Viral Video: మొసళ్లతో భీకర పోరాటం.. దీని ధైర్యం ముందు భయం ఓడింది..
మృత్యువు అంచున పోరాడిన ఒక జీబ్రా వీరోచిత గాథ ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరలవుతోంది. అనేక మొసళ్ల మధ్య చిక్కుకుని, వాటి భయంకరమైన దవడల నుంచి కూడా గాయాలతో తప్పించుకున్న ఆ సంఘటన నమ్మశక్యం కానిది. కొలనులో చావు తప్పదనుకున్న ఆ జీబ్రా, తన పోరాట స్ఫూర్తిని, ధైర్యాన్నే ఆయుధంగా మార్చుకుంది. నిస్సహాయ స్థితిలోనూ ఆ జంతువు చూపిన అద్భుతమైన ప్రతిఘటనను చూపుతున్న ఈ వైరల్ వీడియో వివరాలు, దానిపైన నెటిజన్ల స్పందన తెలుసుకుందాం.

నీటిలో మొసలితో పోరాడకూడదు అనే పాత మాట చెల్లుబాటు కాదని ఈ వీడియో నిరూపించింది. ధైర్యం భయానక పరిస్థితులను కూడా అధిగమిస్తుంది అనే నిజాన్ని ఈ ఫుటేజ్ తెలియజేస్తుంది. మొసళ్లు ఎక్కువగా ఉన్న కొలనులో జీబ్రా చిక్కుకుపోయింది.
దాని చుట్టూ అనేక మొసళ్లు చేరాయి. దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. నిజానికి, ఒకటి లేదా రెండు మొసళ్లు తమ భయంకరమైన దవడలతో జీబ్రాను ఇప్పటికే గట్టిగా పట్టుకున్నాయి. చుట్టూ మొసళ్లు ఉన్నా, కొరికినా జీబ్రా అస్సలు లొంగలేదు. అది భయంకరంగా పోరాడింది. ఒక మొసలిని తన పళ్లతో కరిచింది. మరో మొసలిని వెనుక కాళ్లతో తన్నింది.
Zebra tackles multiple crocs and safely makes it to the shore! pic.twitter.com/7JsXSUaGPX
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) September 30, 2025
దాని పోరాటం మొసళ్లకు పట్టుకోలేని సవాల్ అయింది. అది రక్షణ చేసుకుంటూనే దాడి చేస్తూ, రెండు మొసళ్ల పట్టు నుంచి దాదాపు వెంటనే తప్పించుకుంది. జీబ్రా నది ఒడ్డువైపు తుది ప్రయత్నం చేస్తుండగా, మరో మొసలి దానిని పట్టుకుంది. కానీ, ఆ పట్టు నుంచి కూడా తప్పించుకుని, సురక్షితంగా నీటి నుంచి బయటపడింది.
ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాపిస్తోంది. కోట్లాది వీక్షణలు నమోదు అయ్యాయి. జీబ్రా నమ్మశక్యం కాని ధైర్యం, పోరాట స్ఫూర్తిని అంతా ప్రశంసిస్తున్నారు.
