AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కొలనులో పడిన పిల్ల ఏనుగు.. ప్రాణాలకు తెగించి కాపాడిన ఏనుగులు.. ఫిదా అవుతోన్న నెటిజన్స్

Viral Video: తల్లిదండ్రులకు పిల్లలే గొప్ప సంపద. వెలకట్టలేని ఆస్తి. మనుషుల్లోనైనా, మూగజీవాల్లోనైనా తల్లీబిడ్డల ప్రేమానురాగాలు ఒకేలా ఉంటాయి. పిల్లలు ఆపదలో ఉంటే వారిని రక్షించేందుకు తల్లిదండ్రులు ఏమైనా చేస్తారనడానికి ఈ వీడియో నిదర్శనం.

Viral Video: కొలనులో పడిన పిల్ల ఏనుగు.. ప్రాణాలకు తెగించి కాపాడిన ఏనుగులు.. ఫిదా అవుతోన్న నెటిజన్స్
Elephants Save Calf
Basha Shek
|

Updated on: Aug 14, 2022 | 9:10 PM

Share

Viral Video: తల్లిదండ్రులకు పిల్లలే గొప్ప సంపద. వెలకట్టలేని ఆస్తి. మనుషుల్లోనైనా, మూగజీవాల్లోనైనా తల్లీబిడ్డల ప్రేమానురాగాలు ఒకేలా ఉంటాయి. పిల్లలు ఆపదలో ఉంటే వారిని రక్షించేందుకు తల్లిదండ్రులు ఏమైనా చేస్తారనడానికి ఈ వీడియో నిదర్శనం. కొలనులో పడిన పిల్ల ఏనుగును రెండు ఏనుగులు రక్షించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యానిమల్‌ లవర్స్, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియోను గాబ్రియేల్ కార్నో అనే వ్యక్తి ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఈ వీడియోలో, తల్లి ఏనుగు, పిల్ల ఏనుగు జూలో ఏర్పాటుచేసిన ఓ కొలనులో నీరు తాగడానికి వెళతారు. అయితే దాహం తీర్చుకునే క్రమంలో ప్రమాదవశాత్తు కొలనులో పడిపోతుంది పిల్ల ఏనుగు. దానిని రక్షించుకొందుకు పెద్ద ఏనుగు అనేక ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఎలాంటి ఫలితముండదు. ఇంతలో పక్కనే ఉన్న మరో పెద్ద ఏనుగు అక్కడికి వస్తుంది. ఇద్దరూ కలిసి కొలనులోకి దిగుతారు. ఈత రాక కొట్టుమిట్టాడుతోన్న పిల్ల ఏనుగును బయటకు లాక్కొస్తాయి.

కాగా ఈ సంఘటన దక్షిణ కొరియా రాజధాని సియోలోని ఓ జూపార్క్‌లో జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియోను షేర్ చేసిన కొద్దిగంటల్లోనే లక్షల మంది వీక్షించారు. వేలాదిమంది లైక్‌లు, కామెంట్ల వర్షం కురిపించారు. మనుషుల కంటే మూగజీవాలు ఎంతో గొప్పవి. పిల్లలను కాపాడుకునేందుకు అవి ఎంతకైనా తెగిస్తాయి అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి అందరి మెప్పు పొందిన ఈ వైరల్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
తెలంగాణ పల్లెలకు కేంద్రం ఎన్ని వేల కోట్లు ఇచ్చిందో తెలుసా..?
తెలంగాణ పల్లెలకు కేంద్రం ఎన్ని వేల కోట్లు ఇచ్చిందో తెలుసా..?
ఇంటి కోసం పునాది తవ్వుతుండగా.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి కోసం పునాది తవ్వుతుండగా.. మెరుస్తూ కనిపించడంతో..
రెండో భద్రాద్రి ఒంటిమిట్టలో వార్షిక బ్రహ్మోత్సవాల సందడి ప్రారంభం
రెండో భద్రాద్రి ఒంటిమిట్టలో వార్షిక బ్రహ్మోత్సవాల సందడి ప్రారంభం
ఇండియాలోనే పెద్ద చెత్త సినిమా.. అయినా కుర్రాళ్లకు పిచ్చెక్కించేసి
ఇండియాలోనే పెద్ద చెత్త సినిమా.. అయినా కుర్రాళ్లకు పిచ్చెక్కించేసి
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి షాకిచ్చిన కేంద్రం..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి షాకిచ్చిన కేంద్రం..
అన్నంలోకి అదిరిపోయే దొండకాయ టమోటా రోటి పచ్చడి
అన్నంలోకి అదిరిపోయే దొండకాయ టమోటా రోటి పచ్చడి
Video: మ్యాచ్‌ను మలుపు తిప్పిన సీన్ మిస్సయ్యారా.. ఇదిగో వీడియో
Video: మ్యాచ్‌ను మలుపు తిప్పిన సీన్ మిస్సయ్యారా.. ఇదిగో వీడియో
ఈ సినిమా నన్ను కట్టిపడేసింది.. యంగ్ హీరో మూవీపై నాని ప్రశంసలు
ఈ సినిమా నన్ను కట్టిపడేసింది.. యంగ్ హీరో మూవీపై నాని ప్రశంసలు
నాకౌట్‌లో తోపు ప్లేయర్‌గా శాంసన్.. టాప్ 5 లిస్ట్ ఇదే..
నాకౌట్‌లో తోపు ప్లేయర్‌గా శాంసన్.. టాప్ 5 లిస్ట్ ఇదే..
ఖాళీ కడుపుతో కడుపుతో కొబ్బరి నీళ్లు తాగితే ఏమవుతుందో తెలిస్తే..
ఖాళీ కడుపుతో కడుపుతో కొబ్బరి నీళ్లు తాగితే ఏమవుతుందో తెలిస్తే..