Ayurveda Tips: పాలతో పాటు ఈ పొడిని కలిపి తీసుకోండి.. మలబద్ధకం సహా అనేక వ్యాధుల నుంచి విముక్తి
ఆయుర్వేదంలో త్రిఫల చూర్ణం వాత, పిత్త, కఫం ఈ మూడు దోషాలను సమతుల్యం చేసే ఔషధంగా కూడా పరిగణించబడుతుంది. తద్వారా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజూ 2 నుంచి 4 గ్రాముల త్రిఫల చూర్ణం తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. కనుక త్రిఫల చూర్ణం తీసుకోవడం వలన ఏ విధంగా ఆరోగ్యానికి మేలు చేస్తుందో తెలుసుకుందాం..
ప్రకృతికి మనిషికి దగ్గర సంబంధం ఉంది.. మనిషి ఆరోగ్యంగా జీవించడానికి ప్రకృతి నియమాలను అర్ధం చేసుకోకుంటే చాలు అని మన ఋషులు, మునులు పేర్కొన్నారు. ప్రకృతిలో లభించిన మొక్కలు, వనమూలికతో అనారోగ్యానికి చికిత్స చేస్తారు. దీనినే ఆయుర్వేదం అని అంటారు. అవును మనిషి ఆరోగ్యంగా ఉండటానికి ఆయుర్వేదంలో నిద్ర లేచింది మొదలు తినడం వరకు రోజువారీ నియమాలను, అనేక రకాల మూలికలను వివరిస్తుంది. ఈ మూలికల్లో ఒకటి త్రిఫల చూర్ణం.. అంటే ఉసిరి, కరక్కాయ, తానికాయల పండ్లను పొడిగా చేసి తయారు చేయబడింది త్రిఫలం చూర్ణం. ఈ మూడు పండ్లు మీ ఆరోగ్యానికి వరం కంటే తక్కువ కాదు. త్రిఫల చూర్ణాన్ని రోజూ పాలతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు.
ఆయుర్వేదంలో త్రిఫల చూర్ణం వాత, పిత్త, కఫం ఈ మూడు దోషాలను సమతుల్యం చేసే ఔషధంగా కూడా పరిగణించబడుతుంది. తద్వారా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజూ 2 నుంచి 4 గ్రాముల త్రిఫల చూర్ణం తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. కనుక త్రిఫల చూర్ణం తీసుకోవడం వలన ఏ విధంగా ఆరోగ్యానికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.
పదే పదే జబ్బు పడరు
త్రిఫల చూర్ణంలో విటమిన్ సీ సహా అనేక ఇతర యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మూడు దోషాలను సమతుల్యం చేయడంలో సహాయపడటమే కాదు రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. మళ్లీ మళ్లీ వ్యాధుల బారిన పడకుండా చేస్తుంది.
మలబద్ధకం నుంచి ఉపశమనం
మలబద్ధకంతో బాధపడేవారు ఈ సమస్య నుంచి బయటపడేందుకు త్రిఫల చూర్ణం తీసుకోవాలి. త్రిఫల చూర్ణాన్ని పాలతో కలిపి తీసుకుంటే ఉదయం పూట పొట్ట క్లియర్ అయ్యే సమస్య ఉండదు. అదే సమయంలో జీర్ణక్రియను బలపరుస్తుంది. ఇతర సమస్యలను నివారిస్తుంది.
రక్తపోటు నియంత్రణ
త్రిఫల చూర్ణం వినియోగం రక్తపోటును నియంత్రించడంలో కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. అయితే తక్కువ రక్తపోటు సమస్య ఉన్నవారు లేదా అధిక రక్తపోటును నియంత్రించడానికి ఏదైనా ఔషధం తీసుకుంటే.. ఈ త్రిఫల చూర్ణం తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి. ఆ తర్వాత మాత్రమే త్రిఫల చూర్ణాన్ని తీసుకోవాలి.
ఎన్నో లాభాలు
పాలతో త్రిఫల చూర్ణం తీసుకోవడం వల్ల కళ్లకు మేలు జరగడమే కాకుండా జుట్టుకు బలం చేకూరి.. జుట్టు రాలడం సమస్యను తగ్గిస్తుంది. అంతేకాదు త్రిఫల చూర్ణం వినియోగం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. హిమోగ్లోబిన్ ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..