British High Commissioner: స్ట్రీట్ ఫుడ్ చిల్లీ ఐస్ క్రీం టేస్ట్ సూపర్బ్ అంటోన్న బ్రిటీష్ హైకమీషనర్..ఈ ఫుడ్ మరింత టేస్ట్ అంటూ నెటిజన్లు సలహాలు
దేశ ఆర్ధిక రాజధాని ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతూ..రోడ్‌సైడ్ ఫుడ్ ను రుచి చూశారు. ఫేమ్ స్నాక్స్‌ను ఆస్వాదించారు. రుచికరమైన స్నాక్స్‌ను ఆస్వాదిస్తూ రెండు ఫోటోలను తన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు బ్రిటీష్ హైకమీషనర్.
భారతీయులు ఆహార ప్రియులు. భిన్న సంస్కృతి సాంప్రదాయాలు.. విభిన్న రుచులతో కూడిన వంటలు ఉన్నాయి. భారతీయ వంటలను విదేశీయులు కూడా అత్యంత ఇష్టంగా తింటారు. ఇటీవల, బ్రిటీష్ హైకమీషనర్ అలెక్స్ ఎల్లిస్ భారతీయ ఆహారాలపై తన మక్కువను.. ప్రేమను చూపించారు. అంతేకాదు దేశ ఆర్ధిక రాజధాని ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతూ..రోడ్‌సైడ్ ఫుడ్ ను రుచి చూశారు. ఫేమ్ స్నాక్స్‌ను ఆస్వాదించారు. రుచికరమైన స్నాక్స్‌ను ఆస్వాదిస్తూ రెండు ఫోటోలను తన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ‘ఈ రోజు నేను ముంబై వాసిలా మారిపోయాను.. వారిలానే ఆహారాన్ని తింటున్నాను . తాను ముంబై శాండ్‌విచ్, చిల్లీ ఐస్ క్రీం టేస్ట్ చేశాయని ఫోటోలకు క్యాప్షన్ కూడా ఇచ్చారు.
వైరల్ అవుతున్న ఈ ఫొటోలో బ్రిటిష్ హైకమిషనర్ ముంబై లోని ఫేమస్ శాండ్‌విచ్, చిల్లీ ఐస్‌క్రీమ్‌ను ఆస్వాదిస్తున్నట్లు చూడవచ్చు. అతను క్యాప్షన్‌లో మరాఠీ పదాలను కూడా ఉపయోగించారు. తినడానికి రండి అంటూ అందరిని ఆహ్వానించారు అలెక్స్. ఈ పోస్ట్‌ను 1 లక్ష కంటే వ్యూస్, 2 వేల లైక్స్ సొంతం చేసుకుంది. అంతేకాదు కొంతమంది నెటిజన్లు.. ముంబైలో ఇంకా ఏయే ఫుడ్ తినవచ్చో సూచించారు.
Eating like a #Mumbaikar today – trying the मुंबई सैंडविच and chilli ?️ ice cream. #BombaySandwich
या जेवायला! pic.twitter.com/24Xu9lkKQH
— Alex Ellis (@AlexWEllis) January 12, 2023
బ్రిటీష్ హైకమీషనర్‌ను ‘మీరు ఎప్పుడైనా రాజౌరి గార్డెన్‌లోని చోలే భతురేని టేస్ట్ చేశారా అని ఒకరు అడగగా.. మరొకరు గిర్గామ్ చౌపటీలో బ్యాచిలర్స్ ఐస్ క్రీం ప్రయత్నించండి.. మీరు దాన్ని ఆనందిస్తారని పేర్కొన్నారు. ఇంకొకరు.. మీరు ఎప్పుడైనా హైదరాబాద్‌కు రండి.. ఇక్కడ ఆఫ్ఘన్ ఫుడ్ నిజంగా అద్భుతంగా ఉంటుంది.. ఇండియన్ ఫుడ్ లాగా స్పైసీ గా ఉండదని బ్రిటీష్ హైకమీషనర్ అలెక్స్ కు సూచించాడు.
వాస్తవానికి ఈ బ్రిటిష్ హైకమిషనర్ ఇండియన్ ఫుడ్ ని తినడం ఇదే ఫస్ట్ టైం కాదు. అలెక్స్ గతంలో దక్షిణ భారత వంటకం మసాలా దోస , ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ముంబై వడ పావ్‌లను కూడా ప్రయత్నించాడు. అప్పుడు బ్రిటిష్ హైకమిషనర్ మసాలా దోసను ఆస్వాదిస్తూ చేతులతో తిని.. భారతీయుల హృదయాలను ఆకట్టుకున్నారు. దోసెను చేతులతో తింటే అద్భుతంగా ఉంటుందని కొందరు కామెంట్ చేశారు కూడా..
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.