Viral Video: సింహం వైపు గురకాయించి చూశాడట… అంతే..! ఆడసింహం ఆపకుంటే ఏమయ్యోదో…
ఒక హృదయ విదారకమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మృగరాజు సింహంతో ఆట ఎంత ప్రమాదకరమో ఈ వీడియో మరోసారి చాటి చెబుతోంది. ఇందులో ఒక జూ కీపర్‌కు తృటిలో ప్రాణాపాయం తప్పింది. జూలోని మగ సింహాన్ని రెచ్చగొట్టి తీవ్రమైన తప్పు చేశాడు ఆ జూకీపర్. దీంతో రెచ్చిపోయిన...

ఒక హృదయ విదారకమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మృగరాజు సింహంతో ఆట ఎంత ప్రమాదకరమో ఈ వీడియో మరోసారి చాటి చెబుతోంది. ఇందులో ఒక జూ కీపర్‌కు తృటిలో ప్రాణాపాయం తప్పింది. జూలోని మగ సింహాన్ని రెచ్చగొట్టి తీవ్రమైన తప్పు చేశాడు ఆ జూకీపర్. దీంతో రెచ్చిపోయిన సింహం ఒక్కసారిగా జూ కీపర్ మీద దాడికి దిగింది. మరో జూ కీపర్ రక్షించాడు. లేకపోతే అది నమిలి మింగేదేమో.. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.
వీడియోలో, జూ కీపర్ ఒక మగ సింహం వైపు నేరుగా చూస్తుండగా, అది అకస్మాత్తుగా కోపంగా మారి దాడి చేస్తుంది. ఈ సంఘటన జూ లోపల జరిగింది. అక్కడ కీపర్ ఆ ఆవరణలో ఒక మగ సింహం మరియు ఒక ఆడ సింహంతో పాటు ఉన్నాడు. మరొక సిబ్బంది కూడా సమీపంలోనే ఉన్నాడు. జూ కీపర్ తీవ్రమైన చూపు ఆ సింహానికి కోపం తెప్పించింది. రెచ్చిపోయిన సింహం కీపర్ వైపు దూసుకెళ్లింది. తన గోళ్లు మరియు దంతాలతో అతనిపై దాడి చేయడం ప్రారంభించింది. ఇదంతా చాలా వేగంగా జరిగిపోయింది. కీపర్‌కు తప్పించుకోవడానికి కూడా సమయం లేదు. దీంతో సహాయం కోసం కేకలు వేశాడు. అతని సహోద్యోగి సింహాన్ని ఆపడానికి ప్రయత్నించాడు.
ఆడసింహం కూడా జూ కీపర్‌ను రక్షించడానికి రంగంలోకి దిగింది. మగసింహాన్ని అపడానికి ట్రై చేసింది. జూ కీపర్ నుండి మగ సింహం దృష్టిని మళ్లించేందుకు ఆడసింహం ప్రయత్నించింది. ఈ క్రమంలో జూ కీపర్‌కు తప్పించుకునే అవకాశం వచ్చింది. ఆడ సింహమే లేకుంటే మాత్రం అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయేవే. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.
సింహాన్ని చూడటం నిప్పుతో ఆడుకోవడం లాంటిది అంటూ నెటిజన్స్ పోస్టు చేశారు. జూ కీపర్ తన తప్పును గ్రహించి మరోసారి చేయకుండా ఉండాలి అని మరొక వినియోగదారు సింహరాశిని ప్రశంసిస్తూ కామెంట్స్ చేశారు. ఆడ సింహం వేగంగా కీపర్‌ను రక్షించింది. లేకపోతే, అది విషాదకరంగా ముగిసి ఉండేదని మరికొందరు కామెంట్స్ చేశారు.
వీడియో చూడండి:
Lioness tried her best in calming Lion from attacking a stupid zookeeper who was making eye contact with lion! pic.twitter.com/YXnkpskqUC
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) June 4, 2025