Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బొట్టు పెడుతుండగా వరుడికి వణుకుడు రోగం… ఏకంగా పెళ్లి రద్దు చేసుకున్న వధువు

ఇటీవల కాలంలో చిన్న చిన్న విషయాలకే పెళ్లిళ్లు రద్దు చేసుకుంటున్నారు చాలామంది. సినిమాల్లో పెళ్లి మీటల మీద తాళి కట్టే సమయానికి ఆపండి.. అంటూ పోలీసులు రావడం..పెళ్లి ఆగిపోవడంలాంటివి జరిగేవి. కానీ పోలీసులు రాకుండానే.. వధూవరులే పెళ్లిళ్లు రద్దు చేసేసుకుంటున్నారు. వరుడి విషయంలో ఏచిన్న...

Viral Video: బొట్టు పెడుతుండగా వరుడికి వణుకుడు రోగం... ఏకంగా పెళ్లి రద్దు చేసుకున్న వధువు
Bride Calls Off Marriage
Follow us
K Sammaiah

|

Updated on: Jun 10, 2025 | 4:20 PM

ఇటీవల కాలంలో చిన్న చిన్న విషయాలకే పెళ్లిళ్లు రద్దు చేసుకుంటున్నారు చాలామంది. సినిమాల్లో పెళ్లి మీటల మీద తాళి కట్టే సమయానికి ఆపండి.. అంటూ పోలీసులు రావడం..పెళ్లి ఆగిపోవడంలాంటివి జరిగేవి. కానీ పోలీసులు రాకుండానే.. వధూవరులే పెళ్లిళ్లు రద్దు చేసేసుకుంటున్నారు. వరుడి విషయంలో ఏచిన్న డిఫెక్ట్‌ కనిపించినా వెంటనే అమ్మాయిలు అక్కడికక్కడే పెళ్లి క్యాన్సిల్‌ అంటూ వెళ్లిపోతున్నారు. తాజాగా బీహార్‌లో అలాంటి ఘటనే ఒకటి జరిగింది. నుదుట సింధూర పెట్టే సమయంలో వరుడి చేయి వణికిందని వధువు ఏకంగా పెళ్లినే రద్దుచేసుకుని వెళ్లిపోయింది.

పెళ్లి తంతులో భాగంగా ముహూర్త సమయానికి వరుడు భారీ ఊరేగింపుతో వధువు ఇంటికి చేరుకున్నాడు. సంప్రదాయం, ఆచారం ప్రకారం పురోహితుడు వివాహ క్రతువు జరిపిస్తున్నారు. ఈ క్రమంలో సింధూర ధారణ సమయం వచ్చింది. ఉత్తర భారత్‌లోని పెళ్లిళ్లలో ‘సిందూర్ దాన్’ అతి ముఖ్యమైన ఆచారం. పెళ్లికి ముందు వధువు నుదిటిపై వరుడు సింధూరం పూయడం ఓ ఆచారం. ఒక్కసారి సింధూరం పెట్టాడంటే ఆ జంటకు పెళ్లి అయిపోయినట్లే లెక్క. ఇందులో భాగంగా వరుడు వధువు నుదుటన సింధూరం పెట్టే సమయంలో అతని చేతులు వణికాయి. అది గమనించిన వధువు ఏమనుకుందో ఏమోకానీ, వెంటనే వధువు లేచి, వరుడు పిచ్చివాడని, అతన్ని తాను వివాహం చేసుకోనని తెగేసి చెప్పింది.

వరుడు, అతని కుటుంబ సభ్యులు వధువుకు ఎంతగానో నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. కానీ ఆమె తన నిర్ణయంపై దృఢంగా ఉండి వరుడిని వివాహం చేసుకోవడానికి నిరాకరించింది. పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది. కట్నం కింద ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని పెళ్లికూతురు తండ్రి డిమాండ్‌ చేశాడు. అయితే పెళ్లి కోసం ఖర్చులు అయ్యాయని వరుడి తండ్రి వాదించాడు. మరోవైపు ఇరు కుటుంబాలు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాయి. పోలీసులు కూడా నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయితే పెళ్లి తంతు కొనసాగేందుకు వధువు నిరాకరించింది. దీంతో వరుడు తన కుటుంబంతో కలిసి తన తిరిగి వెళ్లిపోయాడు. ఎవరి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీస్‌ అధికారి తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియో చూడండి:

పెళ్లి రోజు వధువు షాకింగ్‌ ట్విస్ట్‌.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు
పెళ్లి రోజు వధువు షాకింగ్‌ ట్విస్ట్‌.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు
కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్‌ వీడియో
కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్‌ వీడియో
పచ్చగడ్డిపై చెప్పుల్లేకుండా నడవండి.. ఫలితం మీరే చూడండి వీడియో
పచ్చగడ్డిపై చెప్పుల్లేకుండా నడవండి.. ఫలితం మీరే చూడండి వీడియో
బందర్‌లో దృశ్యం మార్క్‌ క్రైమ్‌ కహానీ..భర్త హత్యకు శ్రీమతి స్కెచ్
బందర్‌లో దృశ్యం మార్క్‌ క్రైమ్‌ కహానీ..భర్త హత్యకు శ్రీమతి స్కెచ్
భారత్‌కు వచ్చేసిన స్టార్‌లింక్‌... మరింత చౌకగా హైస్పీడ్‌ ఇంటర్నెట
భారత్‌కు వచ్చేసిన స్టార్‌లింక్‌... మరింత చౌకగా హైస్పీడ్‌ ఇంటర్నెట
హనీమూన్‌లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో
హనీమూన్‌లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో
యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో
యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో
70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో
70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో
ఒకే వేదికపై సీఎం రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్.. లైవ్ వీడియో
ఒకే వేదికపై సీఎం రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్.. లైవ్ వీడియో
ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్‌బాడీ మిస్టరీ వీడింది వీడియ
ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్‌బాడీ మిస్టరీ వీడింది వీడియ