AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదెక్కడి వింత.. హెడ్‌లైట్లు లేని ప్రభుత్వ బస్సు.. మొబైల్ టార్చ్‌తో దారి చూపించిన కండక్టర్!

ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు అనగానే సామాన్య ప్రజలకు గుర్తొచ్చేది కనీస సౌకర్యాల లేమి, ఫిట్‌నెస్ లేని వాహనాలు. అయితే, కర్ణాటకలో ఇటీవల జరిగిన ఒక సంఘటన రవాణా శాఖ నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచింది. కారుచీకట్లో హెడ్‌లైట్లు పని చేయని ఒక ప్రభుత్వ బస్సును, కండక్టర్ మొబైల్ ఫోన్ టార్చ్ వెలుతురులో డ్రైవర్ నడిపిన వైనం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

ఇదెక్కడి వింత.. హెడ్‌లైట్లు లేని ప్రభుత్వ బస్సు.. మొబైల్ టార్చ్‌తో దారి చూపించిన కండక్టర్!
Bus Headlights Failure
Jyothi Gadda
|

Updated on: Jul 06, 2026 | 12:42 PM

Share

కర్ణాటక ప్రభుత్వ రవాణా సంస్థ నిర్లక్ష్యానికి అద్దం పట్టేలా కల్యాణ కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ (KKRTC) బస్సుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. వైరల్‌ వీడియో ప్రకారం.. కల్యాణ కర్ణాటక రోడ్డు రవాణా సంస్థకి చెందిన ఒక బస్సు రాత్రి వేళ ప్రయాణికులతో ప్రయాణిస్తోంది. మార్గమధ్యంలో హఠాత్తుగా బస్సు రెండు ప్రధాన హెడ్‌లైట్లు పూర్తిగా పనిచేయడం ఆగిపోయాయి. రోడ్డుపై కనీసం అడుగు దూరం కూడా కనిపించని కారుచీకటి. అలాంటి సమయంలో డ్రైవర్ బస్సును పక్కన ఆపి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సింది పోయి, ప్రయాణికుల ప్రాణాలను ఘోరమైన ప్రమాదంలోకి నెట్టేసేలా ఒక వింత నిర్ణయం తీసుకున్నారు.

మొబైల్ టార్చ్‌తో సాహసయాత్ర:

బస్సు హెడ్‌లైట్లు వెలగకపోవడంతో, ఆ బస్సు కండక్టర్ వినూత్నంగా ఆలోచించి డ్రైవర్ సీటు పక్కన విండ్‌షీల్డ్ వద్ద నిలబడ్డాడు. తన స్మార్ట్‌ఫోన్‌లోని టార్చ్ ఆన్ చేసి రోడ్డుపైకి చూపిస్తూ డ్రైవర్‌కు దారి చూపించడం ప్రారంభించాడు. డ్రైవర్ కూడా ఆ చిన్న మొబైల్ లైట్ వెలుతురును చూసుకుంటూనే బస్సును వేగంగా ముందుకు పోనిచ్చాడు. బస్సులో ఉన్న ప్రయాణికులు ఈ భయానక, విచిత్రమైన దృశ్యాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. వారిలో కొందరు ఈ మొత్తం ఉదంతాన్ని తమ మొబైల్‌ ఫోన్లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

అధికారులపై నెటిజన్ల ఆగ్రహం:

ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు, ప్రజా సంఘాలు కేకేఆర్‌టీసీ, కర్ణాటక రవాణా శాఖపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఒకవేళ రోడ్డుపై ఏదైనా మలుపు ఉంటే లేదా వేరే వాహనం ఎదురొస్తే ఎంత పెద్ద ప్రమాదం జరిగేది? వందలాది మంది ప్రాణాలతో చెలగాటమాడుతారా? అంటూ ఐఏఎస్ అధికారులు, రవాణా శాఖ మంత్రులను ట్యాగ్ చేస్తూ నిలదీస్తున్నారు. బస్సులకు కనీస నిర్వహణ సరిగ్గా లేకపోవడమే ఇందుకు కారణమని, బాధ్యులైన డ్రైవర్, కండక్టర్‌లతో పాటు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇచ్చిన డిపో మేనేజర్‌పై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా? మీ ఆరోగ్యానికి ముప్పు
ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా? మీ ఆరోగ్యానికి ముప్పు
ది ప్యారడైజ్‌ ఆ స్టార్ నటుడు కూడా ఉన్నడా.!!
ది ప్యారడైజ్‌ ఆ స్టార్ నటుడు కూడా ఉన్నడా.!!
ఆసిఫాబాద్‌ కలెక్టరేట్‌లో వృద్దదంపతుల ఆత్మహత్యాయత్నం
ఆసిఫాబాద్‌ కలెక్టరేట్‌లో వృద్దదంపతుల ఆత్మహత్యాయత్నం
ఆముదం ఆకుల సీక్రెట్స్ తెలిస్తే షాక్ అవుతారు..అద్భుత ఔషధ గుణాలుఇవే
ఆముదం ఆకుల సీక్రెట్స్ తెలిస్తే షాక్ అవుతారు..అద్భుత ఔషధ గుణాలుఇవే
పరగడుపున నెయ్యి, తులసి రసం తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!
పరగడుపున నెయ్యి, తులసి రసం తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!
హైదరాబాద్‌‌లో సీన్‌ ఛేంజ్‌.. కాంగ్రెస్‌ వ్యూహాత్మక అడుగులు..
హైదరాబాద్‌‌లో సీన్‌ ఛేంజ్‌.. కాంగ్రెస్‌ వ్యూహాత్మక అడుగులు..
తొలిరోజే హీటెక్కిన గొడవలు.. గాయాలతో ముగిసిన టాస్క్
తొలిరోజే హీటెక్కిన గొడవలు.. గాయాలతో ముగిసిన టాస్క్
బ్లడ్ షుగర్,అరికాళ్ల మంటలకు చెక్ పెట్టే అమృతం! మెంతుల కాంబినేషన్
బ్లడ్ షుగర్,అరికాళ్ల మంటలకు చెక్ పెట్టే అమృతం! మెంతుల కాంబినేషన్
చెడ్డీగ్యాంగ్‌ కలకలం.. అపార్ట్‌మెంట్, విల్లా కమిటీలకు కీలక సూచనలు
చెడ్డీగ్యాంగ్‌ కలకలం.. అపార్ట్‌మెంట్, విల్లా కమిటీలకు కీలక సూచనలు
రెస్టారెంట్ స్టైల్‌లో దమ్ బిర్యానీ.. ఇంట్లో ఎలా చేయాలంటే?
రెస్టారెంట్ స్టైల్‌లో దమ్ బిర్యానీ.. ఇంట్లో ఎలా చేయాలంటే?