Humanity: నువ్వు గ్రేట్ బాస్.. సెక్యూరిటీ గార్డు కల నెరవేర్చిన యజమాని..!
వైరల్ అవుతున్న వీడియోలో సెక్యూరిటీ గార్డుతో ఓ యువకుడు మాట్లాడుతూ ఈ వయసులో కూడా ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అంటే.. తన కొడుకు తనని వదిలేసినట్లు చెప్పాడు. అయితే నేను నీ కొడుకుని అనుకో.. నీకు ఏమి కావాలంటే అది తీరుస్తారు.. ఏమి కావాలో కోరుకో అని అడిగాడు ఆ యువకుడు. అయితే ఆ యువకుడు తనకు ఏమీ వద్దు అని చెప్పాడు.. మరీ మరీ యువకుడు బలవంతం చేయగా.. తనకు అయోధ్యలోని రామయ్యను చూడాలని ఉందని చెప్పాడు
కోట్లాది హిందువుల కల తీరుతూ అయోధ్యలో బాల రామయ్య కొలువుదీరాడు. రామయ్యను దర్శించుకునేందుకు దేశ, విదేశాల నుంచి రామ భక్తులు తరలివస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అయోధ్యలో కొలువైన బాల రామయ్య గుడిని చూడాలనేది చాలా మంది కల. అయితే ఈ కల కొంతమందికి కలగానే మిగిలిపోతుంది. దీని కారణం వారి ఆర్ధిక పరిస్థితి.. అయితే 65 ఏళ్ల సెక్యూరిటీ గార్డు బాల రామయ్యను చూడాలనే కోరికను నెరవేర్చాడు ఓ యువకుడు.. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు అయోధ్యను సందర్శించాలన్న తన ఇంటి సెక్యూరిటీ గార్డు కోరికను నెరవేర్చాడు. ఎన్నో ఏళ్లుగా తన అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న తండ్రిలాంటి వ్యక్తి కోరికను తీర్చానని ఓ యువకుడు వీడియో షేర్ చేయగా, ఇప్పుడు ఆ వీడియో సర్వత్రా వైరల్‌గా మారింది.
వైరల్ అవుతున్న వీడియోలో సెక్యూరిటీ గార్డుతో ఓ యువకుడు మాట్లాడుతూ ఈ వయసులో కూడా ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అంటే.. తన కొడుకు తనని వదిలేసినట్లు చెప్పాడు. అయితే నేను నీ కొడుకుని అనుకో.. నీకు ఏమి కావాలంటే అది తీరుస్తారు.. ఏమి కావాలో కోరుకో అని అడిగాడు ఆ యువకుడు. అయితే ఆ యువకుడు తనకు ఏమీ వద్దు అని చెప్పాడు.. మరీ మరీ యువకుడు బలవంతం చేయగా.. తనకు అయోధ్యలోని రామయ్యను చూడాలని ఉందని చెప్పాడు. దీంతో ఆ యువకుడు అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేశాడు. ఏకంగా ప్లైట్ లో తీసుకుని మరీ అయోధ్య రామయ్యను దర్శించుకునే అవకాశం కల్పించాడు.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అనీష్ భగత్ (@anishbhagatt) మే 2న తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో కేవలం 5 రోజుల షేర్‌లో 17.2 మిలియన్లు లేదా 1 కోటి కంటే ఎక్కువ వ్యూస్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు 19,34,028 మంది వీడియోను లైక్ చేశారు. ఆ యువకుడిపై ప్రశంసల వర్షం కురిపించారు.
వైరల్ వీడియోను ఇక్కడ చూడండి:
View this post on Instagram
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలా మంది నెటిజన్లు యువకుడి పనిని ప్రశంసించారు. కొడుకు స్థానంలో నిలబడి ఆ వ్యక్తి కోరికను తీర్చినందుకు ధన్యవాదాలు” అని చాలా మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ప్రశంసించారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..