Telugu News Trending The video of the accident while doing stunts with children has gone viral on social media Telugu News
Video Viral: పిల్లలతో వెళ్లేటప్పుడు ఇలాంటి స్టంట్స్ అవసరమా.. ఆ తల్లి చేసిన పనికి తీవ్రంగా ఫైర్ అవుతున్న నెటిజన్లు
రోడ్లపై ఓవర్ స్పీడ్ అనేది ఎంత ప్రమాదకరమో మనందరికీ తెలిసిందే. అందుకే లిమిట్ స్పీడ్ లోనే వెళ్లాలి. కొన్ని రోడ్లు వేగాన్ని తట్టుకనేలా, పరిమిత వేగంతో వాహనాలు ప్రయాణించేలా నిర్మితమవుతాయి. వాటిపై ఆ స్థాయి స్పీడ్..
రోడ్లపై ఓవర్ స్పీడ్ అనేది ఎంత ప్రమాదకరమో మనందరికీ తెలిసిందే. అందుకే లిమిట్ స్పీడ్ లోనే వెళ్లాలి. కొన్ని రోడ్లు వేగాన్ని తట్టుకనేలా, పరిమిత వేగంతో వాహనాలు ప్రయాణించేలా నిర్మితమవుతాయి. వాటిపై ఆ స్థాయి స్పీడ్ లో మాత్రమే జర్నీ చేయాలి. కాదని లిమిట్ దాటితే తీవ్ర పరిణామాలు ఉంటాయి. కొన్నిసార్లు ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల వారే కాకుండా, వారితో పాటు ప్రయాణించే వారూ ప్రమాదానికి గురవుతుంటారు. ముఖ్యంగా బైక్ లు, కార్లలో ఫ్యామిలీతో వెళ్లేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్ చేయాలి. ఎక్కడా పొరపాటు జరిగేందుకు అవకాశం ఇవ్వకూడదు. మనం చేసే చిన్న తప్పు అయినా అది తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక మహిళ తనతో పాటు తన పిల్లలనూ ప్రమాదంలో పడేస్తుంది. స్టంటింగ్ అనేది పిల్లల ఆట కాదని, అందులో రిస్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని గ్రహించాలి. బైక్‌లు, కార్లతో విన్యాసాలు చేసేవారు నిత్యం ప్రమాదాలకు గురవుతుంటారు.
ఒక మహిళ తన పిల్లలను కారులో కూర్చోబెట్టుకుని రోడ్డుపై స్టంట్స్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. కారును వేగంగా నడుపుకుంటూ ప్రమాదానికి గురవుతుంది. రోడ్డుకు చెక్ పోస్ట్ గా ఏర్పాటు చేసిన ఇనుప గేట్లకు తాకి ప్రమాదానికి గురవుతుంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు చిన్నారులు కింద పడిపోతారు. మహిళకూ గాయలవుతాయి. ఈ డేంజరస్ స్టంట్స్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. కేవలం 26 సెకన్ల ఈ వీడియోను ఇప్పటి వరకు 9 లక్షలకు పైగా వ్యూస్, 20 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.