
ప్రతిరోజూ లెక్కలేనన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు అవి మనల్ని అలరిస్తాయి, మరికొన్ని వీడియోలు మనల్ని ఆలోచింపజేస్తాయి. ఇటీవల అలాంటి ఒక వీడియో కనిపించింది. ఇది ప్రజల దృష్టిని ఆకర్షించింది. బాలుడి అమాయకత్వం అందరి హృదయాలను గెలుచుకుంది. వీడియోలో మీకు మంచి విలువలు ఉంటే, మీరు మీ వ్యక్తిత్వాన్ని ఎవరికీ పరిచయం చేయవలసిన అవసరం లేదని పిల్లవాడు చూపించాడు. ఇది ఈ బాలుడి ప్రవర్తనలో స్పష్టంగా కనిపిస్తుంది.
ఆ వీడియోలో ఒక చిన్న పిల్లవాడు మెట్రోలో ప్రయాణిస్తున్నట్లు చూడవచ్చు. ప్రయాణంలో ఒక కూల్ డ్రింక్ బాటిల్ అకస్మాత్తుగా బాలుడి చేతిలో నుంచి నేలపై పడిపోయింది. ఆ బాటిల్ కింద పడగానే, పానీయం అక్కడ చిందింది. నేల తడిసిపోయింది. సాధారణంగా ఇలాంటి పరిస్థితిలో పిల్లలు భయపడతారు లేదా అటు, ఇటు చూడటం ప్రారంభిస్తారు. అయితే అక్కడ ఉన్న బాలుడు చేసిన పని వైరల్ అయ్యింది. ప్రజలు ఈ వీడియోను షేర్ చేస్తూ తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకంటే తన చేతిలోని కూల్ డ్రింక్ కింద పడగానే.. ఆ పిల్లవాడు వెంటనే తన బ్యాగ్ నుంచి టిష్యూ పేపర్ తీసి.. అక్కడ నేల మీద పడిన కూల్ డ్రింక్ తుడవడానికి ప్రయత్నం మొదలు పెట్టాడు. ఈ దృశ్యాన్ని చూసి.. అక్కడ ఉన్న ఇతర ప్రయాణీకులు షాక్ అయ్యారు. ఒక పిల్లవాడు ఇలాంటి పని చేస్తాడని ఎవరూ ఊహించఉండరు. కనుక ఇలా జరిగింది. చాలా మందికి ఎక్కడ బడితే అక్కడ చెత్త వేయడం లేదా బహిరంగ ప్రదేశం కదా ఎలా ఉంటే మనకు ఎందుకు అని భావించే అలవాటు ఉంటుంది. అటువంటి వ్యక్తులకు ఈ బాలుడు తన చిట్టి చిట్టి చేతులతో పెద్ద పాఠం నేర్పించాడు.
ఈ వీడియోను ఎవరు తీశారో ఇంకా తెలియలేదు. ఈ సంఘటన ఏ నగరంలో జరిగిందో స్పష్టంగా తెలియదు. అయినప్పటికీ, ఆ పిల్లవాడు పెద్దలకు ఆదర్శంగా నిలుస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంది. ఇది కేవలం ఒక సాధారణ వీడియో కాదు.. మానవత్వం , మంచి విలువల సంగ్రహావలోకనం. ఈ క్లిప్‌ను Insta @ghantaa అనే ఖాతా నుంచి షేర్ చేశారు. పిల్లవాడిని రకరకాల కామెంట్స్ తో ప్రశంసిస్తున్నారు. తల్లిదండ్రుల సరైన పెంపకం ప్రభావం పిల్లల ప్రవర్తనలో స్పష్టంగా కనిపిస్తుందని కొందరు చెబుతుండగా.. బాధ్యత వయస్సుపై ఆధారపడి ఉండదని మరికొందరు అంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..