AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఏసీ కోచ్‌లో కూలింగ్ లేదంటూ ప్యాసింజర్స్ ఫిర్యాదు.. టెక్నిషియన్ వచ్చి చూడగా లోపల

లక్నో–బరౌని ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ చల్లదనం తగ్గిందని ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో టెక్నీషియన్లు డక్ట్‌ తెరిచి చూడగా షాక్‌ అయ్యారు. సాధారణ మెయింటెనెన్స్‌ చెక్‌గా ప్రారంభమైన ఈ తనిఖీ.. చివరికి స్మగ్లింగ్‌ రహస్యాన్ని వెలికితీసింది. ఆ ఇంట్రస్టింగ్ డీటేల్స్ ఈ కథనంలో ..

Viral Video: ఏసీ కోచ్‌లో కూలింగ్ లేదంటూ ప్యాసింజర్స్ ఫిర్యాదు.. టెక్నిషియన్ వచ్చి చూడగా లోపల
Liquor Bottles
Ram Naramaneni
|

Updated on: Aug 14, 2025 | 4:07 PM

Share

అది లక్నో–బరౌని ఎక్స్‌ప్రెస్‌ (రైలు నంబర్ 15204). రైలు ప్రయాణం సవ్యంగానే సాగుతుంది. అయితే ఒక ఏసీ కోచ్‌లోని పాసింజర్స్.. అస్సలు చల్లదనం లేదని.. ఉక్కపోతగా ఉందంటూ ఫిర్యాదు చేశారు. దీంతో రైల్వే సిబ్బంది వెంటనే టెక్నీషియన్లను పిలిపించారు. టెక్నీషియన్లు డక్ట్‌ కవర్‌ తీసి లోపల చూడగానే షాక్‌ అయ్యారు. అక్కడ మోటార్‌ సమస్కో.. గ్యాస్‌ లీకేజీ ఏమీ లేదు.. బదులుగా లోపల వరుసగా పేర్చిన సీసాలు కనిపించాయి. అవి సాధారణ సీసాలు కావు. లిక్కర్ సీసాలు. మొత్తం 316 విస్కీ బాటిళ్లను సీజ్ చేశారు. వాటిలో 256 ఆఫీసర్స్ ఛాయిస్ బాటిళ్లు ,  60 ఆఫ్టర్ డార్క్ బ్లూ విస్కీ బాటిల్స్ ఉన్నాయి. మొత్తం దాదాపు 57 లీటర్ల అక్రమ మద్యం ఉంది.

వెంటనే రైల్వే అధికారులు అప్రమత్తమై.. మొత్తం స్టాక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సీసాలను రైలులో ఎవరు దాచారన్న విషయంపై పూర్తి స్థాయి దర్యాప్తు మొదలైంది. ఈ కోచ్‌ను మద్యం అక్రమ రవాణా కోసం వాడినట్టు అనుమానిస్తున్నారు. ఘటనపై సోన్‌పూర్ డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM) స్పందిచారు.  ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి తాము చింతిస్తున్నట్లు తెలిపారు. అక్రమ మద్యాన్ని సంబంధిత అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఆపై అక్కడ కూలింగ్ సమస్యను సాల్వ్ చేసినట్లు చెప్పారు.

కాగా బీహార్‌లోని ఖగారియా జిల్లాకు చెందిన కోచ్ అటెండెంట్ ఆశిష్ కుమార్ దీని వెనుక ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. ఆశిష్ ఉత్తరప్రదేశ్ నుంచి బీహార్‌కు క్రమం తప్పకుండా మద్యం అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అంగీకరించాడు

జస్ట్ ఏదో ఏసీలో సమస్య ఉందని అనుకుంటే.. అది చివరికి పెద్ద స్మగ్లింగ్‌ రహస్యాన్ని బయటపెట్టింది. ఏసీ కూల్‌ కాకపోవడం ఇంత పెద్ద గుట్టును విప్పుతుందనుకోలేదు ఆ కోచ్‌లోని ప్యాసింజర్స్ ఆశ్చర్యపోయారు.

వీడియో దిగువన చూడండి…