వావ్.. టాలెంట్ ఎవరి సొత్తూ కాదు..! ఐరన్ బాక్స్‌ని ఇలా కూడా వాడొచ్చని మీకు తెలుసా..?
ఉదయాన్నే కప్పు టీ కడుపులో పడితేనే బండి కదులుతుంది చాలా మందికి.. కప్పు చాయ్ కోసం ఎంత దూరమైన వెళ్తుంటారు టీ ప్రియులు. అలాంటి వారికి టీపై మక్కువ ఏ గ్యాస్ సిలిండర్‌పైనా ఆధారపడి ఉండదని నిరూపించే ఒక వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన తరువాత మీరు ఖచ్చితంగా కడుపుబ్బ నవ్వుకుంటారు.

భారతదేశంలో టీ అనేది కేవలం ఒక పానీయం కాదు… అది ఒక మానసిక స్థితి, ప్రేమ, చాలా మందికి ఇది జీవితం కంటే విలువైనది. పొద్దున్నే లేచీ లేవగానే ఓ కప్పు వేడి వేడి చాయ్ కడుపులో పడందే ఏమీ తోచదు చాలా మందికి..టీ పట్ల ఈ ప్రేమకు ఇటీవలి ఉదాహరణ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియో ఎంతో వినోదాత్మకంగా ఉంది. చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో నోరెళ్ల బెడుతున్నారు.
ఉదయాన్నే కప్పు టీ కడుపులో పడితేనే బండి కదులుతుంది చాలా మందికి.. కప్పు చాయ్ కోసం ఎంత దూరమైన వెళ్తుంటారు టీ ప్రియులు. అలాంటి వారికి టీపై మక్కువ ఏ గ్యాస్ సిలిండర్‌పైనా ఆధారపడి ఉండదని నిరూపించే ఒక వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన తరువాత మీరు ఖచ్చితంగా కడుపుబ్బ నవ్వుకుంటారు. వారి టాలెంట్‌ని ప్రశంసించకుండా ఉండలేరు. వైరల్ వీడియోలో ఒక వ్యక్తి తన ఇంట్లో గ్యాస్ అయిపోవటంతో టీ తాగాలనే కోరికను ఎలా తీర్చుకోవాలో ఆలోచించాడు. అతను ఇళ్లంతా చుట్టూ చూస్తాడు.. ఆపై అకస్మాత్తుగా అతని కళ్ళు… విద్యుత్ ఐరన్ బాక్స్ మీద పడతాయి. అంతే, తనకు ఎంతో ఇష్టమైన టీ తయారైంది. వెంటనే అతను ఐరన్ బాక్స్‌ను ఆన్ చేసి తలకిందులుగా చేశాడు. ఒక చిన్న గిన్నెలో కావాల్సినన్నీ పాలు, టీ పొడి, షుగర్ వేసి మరిగించాడు. అంతే, కొన్ని నిమిషాల్లోనే వేడి వేడీ కమ్మటి టీ తయారైంది.
వీడియో ఇక్కడ చూడండి…
View this post on Instagram
ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించిన వెంటనే సంచలనం సృష్టించింది. దీనిని ఫుడ్‌క్రేవింగ్స్‌పాయింట్ అనే ఖాతా షేర్ చేసింది. వేలాది మంది దీన్ని లైక్ చేశారు. కామెంట్ బాక్స్ పూర్తిగా ఫన్నీ జోకులతో నిండిపోయింది. వీడియోను చూసిన ఒకరు ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా టీ తయారు చేసుకోవాల్సిందే అని రాశాడు. మరొక వ్యక్తి మీకు ధన్యవాదాలు అంటూ స్పందించాడు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




