Viral Video: కన్నీరు పెట్టించే దృశ్యం.. యజమాని ఆఖరి చూపు కోసం పరిగెత్తుకుంటూ వచ్చిన దూడ.. ఆపై
ఈ వీడియో చూస్తే.. మూగ జీవాలు యజమానుల పట్ల ఎంత ప్రేమను కలిగి ఉంటాయో అర్థమవుతుంది. తెలియకుండానే కన్నీరు ఉబికి వస్తుంది.
Trending Video: జార్ఖండ్ (Jharkhand) రాజధాని రాంచీలో మనసు కదిలించే ఘటన ఒకటి వెలుగుచూసింది. ఓ దూడ చనిపోయిన తన యజమానికి ఆకరి వీడ్కోలు పలికేందుకు శ్మశానానికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ తర్వాత అది యజమాని మృతదేహం వద్ద కన్నీరు పెట్టడం చూసి అక్కడ ఉన్న చాలామంది హృదయం ద్రవించింది. హజరారీ బాగ్ ప్రాంతంలో ఈ ఘటన వెలుగుచూసింది. అక్కడ నివశించే ఓ వ్యక్తి.. అనారోగ్యం కన్నుమూశాడు. అయితే అతను బతికి ఉన్నప్పుడు తన ఆవుల్ని, గేదెల్ని ఎంతో ప్రేమగా చూసుకునేవారు. కాగా చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు, బంధువులు. అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో అతడికి ఆఖరి వీడ్కోలు ఇచ్చేందుకు ఓ ఆవు దూడ పరుగులు తీస్తూ వచ్చింది. యజమాని మృతదేహం ఎక్కడుందా అని ఆ ప్రాంతమంతా కలియతిరిగింది. అక్కడి జనానికి కూడా విషయం అర్థమై.. దానికి దారి ఇచ్చారు. ఎట్టకేలకు దూడ నిర్జీవంగా ఉన్న తన యజమాని మృతదేహం వద్దకు వెళ్లి.. అతని ముఖాన్ని నాకి కన్నీరు పెట్టింది. అంతేకాదు… అంత్యక్రియలు కంప్లీట్ అయ్యేవరకు అక్కడే ఉంది. దూడ ప్రవర్తనతో అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. మూగజీవి యజమాని పట్ల చూపించిన ప్రేమను చూసి నెటిజన్లు సైతం కన్నీరు పెడుతున్నారు.
వీడియో చూడండి…
झारखंड के हजारीबाग में मालिक की मौत पर श्मशान पहुंचा पालतू बछड़ा; चेहरा देखने के लिए मुंह से हटाता रहा कफन, गांववालों ने बछड़े से करवाया अंतिम संस्कार#Jharkhand #BreakingNews pic.twitter.com/zYLZPGJSjI
— shakti ojha?? (@imShaktiojha) September 15, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..