Viral Video: అడవి దున్న దెబ్బకు సింహం గజగజ.. కానీ చివరకు ఏమైందంటే..? వీడియో వైరల్..
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇక జంతువుల వీడియోలను చాలా మంది ఆసక్తికంగా చూస్తారు. తాజాగా సింహం - అడవి దున్నకు జరిగిన పోరుకు సంబంధంచిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తొలుత దున్న దైర్యంగా సింహాన్ని ఎదుర్కొంది. చివరకు ఏమైందనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

అడవి ప్రపంచం చాలా భిన్నంగా ఉంటుంది. అడవిలో జీవితం ప్రతీ క్షణం ఉత్కంఠంగా ఉంటుంది. ఇక్కడ బలం ఉన్నదే బతుకుతుంది. వీటిలో సింహాలు, పులులు ముందు వరసలో ఉంటాయి. అడవిలో వీటికి ఎదురులేదు అని చెప్పొచ్చు. సింహం ఒక్కసారి పంజా విసిరితే ఎంతపెద్ద జంతువైనా మటాషే. ఇటువంటి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోలో ఒక సింహం రెండు అడవి దున్నలను వేటాడుతూ కనిపించింది. ఒక దున్న ప్రాణ భయంతో పారిపోగా.. మరొక దున్న మాత్రం వెనక్కి తగ్గకుండా ధైర్యంగా సింహాన్ని ఎదుర్కొంది. దాని ధైర్యానికి సింహం ఒక్కసారిగా వెనక్కి తగ్గింది. కొన్ని క్షణాలు భయపడినట్లు కనిపించింది.
సింహం భయపడిన వెంటనే అడవి దున్న భయపడే ప్రయత్నం చేసింది. ఇక ఇదే అదునుగా భావించిన సింహం ఆ అవకాశాన్ని వాడుకొని దానిపై వెనుక నుండి ఒక్కసారిగా దాడి చేసింది. ఈ దాడికి తట్టుకోలేక దున్న నేలపై పడిపోయింది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి మరో సింహం వచ్చి దున్న మెడను పట్టుకుంది. రెండు సింహాల మధ్య చిక్కుకున్న దున్న తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ వీడియోను @TheeDarkCircle అనే యూజర్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు.
ఈ వీడియోను ఇప్పటివరకు 2.76 లక్షలకు పైగా చూశారు. 38 సెకన్ల ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఒకరు “దున్న సింహాన్ని అడ్డుకున్న ఆ క్షణం అద్భుతం” అని కామెంట్ చేయగా.. మరొకరు “అడవిలో ఒంటరిగా సింహాన్ని ఎదుర్కోవడం అంత సులభం కాదు” అని అన్నారు. “సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్” అనే నియమం అడవిలో ఇంకా బతికే ఉందని ఈ వీడియో నిరూపించిందని చాలామంది అభిప్రాయపడ్డారు. ఈ వీడియోలో దున్న దాని ధైర్యసాహసాలను ప్రదర్శించినప్పటికీ, చివరికి బలమే గెలిచిందని చూపించింది.
— Wildlife Uncensored (@TheeDarkCircle) September 14, 2025
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
