AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దక్షిణ భారతీయులలో కర్లీ హెయిర్ వెనుక అసలు రహస్యం ! సైన్స్‌ చెప్పిన అసలు నిజం తెలిస్తే..

మీరు ఎప్పుడైనా గమనించారా? భారతదేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే దక్షిణ భారతదేశంలో చాలా మందికి జుట్టు రింగులు తిరిగి లేదా ఉంగరాల రూపంలో ఒత్తుగా ఉంటుంది. దీనిని కేవలం అందం అనుకుంటే పొరపాటే.. దీని వెనుక వేల సంవత్సరాల మానవ పరిణామ క్రమం, ఆసక్తికరమైన సైన్స్ దాగి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ అంతుచిక్కని మిస్టరీ ఏంటో ఇప్పుడు చూద్దాం..

దక్షిణ భారతీయులలో కర్లీ హెయిర్ వెనుక అసలు రహస్యం ! సైన్స్‌ చెప్పిన అసలు నిజం తెలిస్తే..
South Indian Curly Hair
Jyothi Gadda
|

Updated on: Jul 06, 2026 | 11:45 AM

Share

మీరు ఎప్పుడైనా గమనించారా? భారతదేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే దక్షిణ భారతదేశంలో చాలా మందికి జుట్టు రింగులు తిరిగి లేదా ఉంగరాల రూపంలో ఒత్తుగా ఉంటుంది. దీనిని కేవలం అందం అనుకుంటే పొరపాటే.. దీని వెనుక వేల సంవత్సరాల మానవ పరిణామ క్రమం, ఆసక్తికరమైన సైన్స్ దాగి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ అంతుచిక్కని మిస్టరీ ఏంటో ఇప్పుడు చూద్దాం..

దక్షిణ భారతీయులలో కర్లీ హెయిర్ వెనుక అసలు రహస్యం..

దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల ప్రజలలో రింగుల జుట్టు లేదా ఉంగరాల జుట్టు ఎక్కువగా కనిపించడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇది కేవలం ఒక ప్రాంతీయ వైవిధ్యం మాత్రమే కాదు, దీని వెనుక మానవ జీవశాస్త్రం, జన్యువులు, వేల సంవత్సరాల పరిణామ క్రమం దాగి ఉన్నాయని మీకు తెలుసా..? మానవ జన్యుశాస్త్ర పరిశోధనల ప్రకారం, దక్షిణ భారతీయుల డిఎన్‌ఏలో ఏన్షియంట్ ఆన్సిస్ట్రల్ సౌత్ ఇండియన్ జన్యువుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాదాపు 70,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికా ఖండం నుండి వలస వచ్చి దక్షిణ ఆసియా తీర ప్రాంతాల్లో స్థిరపడిన తొలి మానవ సమూహాల వారసత్వమే ఈ జుట్టు తత్వం. వీరి జుట్టు మూలాలు చర్మం లోపల వంకరగా ఉండటం వల్ల, జుట్టు బయటకు పెరిగేటప్పుడు రింగులుగా మారుతుంది.

ప్రధాన కారణం జన్యువులే :

ఒక వ్యక్తికి ఎలాంటి జుట్టు ఉంటుందనేది 99 శాతం వారి తల్లిదండ్రుల నుండి వారసత్వంగా వచ్చే జన్యువులపైనే ఆధారపడి ఉంటుంది. జుట్టు ఆకారాన్ని చర్మం కింద ఉండే హెయిర్ ఫాలీకల్స్ వెంట్రుకల కుదుళ్లు నిర్ణయిస్తాయి.

ఇవి కూడా చదవండి

గుండ్రటి ఆకారంలో ఉండే ఫాలీకల్స్ నుండి స్ట్రెయిట్ జుట్టు వస్తుంది.

ఓవల్ (గుడ్డు) ఆకారంలో ఉంటే ఉంగరాల జుట్టు వస్తుంది.

వంకరగా లేదా కాస్త నొక్కినట్టుండే ఫాలీకల్స్ నుండి రింగుల జుట్టు పెరుగుతుంది.

పరిశోధకుల ప్రకారం, ఏదో ఒకే ఒక్క జన్యువు కాకుండా, బహుళ జన్యువుల కలయిక వల్ల ఈ జుట్టు తత్వం ఏర్పడుతుంది.

సూర్యరశ్మి నుండి రక్షణ :

ఇటీవల ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రచురించిన పరిశోధనల ప్రకారం, కర్లీ హెయిర్ అనేది ఒక అద్భుతమైన సహజ రక్షణ కవచం. దక్షిణ భారతదేశం భూమధ్యరేఖకు దగ్గరగా ఉండి, ఎక్కువ ఉష్ణోగ్రతలు, తీవ్రమైన ఎండలను కలిగి ఉంటుంది. ఈ వాతావరణంలో నివసించే ప్రజల మెదడు వేడెక్కిపోకుండా కాపాడటంలో రింగుల జుట్టు కీలక పాత్ర పోషిస్తుంది.

శరీర ఉష్ణోగ్రత నియంత్రణ:

నిటారుగా ఉండే స్ట్రెయిట్ హెయిర్ తల చర్మానికి అంటుకుని ఉండి ఎండ వేడిని నేరుగా లోపలికి పంపుతుంది. కానీ, రింగుల జుట్టు తలపై ఒక స్పంజ్ లాంటి పొరను ఏర్పాటు చేస్తుంది. ఇది సూర్యరశ్మిని అడ్డుకోవడమే కాకుండా, గాలి ఆడేలా చేసి తల భాగాన్ని చల్లగా ఉంచుతుంది. దీనివల్ల శరీరం ఎక్కువగా చెమటను కోల్పోవాల్సిన అవసరం రాదు, తద్వారా శరీరంలోని నీరు, ఎలక్ట్రోలైట్స్ వృథా కాకుండా ఆదా అవుతాయి. దక్షిణ భారత వాతావరణానికి అనుకూలంగా, మానవ శరీరం తనను తాను కాపాడుకోవడానికి ఎంచుకున్న ఒక అద్భుతమైన పరిణామ క్రమమే ఈ రింగుల జుట్టు. తరతరాలుగా తమ తెగలలోనే వివాహాలు చేసుకునే ఆచారం కూడా ఈ జన్యువులను తర్వాతి తరాలకు బలంగా చేరవేయడానికి కారణమైంది.

నేడు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది తమ సహజసిద్ధమైన రింగుల జుట్టును గర్వంగా ప్రదర్శిస్తున్నారు. సైన్స్ ప్రకారం ఇది కేవలం ఒక శారీరక లక్షణం కాదు.. భారతదేశ సంపన్న జీవవైవిధ్యానికి మరియు ఘనమైన చరిత్రకు నిదర్శనం. కాబట్టి, సౌత్ ఇండియన్ల కర్లీ హెయిర్ కేవలం ఒక స్టైల్ మాత్రమే కాదు.. అది ప్రకృతి ప్రసాదించిన ఒక సూపర్ పవర్!

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us