Chanakya Niti: వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే చాణక్య చెప్పిన ఈ ఐదు విషయాలు పాటించి చూడండి

ఆచార్య చాణక్యుడు తన విధానాలలో వైవాహిక జీవితంలో భార్యాభర్తలు తమ జీవిత భాగస్వామిపై , స్వయం కృషి, చర్యలపై విశ్వాసం కలిగి ఉండాలని చెప్పారు. దీని వల్ల దంపతులు జీవితంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోరు. అంతేకాదు జీవితంలో ముందుకు అడుగు వేసే ముందు.. సమస్యను పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అంటే జీవితంలో ఎదురయ్యే చిక్కులు, సమస్యలకు సంబందించిన సాధ్యమయ్యే పరిష్కారాలను అర్థం చేసుకునే వీలవుతుంది

Chanakya Niti: వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే చాణక్య చెప్పిన ఈ ఐదు విషయాలు పాటించి చూడండి
Chanakya Niti
Follow us
Surya Kala

|

Updated on: Jun 07, 2024 | 12:37 PM

వైవాహిక జీవితంలో ఇబ్బందుల్లో ఉంటే .. అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తే దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇందుకోసం ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో కొన్ని ముఖ్యమైన విషయాలను తెలియజేశాడు. వీటిని అనుసరించడం ద్వారా వైవాహిక జీవితాన్ని సులభంగా సంతోషంగా మార్చుకోవచ్చు. భవిష్యత్తులో ఎటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు జీవితంలో దేని గురించి పశ్చాత్తాపపడాల్సిన అవసరం ఉండదు.

మొదట సమస్యను అర్థం చేసుకోండి ఆచార్య చాణక్యుడు తన విధానాలలో వైవాహిక జీవితంలో భార్యాభర్తలు తమ జీవిత భాగస్వామిపై , స్వయం కృషి, చర్యలపై విశ్వాసం కలిగి ఉండాలని చెప్పారు. దీని వల్ల దంపతులు జీవితంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోరు. అంతేకాదు జీవితంలో ముందుకు అడుగు వేసే ముందు.. సమస్యను పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అంటే జీవితంలో ఎదురయ్యే చిక్కులు, సమస్యలకు సంబందించిన సాధ్యమయ్యే పరిష్కారాలను అర్థం చేసుకునే వీలవుతుంది. సమస్య పట్ల స్పష్టమైన అవగాహన ఉంటే.. ఆ సమస్య నుంచి బయటపడడం సులభం. అంతేకాదు సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని కూడా అందిస్తుంది.

జీవిత భాగస్వామిని గౌరవించండి ఒక వ్యక్తిగా మీ జీవిత భాగస్వామి పట్ల ఎల్లప్పుడూ గౌరవం కలిగి ఉండండి, అతని/ఆమె ఆలోచనలు, భావాలను గుర్తించడానికి ప్రయత్నించండి. జీవిత భాగస్వామిని గౌరవంగా చూసుకోండి. జీవిత భాగస్వామిలోని మంచి లక్షణాలను మెచ్చుకోండి. సుఖ దుఃఖాలలో ఒకరికొకరు ఆసరాగా ఉండండి. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితంలో సంబంధాలు బలపడతాయి. సాన్నిహిత్యం కూడా పెరుగుతుంది.

వాగ్దానాలను నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి ఆచార్య చాణక్య ప్రకారం వైవాహిక జీవితంలో నమ్మకం బలమైన వివాహ బంధానికి పునాదిగా పరిగణించబడుతుంది. మీ భాగస్వామికి నమ్మకం కలిగించడానికి ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి. దీనితో పాటు చేసే పనిలో చిత్తశుద్ధిని ప్రదర్శించండి. దీంతో మీ భాగస్వామికి మీ పట్ల విశ్వాసం ఏర్పతుంది. జీవిత భాగస్వామి నమ్మకానికి ద్రోహం చేయకండి. మీ అబద్దాలు సంబందాన్ని బలహీనంగా మార్చవచ్చు. దీంతో జీవితమంతా మీరు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

ఆలోచించి నిర్ణయం తీసుకోండి జీవితంలో కొత్త నిర్ణయం తీసుకుని ఆ దిశగా అడుగు వేయబోతున్నట్లయితే.. ముందుగా జీవిత భాగస్వామికి చెప్పండి.భార్యాభర్తలిద్దరూ పరస్పరం ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి. ఏ నిర్ణయం తీసుకున్నా ఇద్దరి అంగీకారం చాలా ముఖ్యం. ఇది పరస్పర విశ్వాసాన్ని కాపాడుతుంది. ఇలా చేయనట్లు అయితే వైవాహిక జీవితంలో భాగస్వామి పట్ల అపనమ్మకం ఏర్పడవచ్చు. సంబంధం దెబ్బతింటుంది.

వీలైనంతగా కోపాన్ని అదుపులో ఉంచుకోండి.. వైవాహిక జీవితంలో ప్రతికూల ఆలోచనలు, కోపాన్ని వ్యక్తం చేయడం మనసుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఇది భారభార్తల సంబంధానికి హానికరం. సానుకూల దృక్పథాన్ని కొనసాగించాలని కోపం, పగను పక్కకు పెట్టి భార్యాభర్తలు అనురాగంతో జీవించాలని చాణక్యుడు సలహా ఇస్తాడు. క్షమాపణ చెప్పడం, క్షమించడం భార్యాభర్తల బంధాన్ని బలపరుస్తుంది. సమస్య పరిష్కారాలపై దృష్టి కేంద్రీకరించడంతో సంతోషకరమైన, ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు. అందువల్ల దంపతులు పరస్పర ప్రేమను కొనసాగించండి. గొడవులకు, వివాదాలకు దూరంగా ఉండండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు