నో జిమ్, నో డైట్.. 10 నెలల్లో 23 కిలోలు తగ్గిన బిజినెస్ మెన్.. సీక్రెట్ ఇదే
మైక్రోబ్లాగింగ్ సైట్‌లో ఫిట్‌నెస్ కన్సల్టెంట్ సతేజ్ గోహెల్ ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశాడు. వ్యాపారవేత్త నీరజ్‌కి సంబంధించిన బరువు తగ్గక ముందు.. బరువు తగ్గిన తరువాత ఫోటోలను పంచుకున్నారు. నీరజ్ బరువు తగ్గడమే లక్ష్యంగా రూపొందిన నియమావళికి కట్టుబడి ఉన్నాడని.. దీంతో బరువు తగ్గాలనే తన లక్ష్యాన్ని సాధించినట్లు గోహెల్ వెల్లడించారు. బరువు తగ్గడం కోసం జిమ్ లేదు, ఫ్యాన్సీ ఫుడ్ లేదు.. అతను తమ ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని తినడం,,ఇంటిలో వ్యాయామం చేయడం మాత్రమే..
ప్రస్తుతం మారిన జీవన శైలి, ఆరోగ్య అలవాట్లు శారీరక ఆరోగ్యంపై మాత్రమే కాదు ఊబకాయం బారిన పడుతున్నారు. అధిక బరువుతో అనేక ఇబ్బందులను పడుతున్నారు. దీంతో తమ బరువుని అదుపులో చేసుకోవడానికి కొంతమంది వ్యాయామం, యోగా వంటి వాటితో పాటు ఆహారంలో డైట్ ని పాటిస్తారు. అయితే ఒక వ్యాపారవేత్త జిమ్‌కి వెళ్లకుండా లేదా ఫ్యాన్సీ డైట్‌ని అనుసరించకుండా 10 నెలల్లో 23 కిలోగ్రాముల బరువు తగ్గాడు. స్పూర్తిదాయకమైన వ్యక్తిగా X వినియోగదారు ఇటీవల ఒక పోస్ట్ ని షేర్ చేసారు. మైక్రోబ్లాగింగ్ సైట్‌లో ఫిట్‌నెస్ కన్సల్టెంట్ సతేజ్ గోహెల్ ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశాడు. వ్యాపారవేత్త నీరజ్‌కి సంబంధించిన బరువు తగ్గక ముందు.. బరువు తగ్గిన తరువాత ఫోటోలను పంచుకున్నారు.
నీరజ్ బరువు తగ్గడమే లక్ష్యంగా రూపొందిన నియమావళికి కట్టుబడి ఉన్నాడని.. దీంతో బరువు తగ్గాలనే తన లక్ష్యాన్ని సాధించినట్లు గోహెల్ వెల్లడించారు. బరువు తగ్గడం కోసం జిమ్ లేదు, ఫ్యాన్సీ ఫుడ్ లేదు.. అతను తమ ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని తినడం,,ఇంటిలో వ్యాయామం చేయడం మాత్రమే.. ఇప్పుడు ఏకంగా 23 కేజీలు తగ్గి ఇలా స్మార్ట్ గా కనిపిస్తున్నాడు అని పేర్కొన్నాడు.
నీరజ్ బరువు తగ్గడం కోసం సిఫార్స్ చేసిన 10,000 వేల అడుగులనే దిన చర్యను పాటించడం మొదట్లో చాలా కష్టమని భావించారు. అయితే క్రమంగా తనకు సూచించిన వాటిని రోజువారీ దిన చర్యల్లో భాగంగా చేసుకున్నాడు. వాస్తవానికి నీరజ్ గుజరాత్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త. రోజూ బిజీ షెడ్యుల్ ఉంటుంది. ఈ బిజీ షెడ్యూల్ కారణంగా నీరజ్ మొదట్లో 10 వేల అడుగులు వేయడానికి చాలా కష్టపడ్డాడు.. అయినా పట్టుదల విడకుండా ప్రయత్నిస్తూ.. కొన్ని వారాల తర్వాత నీరజ్ దిన చర్యలో భాగంగా 10 వేల అడుగులు అయ్యాయి అని గోహెల్ బరువు తగ్గడానికి గల సీక్రెట్ ను బయట పెట్టారు.
No gym, No fancy food.
A Gujarati businessman eating Gujarati homemade food and home workouts led to this transformation!
This is how we were able to achieve Niraj’s transformation 👇.
Save this Thread. pic.twitter.com/seJXAw2Hzw
— Satej Gohel (@SatejGohel) June 21, 2024
అంతేకాదు ఫిట్‌నెస్ కన్సల్టెంట్ గోహెల్ ఇంకా నీరజ్ బరువు తగ్గడానికి చేసిన ప్రయత్నాని పంచుకుంటూ వ్యాపారంలో బిజీ షెడ్యూల్ కారణంగా నీరజ్ మొదట్లో జిమ్‌కి వెళ్లడానికి సంకోచించాడని.. అప్పుడు ఒక జత డంబెల్స్‌ని ఉపయోగించి నీరజ్ కోసం ఇంట్లోనే వ్యాయామం చేసే విధంగా ప్రణాళికను అభివృద్ధి చేసినట్లు వెల్లడించాడు. తర్వాత.. తర్వాతి 10 నెలల్లో నీరజ్ 23 కేజీలు తగ్గారని.. 91.9 కేజీల నుంచి 68.7 కేజీల బరువుకు చేరుకున్నట్లు వెల్లడించాడు గోహెల్. బరువు తగ్గడం కోసం నీరజ్ తినే ఆహారంలో పనీర్, సోయా ముక్కలు, పన్నీర్, పప్పు వంటి శాఖాహార ప్రోటీన్ ఫుడ్ ని ఇవ్వడం తో పాటు స్వీట్ ఫుడ్ ని ముఖ్యంగా చక్కర తో తయారు చేసిన ఆహారం ఇవ్వడం మానివేసినట్లు గోహెల్ తెలియజేశారు.
ప్రస్తుతం నీరజ్ కొత్త జీవితాన్ని ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నాడని.. తనకు ఇష్టమైన ఆహరాన్ని ఆస్వాదిస్తూ.. వర్కౌట్‌లు చేస్తూ.. కార్యకలాపాలను నిర్వహిస్తూ అగ్రస్థానంలో ఉన్నాడు గోహెల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..