AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: పాఠం చెబుతుండగా టీచర్ కు గుండెపోటు.. విలవిలాడుతూ మృతి.. వీడియో వైరల్

పాకిస్తాన్‌లోని లాహోర్‌లో జరిగిన ఒక విషాద సంఘటనకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది. ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ ఉపాధ్యాయుడు పాఠం చెబుతున్న సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. గుండెపోటుతో మరణించినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఈ మొత్తం సంఘటన ఉపాధ్యాయ శిక్షణ సమయంలో జరిగింది.

Watch Video: పాఠం చెబుతుండగా టీచర్ కు గుండెపోటు.. విలవిలాడుతూ మృతి.. వీడియో వైరల్
Teacher Dead
Surya Kala
|

Updated on: Jul 10, 2025 | 6:27 PM

Share

పాకిస్తాన్‌లోని లాహోర్ లో జరిగిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ లెక్చర్ ఇస్తున్న సమయంలో గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఈ సంఘటన టీచర్ శిక్షణ సమయంలో కెమెరాలో రికార్డ్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరణించిన టీచర్‌ను నియాజ్ అహ్మద్‌గా గుర్తించారు, అతను తన తోటి టీచర్లకు శిక్షణ ఇస్తున్నాడు. అక్కడ ఉన్న వ్యక్తులు చెప్పిన ప్రకారం నియాజ్ అహ్మద్‌ అకస్మాత్తుగా నేలపై పడి గుండెపోటుకు గురయ్యాడు. ఆసుపత్రికి చేరుకునేసరికే వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు.

ఉపన్యాసం సమయంలో ప్రొఫెసర్ గుండెపోటు పూర్తి వీడియో 😱😱😱😱

ఇవి కూడా చదవండి

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రజలు ఆ టీచర్ కు నివాళులు అర్పిస్తున్నారు. ఈ వీడియోలో నియాజ్ అహ్మద్ టీచింగ్ చేస్తున్న సమయంలో మొదట్లో అతని ముఖంలో లేదా నడకలో ఎటువంటి ఇబ్బంది కనిపించ లేదు. కానీ అకస్మాత్తుగా అతను నేలపై పడిపోవడంతో తరగతి గదిలో కలకలం రేగింది. నివేదికల ప్రకారం అతన్ని వెంటనే వైద్యం కోసం సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అయితే ఆసుపత్రికి చేరుకునే లోపులోనే అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. నియాజ్ మృతితో స్కూల్ లో విషాదం నెలకొంది.

నియాజ్ మిడిల్ స్కూల్‌లో ఉర్దూ బోధించేవాడని సూచిస్తున్నాయి. నియాజ్ అహ్మద్ పాఠం చెప్పే సమయంలో చాలా అంకితభావంతో ఉండేవారని.. సహచర టీచర్స్ చెబుతున్నారు. ఆయన స్కూల్ కి టీచర్ గా అందించిన సేవలను విద్యార్థులు , సహచరులు గుర్తు చేసుకున్నారు. మరణించిన ఉపాధ్యాయుడికి ఇంటర్నెట్‌లో నివాళులు అర్పిస్తున్నారు నెటిజన్లు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..