Viral: సింహాలకు సుస్సుపోయించిన హిప్పో.. దెబ్బకు పరుగులు పెట్టేశాయిగా.. చూస్తే షాకవుతారతే!
అడవికి రారాజు సింహం. ఇది జగమెరిగిన సత్యం. అయితే ఆ రాజును కూడా సుస్సు పోయిస్తాయి కొన్ని జంతువులు. ఏంటి నమ్మట్లేదా.!
అడవికి రారాజు సింహం. ఇది జగమెరిగిన సత్యం. అయితే ఆ రాజును కూడా సుస్సుపోయిస్తాయి కొన్ని జంతువులు. ఏంటి నమ్మట్లేదా.! గజరాజు లేదా హిప్పోపొటామాస్ లాంటి భారీ జంతువులు సింహాలను పరుగులు పెట్టిస్తాయి. అందుకు నిదర్శనంగా నిలిచే ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.
వైరల్ వీడియో ప్రకారం.. ఓ హిప్పో నదిని దాటుతుండగా.. అటుగా వెళ్తున్న నాలుగు సింహాలు దాన్ని చూస్తాయి. పక్కా స్కెచ్ వేసి మరీ.. దాన్ని ఎరగా చేసుకోవాలని నీళ్లలోకి దిగుతాయి. ఒక్కసారిగా నాలుగు సింహాలు తనపై యుద్ధానికి దండెత్తినా.. హిప్పో ఏమాత్రం వెనకడుగు వేయలేదు. వాటిపైకి దాడికి దిగింది. అంతే! దెబ్బకు సింహాలు సుస్సుపోసుకున్నాయి. నీటిలో నుంచి బ్రతుక జీవుడా అనుకుంటూ.. తమ ప్రాణాలను కాపాడుకున్నాయి. ఇక్కడొక ఇంటరెస్టింగ్ విషయమేంటంటే.. సింహం, పులి బలం కంటే.. హిప్పో బలం చాలా ఎక్కువ. అందుకేనేమో.. మృగరాజు.. ఆ బలమైన జంతువుకు భయపడి పరుగులు పెట్టింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది కాస్తా పాత వీడియో అయినప్పటికీ.. మరోసారి నెట్టింట చక్కర్లు కొడుతోంది. లేట్ ఎందుకు మీరూ ఓసారి లుక్కేయండి.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..