Marriage: ఒకరి తర్వాత మరొకరు.. అలా ఐదుగురిని పెళ్లి చేసుకుని వదిలేసింది.. బాధితుల్లో పోలీస్ కూడా..
ఆమెది సాధారణ కుటుంబం. టీ కొట్టుతో వచ్చే ఆదాయంతో వారి కుటుంబం నడుస్తోంది. అయితే తల్లిదండ్రులకు చాయ్ షాప్ ఉండటం ఆమెకు నచ్చలేదు. విలావంతమైన జీవితం గడపాలని ఊహల్లో బతికేది. ఆమె పద్దతి నచ్చని..
ఆమెది సాధారణ కుటుంబం. టీ కొట్టుతో వచ్చే ఆదాయంతో వారి కుటుంబం నడుస్తోంది. అయితే తల్లిదండ్రులకు చాయ్ షాప్ ఉండటం ఆమెకు నచ్చలేదు. విలావంతమైన జీవితం గడపాలని ఊహల్లో బతికేది. ఆమె పద్దతి నచ్చని అమ్మానాన్నలు వార్నింగ్ ఇచ్చారు. దీన్ని అవమానంగా భావించిన ఆ మహిళ.. ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఒకరి తర్వాత ఒకరు, ఇంకొకరు, మరొకరు ఇలా ఐదుగురిని పెళ్లి చేసుకుని వదిలేసింది. వారి నుంచి డబ్బులు వసూలు చేసి రాయల్ లైఫ్ ను ఎంజాయ్ చేసేది. రాష్ట్ర కేబినెట్ లోని మంత్రి తనకు తెలుసునని బెదిరించి చీటింగ్ చేసేది. ఈ ఘటనలతో జైలుకు కూడా వెళ్లింది. బెయిల్ పై విడుదలై బయటికొచ్చాక కూడా ఇలాంటి మోసాలే చేసేది. చివరికి ఆరో పెళ్లి చేసుకుంటుండగా బాధితులకు పట్టుబడింది. తమిళనాడు రాష్ట్రంలోని లోని కరూర్ కు చెందిన సౌమ్య బీకాం పూర్తి చేసింది. తల్లిదండ్రులిద్దరీ టీ షాపు నిర్వహిస్తుండటం, ఇంట్లో ఆర్థిక కష్టాలు కామన్ అయ్యాయి. అయితే తామకు ఎందుకు ఇలా జరుగుతోందని, గొప్పగా జీవించాలని చిన్నప్పటి నుంచే కలలుకనేది. విలాసవంతమైన జీవితాన్ని గడపాలని ఆరాపటపడేది. ఇందుకు అవసరమయ్యే డబ్బును అక్రమ మార్గంలో సంపాదించేది. ఇతరులను మోసం చేసి విలాసంగా జీవించేది. అయితే సౌమ్య ఇలా చేయడం ఆమె తల్లిదండ్రులకు నచ్చలేదు. పద్ధతి మార్చుకోవాలని సూచించారు. కానీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇక తల్లిదండ్రులు తనను వేరుగా చూస్తున్నారని ఫీలయ్యింది.
వారిని ఎదిరించి రామనాథపురంలోని ఓ హాస్టల్ లో చేరింది. ఈ క్రమంలో ఆమెకు రాజేశ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతను పోలీసుగా డ్యూటీ చేస్తున్నాడు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం, ప్రేమ పెరగడంతో పెళ్లి చేసుకున్నారు. భర్త పోలీసు కావడంతో ఆమె చేసే మోసాలు మరింత ఎక్కువయ్యాయి. అడ్డొచ్చే వారి అంతు చూస్తానని బెదిరించి చీటింగ్ చేసి అక్రమంగా డబ్బు తీసుకునేది. అంతే కాకుండా భర్త వద్ద ఉన్న డబ్బును కొట్టేసి అక్కడి నుంచి పారిపోయింది. ఘటనపై రాజేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని కంప్లైంట్ తో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సౌమ్యను అరెస్టు చేశారు. అయితే ఆమె జైలుకెళ్లి బెయిల్‌పై విడుదలైంది. తర్వాత అదే ప్రాంతానికి చెందిన సతీశ్ ను రెండో పెళ్లి చేసుకుంది. కొన్ని నెలల తర్వాత అతని నుంచి విడిపోయింది. ఇలా ఐదుగురిని పెళ్లి చేసుకొని వదిలేసింది.
రాష్ట్ర మంత్రికి చెందిన వారు తమ సన్నిహితులను బెదిరించి మోసాలకు పాల్పడింది. తాజాగా ఆటోడ్రైవర్‌ను ఆరో పెళ్లి చేసుకోవడానికి సౌమ్య సిద్ధమైందన్న విషయం బాధితులకు తెలిసింది. పక్కా ప్లాన్ ప్రకారంతో వారు సౌమ్యను పట్టుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..