AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బాలుడిని పొడవడానికి వచ్చిన ఎద్దు..ఆవు ఏం చేసిందో చూడండి… ఇది ఏఐ వీడియోనా? కాదా మీరే చెప్పండి!

మనుషుల్లో రకరకాల మనస్తత్వం కలవారు ఉన్నట్లు జంతువుల్లో కూడా అలాంటి వేరియేషన్స్‌ కనపడుతుంటాయి. ముఖ్యంగా పాడి పశువుల్లో కొన్ని తన యజమాని కుటుంబం పట్ల అమితమైన ప్రేమను, విశ్వాసాన్ని కనబరుస్తుంటాయి. ఎవరైనా తన యజమానికి కొట్టడానికి ప్రయత్నించినప్పుడు పశువులు అడ్డు తగులుతుండటం...

Viral Video: బాలుడిని పొడవడానికి వచ్చిన ఎద్దు..ఆవు ఏం చేసిందో చూడండి... ఇది ఏఐ వీడియోనా? కాదా మీరే చెప్పండి!
Cow Save Child
K Sammaiah
|

Updated on: Nov 07, 2025 | 8:35 PM

Share

మనుషుల్లో రకరకాల మనస్తత్వం కలవారు ఉన్నట్లు జంతువుల్లో కూడా అలాంటి వేరియేషన్స్‌ కనపడుతుంటాయి. ముఖ్యంగా పాడి పశువుల్లో కొన్ని తన యజమాని కుటుంబం పట్ల అమితమైన ప్రేమను, విశ్వాసాన్ని కనబరుస్తుంటాయి. ఎవరైనా తన యజమానికి కొట్టడానికి ప్రయత్నించినప్పుడు పశువులు అడ్డు తగులుతుండటం చూస్తుంటాం. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. తన యజమాని ఇంటిలోని ఓ చిన్నపిల్లవాడిని కొమ్ములతో పొడవడానికి వచ్చిన మరో పశువు నుంచి ఓ ఆవు చాకచక్యంగా కాపాడుతుంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది.

వీడియోలో ఒక చిన్న పిల్లవాడు పొలంలో మట్టితో ఆడుకుంటున్నాడు. ఒక ఎద్దు అతన్ని చూసి పరిగెత్తుకుంటూ వచ్చింది. పిల్లవాడిని కొమ్ములతో పొడవానికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఒక ఆవు అక్కడున్న పిల్లవాడికి ‘రక్షకుడిగా’ మారింది. వేగంగా ఉరుకొచ్చిన ఎద్దు దాదాపు బాలుడిపైకి దూకింది. ఈ క్రమంలో అంతే వేగంగా పరిగెత్తుకుంటు వచ్చిన ఆవు బాలుడికి ఏమీ కాకుండా రక్షిస్తుంది. పొడవడానికి వచ్చిన ఎద్దును అడ్డుకుంటూ బాలుడిని తన కడుపు కింద దాస్తుంది. ఆ క్రమంలో ఎద్దు కూడా దాడి చేయడానికి ధైర్యం చేయలేదు. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి ఆ పిల్లవాడిని పక్కకు తీసుకెళ్లడం వీడియోలో కనిపిస్తుంది.

వీడియో చూడండి:

‘నిఖిల్ చౌదరి’ అనే ఖాతా నుండి X హ్యాండిల్ పేజీలో ఈ వీడియో పోస్ట్ చేశారు. వీడియో చూసిన ఒక నెటిజన్, “ఆవు బిడ్డను రక్షించడం ద్వారా తన విధేయతను చూపించింది” అని రాశాడు. మరికొంత మంది నెటిజన్లు రకరాకాలుగా కామెంట్స్‌ పెడుతున్నారు. అయితే ఇది ఏఐ ద్వారా క్రియేట్‌ చేసిన వీడియో అంటూ పలువురు అనుమానిస్తున్నారు.

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!