Viral Video: అన్నం పెట్టిన బామ్మకు అస్వస్థత.. కౌగిలించుకుని పరామర్శించిన కోతి.. మనుషులకంటే నువ్వే బెస్ట్

|

Feb 04, 2023 | 10:12 AM

మనసుకు హత్తుకునే వీడియోలు వీక్షించడమే కాదు.. షేర్ చేస్తారు కూడా..తనకు మేలు చేసిన వారి పట్ల ప్రేమని, ఇష్టాన్ని చూపించడంలో నేను మనుషులకంటే ఏ మాత్రం తక్కువ కాదు అని నిరూపించింది కోతి. ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న వీడియో జనాల్లో చర్చనీయాంశమైంది.

Viral Video: అన్నం పెట్టిన బామ్మకు అస్వస్థత.. కౌగిలించుకుని పరామర్శించిన కోతి.. మనుషులకంటే నువ్వే బెస్ట్
Monkey Love Video
Follow us on

మనిషికి మనిషికి మధ్య బంధం వ్యాపారంగా మారుతున్న తరుణంలో..  మనుషులు  జంతువుల మధ్య ప్రేమ సంబంధం మరింతగా బలపడుతోంది. ఇద్దరూ తమ ప్రేమని వ్యక్తం చేసుకోవడానికి భాష అవసరం లేదు.. స్పర్శ.. చిన్న పాటి కేరింగ్ తో ఇరువురు ఒకరితోనొకరు మాట్లాడుకోవచ్చు. అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో కుక్క, పిల్లి, ఏనుగు వంటి జంతువులకు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తే.. వైరల్ కావడానికి కారణం అదే…  మనసుకు హత్తుకునే వీడియోలు వీక్షించడమే కాదు.. షేర్ చేస్తారు కూడా..తనకు మేలు చేసిన వారి పట్ల ప్రేమని, ఇష్టాన్ని చూపించడంలో నేను మనుషులకంటే ఏ మాత్రం తక్కువ కాదు అని నిరూపించింది కోతి. ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న వీడియో జనాల్లో చర్చనీయాంశమైంది.

మీరు ఎవరినైనా జాగ్రత్తగా చూసుకుంటే.. మీకు అవసరమైనప్పుడు అతను కూడా మీ కోసం ఏమి చేయడానికైనా వెనుకాడడు. ఈ గుణం మనుషులకే కాదు జంతువుల్లో కూడా ఉంది. అయితే మారుతున్న కాలంతో మనుషులు కృతజ్ఞత అనే గుణాన్ని మరిచిపోతున్నారు.. స్వార్ధపరులుగా మారిపోతున్నారు.. అయితే జంతువులు మాత్రం తాను మనుషులకంటే భిన్నమని.. తమలో కృతజ్ఞతా భావం పోలేదు.. పోదు అని తమ చర్యల ద్వారా చెప్పకనే చెబుతున్నాయి.  అందుకు ఉదాహరణగా నిలిచింది ఓ కోతి .. ఒక వృద్ధురాలు కోతికి రోజూ ఆహారం తినిపించేది. అయితే ఆమె అనారోగ్యానికి గురైంది. దీంతో కోతి చాలా కలత చెందింది. నేటి సమాజంలో మనిషి కూడా చేయని పనిని కోతి చేసింది.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోలో.. అనారోగ్యంతో ఉన్న వృద్ధ మహిళ మంచంపై పడుకుని ఉంది. ఆమె పక్కన ఒక కోతి కూర్చుని ఉంది. అంతేకాదు.. ఆ బామ్మని పదే పదే కౌగిలించుకుని తన ప్రేమను వ్యక్తపరుస్తుంది. ఆ బామ్మ కోతులను తన బిడ్డలాగా ప్రేమించి రోజూ తినడానికి ఆహారం అందించేదని తెలుస్తోంది. అయితే బామ్మ అనారోగ్యం కారణంగా కొన్ని రోజులు కోతులకు ఆహారం పెట్టకపోవడంతో కోతులు ఆమె వద్దకు వచ్చి ఆమె పరిస్థితిని తెలుసుకోవడం ప్రారంభించాయి.

ఈ వీడియోను @ravikarkara అనే ఖాతా ద్వారా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను నాలుగు లక్షల మందికి పైగా చూడగా, 19 వేల మందికి పైగా లైక్ చేశారు. కోతి ప్రేమకు నెటిజన్లు ఫిదా..  ప్రశంసల వర్షంతో ముంచెత్తుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..