Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వావ్‌.. ఇతను కదా సూపర్‌ మ్యాన్‌ అంటే… కూలీ పనితనం మామూలుగా లేదుగా…

టాలెంట్‌ ఎవరి సొత్తూ కాదు.. ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్‌ అంతర్లీనంగా దాగి ఉంటుంది. సరైన సమయంలో వెలికి తీసినవాడే పాపులర్‌ అవుతుంటారు. సినిమాలో సూపర్‌ మ్యాన్‌ చూశారుగా.. పిల్లలైతే ఆ రీల్‌ సూపర్‌ మ్యాన్‌ను చూసి ఒక్కటే కేరింతలు కొడుతుంటారు. రీల్‌ సూపర్‌ మ్యాన్‌ నిజ జీవితంలో ఏం చేస్తాడేమోగానీ ఇక్కడ...

Viral Video: వావ్‌.. ఇతను కదా సూపర్‌ మ్యాన్‌ అంటే... కూలీ పనితనం మామూలుగా లేదుగా...
Super Majdoor
Follow us
K Sammaiah

|

Updated on: Jun 07, 2025 | 5:11 PM

టాలెంట్‌ ఎవరి సొత్తూ కాదు.. ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్‌ అంతర్లీనంగా దాగి ఉంటుంది. సరైన సమయంలో వెలికి తీసినవాడే పాపులర్‌ అవుతుంటారు. సినిమాలో సూపర్‌ మ్యాన్‌ చూశారుగా.. పిల్లలైతే ఆ రీల్‌ సూపర్‌ మ్యాన్‌ను చూసి ఒక్కటే కేరింతలు కొడుతుంటారు. రీల్‌ సూపర్‌ మ్యాన్‌ నిజ జీవితంలో ఏం చేస్తాడేమోగానీ ఇక్కడ ఒక రియల్‌ సూపర్‌ మ్యాన్‌ మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

వినూత్న సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. అలాంటి ఓ వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. బరువైన బస్తాలను ఎంతో సులభంగా మోసుకుంటూ వెళ్తున్న వ్యక్తిని చూసి నెటిజన్స్‌ షాక్‌ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ఇది కదా… సూపర్‌ మ్యాన్‌ పనితనం అంటూ పోస్టులు పెడుతున్నారు.

వీడియోలోని దృశ్యాల ప్రకారం ఓ వ్యక్తి బస్తాలు మోసే పనిలో ఉంటాడు. బరువైన మూటలను భుజంపై వేసుకుని మరో చోటికి మోసుకెళుతుంటాడు. అయితే అతను పని చేస్తున్న విధానం చూసి అంతా షాక్‌ అవుతున్నారు. బరువైన బస్తాను భుజంపై మోస్తూ పైనుంచి కిందకు దిగే క్రమంలోనే అసలైన మ్యాజిక్‌ కనపడుతుంది. ఆ దృశ్యమే ఇప్పుడు అంతా అవాక్కయ్యేలా చేస్తుంది.

బరువైన బస్తాను మోస్తూ మెట్లపై నుంచి దిగి రాకుండా వాటికి ఇరువైపులా ఉన్న రెయిలింగ్‌పై చేతులు పెట్టి.. రయ్యిన దూసుకుంటూ కిందకు వచ్చాడు. ఆ తర్వాత అంతే ఉత్సాహంతో ముందుకు వెళ్లాడు. ఇలా అంత బరువైన మూటలను సైతం ఇలా ఆడుతూ, పాడుతూ మోసుకెళుతున్న దృశ్యం నెటిజన్స్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ పెడుతున్నారు. ‘వావ్.. ఇది కదా టాలెంట్ అంటే’.. అంటూ కొందరు, ‘పనితనం అంటే ఇలా ఉండాలి’.. అంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు.

వీడియో చూడండి:

నడిరోడ్డుపై దారుణంగా కొట్టుకున్న యువతీ యువకుడు..
నడిరోడ్డుపై దారుణంగా కొట్టుకున్న యువతీ యువకుడు..
పాన్‌ కార్డు ఉన్నవారికి అలర్ట్‌.. ఇది చేయకపోతే భారీ ఫైన్‌
పాన్‌ కార్డు ఉన్నవారికి అలర్ట్‌.. ఇది చేయకపోతే భారీ ఫైన్‌
కూల్‌ న్యూస్‌.. యూపీఐ పేమెంట్లపై ఛార్జీల్లేవ్.. కేంద్రం క్లారిటీ
కూల్‌ న్యూస్‌.. యూపీఐ పేమెంట్లపై ఛార్జీల్లేవ్.. కేంద్రం క్లారిటీ
బైపాస్‌ రోడ్డు పక్కన పంట చేలో కళ్లుచెదిరే సీన్‌
బైపాస్‌ రోడ్డు పక్కన పంట చేలో కళ్లుచెదిరే సీన్‌
అదృష్టం అంటే ఇతనిదే.. బురదలో దొరికిన మట్టికుండలో
అదృష్టం అంటే ఇతనిదే.. బురదలో దొరికిన మట్టికుండలో
ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే
ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే
కారు డ్రైవర్‌ను మస్కా కొట్టిన గూగుల్ మ్యాప్స్..
కారు డ్రైవర్‌ను మస్కా కొట్టిన గూగుల్ మ్యాప్స్..
తనకు అన్నం పెట్టి వ్యక్తి చనిపోతే కొండముచ్చు ఏం చేసిందో తెలుసా
తనకు అన్నం పెట్టి వ్యక్తి చనిపోతే కొండముచ్చు ఏం చేసిందో తెలుసా
మందేసి నిద్రపోతున్న వ్యక్తి.. దగ్గరకొచ్చి వాసన చూసిన ఆడసింహం
మందేసి నిద్రపోతున్న వ్యక్తి.. దగ్గరకొచ్చి వాసన చూసిన ఆడసింహం
రూ.500 నోటుపై స్టార్‌ గుర్తు.. ఇది నకిలీదా..ఆర్బీఐ ఏం చెబుతోంది?
రూ.500 నోటుపై స్టార్‌ గుర్తు.. ఇది నకిలీదా..ఆర్బీఐ ఏం చెబుతోంది?