Viral Video: గొర్రె పిల్లను చుట్టేసిన నాగుపాము.. యజమాని తెలివిగా ఏం చేశాడో చూడండి..
సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతూ నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఒక గొర్రెల గుంపు ఉన్న ప్రాంతంతోకి చొరబడిన ఒక పాము.. ఒక గొర్రె పిల్ల కాళ్లను చుట్టుకొని దాన్ని కాటేసేందుకు ప్రయత్నించింది. అది గమనించిన యజమాని ఎంతో చాకచక్యంగా ఆ పామును పట్టుకొని గొర్రె పిల్ల ప్రాణాలు కాపాడాడు.

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతూ నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. అందులో కొన్ని వీడియోలు, నవ్వులు తెప్పించినా.. మరికొన్ని వీడియో జనాలను ఆందోళనకు గురిచేస్తాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వైరల్ వీడియో ప్రకారం.. ఒక ఖాళీ ప్రదేశంలో ఒక గొర్రెల మంద ఆగి ఉంది. అయితే సడెన్‌గా ఆ మందలోకి చొరబడిని ఒక భారీ సర్పం.. ఒక గొర్రె పిల్లను టార్గెట్ చేసి.. దాని కాళ్లకు చుట్టుకుంది. దాన్ని కిందేసి కాటు వేయాలని ప్రత్నించింది.
అయితే ఆ గొర్రెపిల్ల ఆ పామును నుంచి విడిపించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. పాము దాని కాళ్లకు చుట్టుకోవడంతో అది కగదలడానికి కూడా ఇబ్బంది పడింది. అయితే దూరం నుంచి అది గమనించిన యజమానికి వెంటనే అక్కడికి చేరుకొని.. పాము నుంచి గొర్రె పిల్లను కాపాడేందుకు ప్రయత్నించాడు. చివరకు ఒక పెద్ద ప్లాస్టిక్ పైప్‌ను తీసుకొని ఎంతో చాకచక్యంగా అతను పామును గొర్రెపిల్ల నుంచి వేరు చేస్తాడు.
ఆ తర్వాత అతను ఆ పామును సమీపంలో ఉన్న అడవిలోకి వెళ్లి వదిలేస్తాడు. అయితే అక్కడే ఉన్న మరికొందరు ఈ తంతంగాన్నంత వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ఇది కాస్తా ఇప్పడు వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.
వీడియో చూడండి..
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
