Viral Video: సముద్రంలో అగ్నిపర్వతం భారీ విస్ఫోటనం.. షాకింగ్ వీడియో వైరల్
అగ్నిపర్వతం పేలుతున్న సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన వారికి ఎవరికైనా వణుకు వస్తుంది. ఈ పేలిన అగ్నిపర్వతం ఇటలీలో ఉన్న మౌంట్ స్ట్రోంబోలి అగ్నిపర్వతం అని చెబుతున్నారు. ఇది దాదాపు 200,000 సంవత్సరాల పురాతన అగ్నిపర్వతం అని నమ్ముతారు.

ఏ మాత్రం సమయం దొరికినా ప్రజలు ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్ళడానికి ఆసక్తిని చూపిస్తారు. అలా వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా ఏదైనా సంఘటన జరిగితే వెంటనే కెమెరాలో బంధించబడుతుంది. అలాంటి ఒక సంఘటన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసి ప్రజలు షాక్ అవుతున్నారు. కొంతమంది సముద్రం మధ్యలో ఉన్న ఒక ద్వీపానికి పడవలో వెళ్ళారు.. వారు తిరిగి వస్తుండగా, అకస్మాత్తుగా ఒక అగ్నిపర్వతం పేలింది. వారు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది. పడవలో ఉన్న వారు అగ్నిపర్వతం పేలుతున్న వీడియోను తీసినట్లు తెలుస్తోంది. అది కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అగ్నిపర్వతం పేలిన వెంటనే సముద్రంలో తుఫాను ఎలా తలెత్తింది? పడవ నడిపేవాడు తన పడవతో వేగంగా అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో మీరు చూడవచ్చు. అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న బూడిద మొత్తం ఆకాశాన్ని కప్పేసింది. అక్కడ అణు బాంబు పేలినట్లు అనిపిస్తుంది చూపరులకు. ఇది ఇటలీలో ఉన్న మౌంట్ స్ట్రోంబోలి అగ్నిపర్వతం అని చెబుతున్నారు. ఈ అగ్నిపర్వతం దాదాపు 200,000 సంవత్సరాల పురాతనమైనది . ప్రపంచంలోని అత్యంత చురుకైన అగ్నిపర్వతాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ అగ్నిపర్వత విస్ఫోటనం ఎప్పుడు జరిగిందో ? ఈ సంఘటనలో ఎవరికైనా హాని జరిగిందో ఈ వీడియో చూసినా స్పష్టంగా తెలియడం లేదు. కానీ అగ్నిపర్వతం పేలుడు మాత్రం ఖచ్చితంగా చూపరులను ఆశ్చర్యపరుస్తుంది.
ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో @AMAZlNGNATURE అనే IDతో షేర్ చేయబడింది. ‘నావికులు మౌంట్ స్ట్రోంబోలి విస్ఫోటనాన్ని సంగ్రహించారు’ అని క్యాప్షన్ ఉంది. కేవలం 28 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఇప్పటివరకు 2 లక్షలకు పైగా వీక్షించగా వేలాది మంది లైక్ చేశారు. రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
అగ్నిపర్వత విస్ఫోటన వీడియో
Boaters capture footage of an erupting Mount Stromboli pic.twitter.com/W7NFlBd2tW
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) September 15, 2025
వీడియో చూసిన తర్వాత ఒక వినియోగదారుడు, ‘నేను ఇప్పటివరకు నీటిలో చూసిన అత్యంత భయంకరమైన విషయం ఇదేనని నేను అనుకుంటున్నాను’ అని రాశాడు, మరొక వినియోగదారుడు, ‘ఇది సినిమాలోని సన్నివేశంలా ఉంది’ అని రాశాడు. అదేవిధంగా, ఒక వినియోగదారుడు, ‘ఈ పరిస్థితిలో అత్యంత విషాద కరమైన విషయం ఏమిటంటే బూడిద, నీరు రెండూ ప్రాణాలను తీయగలవు’ అని రాశాడు
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




