AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video:పెరుగు వడను అమ్మే విక్రేత నైపుణ్యనానికి నెటిజన్లు ఫిదా.. ప్లయింగ్ దహి వడ వీడియో వైరల్..

సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు తరచుగా వైరల్ అవుతున్నప్పటికీ .. ప్రస్తుతం 'ఫ్లయింగ్ దహీ వడ' అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Viral Video:పెరుగు వడను అమ్మే విక్రేత నైపుణ్యనానికి నెటిజన్లు ఫిదా.. ప్లయింగ్ దహి వడ వీడియో వైరల్..
Flying Dahi Vada Video Vira
Surya Kala
|

Updated on: May 11, 2022 | 8:12 PM

Share

Viral Video: పెరుగు వడలు(Dahi Vada) గురించి ఆహారప్రియులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ పెరుగు వడను ప్రజలు అనేక రకాలుగా తయారు చేసినా, నార్త్ ఇండియన్ పద్ధతిలో చేసే దహీ వడ రుచి మాత్రం అద్భుతం. ఈ ఫుడ్  రెసిపీ ఉత్తర భారత దేశంలో చాలా ఫేమస్.. అయితే ఇప్పుడు ఈ డిష్ దేశవ్యాప్తంగా దొరుకుతోంది. ప్రజలు ఇష్టపడే స్ట్రీట్ ఫుడ్ లో(Street Food) దహీ వడ ప్రముఖంగా చెప్పవచ్చు. ఈ ఆహారం ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిదని చెబుతారు. సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు తరచుగా వైరల్ అవుతున్నప్పటికీ .. ప్రస్తుతం ‘ఫ్లయింగ్ దహీ వడ’ అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పెరుగు వడను దుకాణదారుడి అమ్మే విధానాన్ని ప్రజలు ఇష్టపడుతున్నారు. అయితే మరికొందరు అతని సర్వ్ చేస్తోన్న విధానంపై విమర్శలు కూడా చేస్తున్నారు.

ప్లేట్‌ని గాలిలో ఎగర వేస్తూ.. దుకాణదారుడు దహీ వడను విక్రయిస్తున్న విధానం ఆ వీడియోలో చూడవచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్లేట్‌లో వడ , పెరుగు రెండూ ఉన్నాయి. అయినప్పటికీ గాలిలో ప్లేట్ ఎగరవేసిన ఎక్కడా.. వడ కానీ, పెరుగు కానీ కిందపడిపోలేదు. ఇలా చేయడం కూడా ఒక రకమైన నైపుణ్యం కిందకే లెక్క. ఎందుకంటే సాధారణంగా ఎవరైనా ఇలా గాలిలో ప్లేట్ ఎగరవేస్తే.. అందులోని ఆహారపదార్ధాలు నేలమీద పడడం ఖాయం. అయితే ఈ స్ట్రీట్ ఫుడ్ విక్రేత  నైపుణ్యం .. ప్లేట్ లో ఉన్న పదార్ధాలు కిందపడకున్నా.. మళ్ళీ ఆ ప్లేట్ తిరిగి చేతుల్లోకి చేరుకునే విధంగా చేయడం అతనికే సొంతమని చెప్పవచ్చు.  ఈ ‘ఫ్లయింగ్ దహీ వడ’ వీడియో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ కి చెందినదని తెలుస్తోంది. ఈ పెరుగు వడ ధర రూ. 40.. అయితే దీని ధర చాలా ఎక్కువ అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

‘ఫ్లయింగ్ దహీ వడా’ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ourcollecti0n అనే ఐడితో షేర్ చేయబడింది. ఇప్పటివరకు 1 మిలియన్ వ్యూస్ ని  32 వేల లైక్స్ ను సొంతం చేసుకుంది.  వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు. ఒక నెటిజన్  ‘విక్రేతనుద్దేశించి.. ఇలా సర్కస్ చేస్తూ దహి వడ అమ్మాల్సి అవసరం లేదు.. మీరు దీన్ని నేరుగా కస్టమర్ కు అందించవచ్చు అని కామెంట్ చేశారు. మరికొందరు.. వాహ్ క్యా కాచ్ హై అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..