AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: జుట్టుతో కళాకృతిని సృష్టించిన హెయిర్ స్టైలిస్ట్.. కొత్తరకం ‘పోనీ స్టైల్’ వీడియో వైరల్

అందరూ తమవైపు దృష్టిని సారించాలని.. పది మంది తమని ఆకర్షించాలని భావించే వ్యక్తులు వింతగా ఉండే ఫ్యాషన్ ట్రెండ్‌లను సృష్టిస్తారు. ఇక్కడ ఒక హెయిర్ స్టైలిస్ట్ కూడా అలాగే చేశాడు. అవును ఒక హెయిర్‌స్టైలిస్ట్ మేము భిన్నంగా ఉన్నాము, మా శైలి భిన్నంగా ఉంటుంది అంటూ సరికొత్త హెయిర్ స్టైల్ ను సృష్టించాడు. మోడల్‌లలో ఒకరికి గుర్రం నేపథ్య కేశాలంకరణను రూపొందించాడు.

Viral Video: జుట్టుతో కళాకృతిని సృష్టించిన హెయిర్ స్టైలిస్ట్.. కొత్తరకం 'పోనీ స్టైల్' వీడియో వైరల్
Viral Video
Surya Kala
|

Updated on: Feb 09, 2024 | 9:23 PM

Share

ఫ్యాషన్ ప్రపంచం గురించి నేటి యువతకు పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు. సోషల్ మీడియా ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత  ఫ్యాషన్ పై ప్రతి ఒక్కరికీ అవగాహన పెరుగుతోంది. అంతేకాదు రకరకాల ఫ్యాషన్ స్టైల్స్ రోజు రోజుకు అప్‌డేట్ అవుతూనే ఉన్నాయి. దుస్తులు, బూట్లు, మేకప్ నుండి హెయిర్ స్టైల్ వరకు, ఫ్యాషన్ స్టైల్ మారుతూనే ఉంటున్నాయి. అందరూ తమవైపు దృష్టిని సారించాలని.. పది మంది తమని ఆకర్షించాలని భావించే వ్యక్తులు వింతగా ఉండే ఫ్యాషన్ ట్రెండ్‌లను సృష్టిస్తారు. ఇక్కడ ఒక హెయిర్ స్టైలిస్ట్ కూడా అలాగే చేశాడు. అవును ఒక హెయిర్‌స్టైలిస్ట్ మేము భిన్నంగా ఉన్నాము, మా శైలి భిన్నంగా ఉంటుంది అంటూ సరికొత్త హెయిర్ స్టైల్ ను సృష్టించాడు. మోడల్‌లలో ఒకరికి గుర్రం నేపథ్య కేశాలంకరణను రూపొందించాడు. ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా చాలా ట్రెండీ హెయిర్ స్టైల్‌లు ఉన్నాయి. అయితే ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఈ హెయిర్ స్టైలిస్ట్ హార్స్ థీమ్‌తో కూడిన హెయిర్ ఆర్ట్ వర్క్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

వైరల్ వీడియో హెయిర్ ఆర్ట్ అనే ఫన్నీ క్యాప్షన్‌తో @ThebestFigen అనే X ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోలో హెయిర్‌స్టైలిస్ట్ ఒక యువతి జుట్టుని గుర్రపు నేపథ్య కళాకృతిగా మలచినట్లు చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి:

వైరల్ వీడియోలో హెయిర్‌స్టైలిస్ట్ ఒక యువతి జుట్టుని అందమైన గుర్రంగా మలిచాడు. చివరలో సెట్టింగ్ స్ప్రేతో జుట్టును అమర్చడం చూడవచ్చు. ఈ హెయిర్ ఆర్ట్ వర్క్ తో యువతి తలపై చిన్న నిజమైన గుర్రం కూర్చున్నట్లు కనిపిస్తోంది.

ఫిబ్రవరి 08న షేర్ చేసిన ఈ వీడియోకు రెండున్నర లక్షలకు పైగా వ్యూస్ ను లైక్స్ ను సొంతం చేసుకుంది.  ఇక ఈ కొత్త తరహా హెయిర్ స్టైల్ చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఒక వినియోగదారు,  ఈ హెయిర్ స్టైల్ చూడటానికి చాలా ఫన్నీగా ఉంది అని వ్యాఖ్యానించారు. మరొక వినియోగదారు ఇలా  నిజంగా అద్భుతమైన కళ. హెయిర్‌స్టైలిస్ట్‌ల సృజనాత్మకత..  కళకు నేను నమస్కరిస్తున్నాను అని కామెంట్ చేయగా.. మరొకరు అద్భుతమైన హెయిర్ ఆర్ట్” అని వ్యాఖ్యానించారు. చాలా మంది ఈ హెయిర్‌స్టైల్ ఫన్నీగా కనిపించినప్పటికీ నిజంగా అద్భుతంగా ఉందని అన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి