనా ప్రమాదం పాలవడం తాను చూడటం ఇదే మొదటిసారి అని రాశారు.
