Kitchen Hacks: ఫ్రిడ్జ్‌లో చేపలను ఇలా నిల్వ చేసి చూడండి.. వారం రోజులైనా రుచిగా, ఫ్రెష్ గా ఉంటాయి..

చేపల్లో ఉన్న ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే తాజా చేపలను సముద్రం, నది తీరంలో ఉన్నవారు పొందుతారు. మిగిలిన ప్రాంతాల వారు చేపలను ఐస్ లో నిల్వ చేసిన వాటిని కొనుగోలు చేస్తారు. ఇలా మార్కెట్ లో కొన్న చేపలు కొని ఫ్రిజ్ లో పెట్టుకుంటారు. ఇవి పాడవకుండా వీటి టేస్ట్ మారకుండా ఉండడం కోసం కొన్ని సింపుల్ టిప్స్ పాటించాలి.

Kitchen Hacks: ఫ్రిడ్జ్‌లో చేపలను ఇలా నిల్వ చేసి చూడండి.. వారం రోజులైనా రుచిగా, ఫ్రెష్ గా ఉంటాయి..
Kitchen Hacks
Follow us
Surya Kala

|

Updated on: Jun 24, 2024 | 12:17 PM

మాంసాహార ప్రియులు చికెన్, మటన్ వంటి వాటితో పాటు సీఫుడ్ ని కూడా ఇష్టంగా తింటారు. ముఖ్యంగా చేపలు ఇతర మాంసాహారం కంటే ఆరోగ్యాన్ని ఇస్తాయి. అదే సమయంలో రుచికి రుచిని కలిగి ఉంటాయి. మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, అయోడిన్, జింక్, పొటాషియం, కాపర్, మాంగనీస్, సెలీనియం, స్ట్రోంటియం , విటమిన్లు ఎ, డి, బి కాంప్లెక్స్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. చేపల్లో ఉన్న ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే తాజా చేపలను సముద్రం, నది తీరంలో ఉన్నవారు పొందుతారు. మిగిలిన ప్రాంతాల వారు చేపలను ఐస్ లో నిల్వ చేసిన వాటిని కొనుగోలు చేస్తారు. ఇలా మార్కెట్ లో కొన్న చేపలను  ఫ్రిజ్ లో పెట్టుకుంటారు. ఇవి పాడవకుండా వీటి టేస్ట్ మారకుండా ఉండడం కోసం కొన్ని సింపుల్ టిప్స్ పాటించాలి.

  1. చేపలను ఫ్రిడ్జ్ లో పెట్టుకుని నిల్వ చేసుకోవాలనుకుంటే ముందుగా చేపలను శుభ్రం చేయాలి. అనంతరం వాటిని ఉప్పు నీటిలో కడిగి గాలి చొరబడని కంటైనర్‌లో పెట్టి ఫ్రీజర్ లో పెట్టుకోవాలి.
  2. శుభ్రం చేసిన చేపలను వెనిగర్ నీళ్లలో కడిగి గాలి చొరబడని కంటైనర్ లో పెట్టి ప్రీజర్ లో పెట్టి నిల్వ ఉంచితే నెల రోజుల వరకు చేపల ముక్కలు చెడిపోవు.
  3. చేపలకు ఉప్పు, మసాలాలు, పసుపు వేసి నిల్వ చేయడం వలన చేప టేస్ట్ మారిపోదు. వీటిని కూర లేదా మరేదైనా వంటకం తయారు చేసే సమయంలో ఉప్పు, పసుపు తగ్గించుకుంటే సరిపోతుంది.
  4. ఒక గిన్నె తీసుకుని నీరు పోసి.. కొంచెం ఉప్పు వేసి బాగా కరిగించి చేపల ముక్కలను వేసి నిల్వ చేయాలి. ఈ నీటిలో 5 నిమిషాలు నానబెట్టి తర్వాత చేప ముక్కలను మరొక గిన్నెలోకి తీసుకుని అందులో కారం, పసుపు, మసాలా వేసి బాగా కలిపి చేప ముక్కలను గాలి చొరబడని కంటైనర్‌లో పెట్టి నిల్వ చేయండి.
  5. ఇవి కూడా చదవండి
  6. చేపలు తాజా దానం పోకుండా నిల్వ చేసుకోవాలంటే ఫ్రిజ్ లో పెట్టి ఫ్రీజర్‌ను దాదాపు మైనస్ 18 డిగ్రీల సెల్సియస్‌ వద్ద శీతలీకరించాలి. ఇలా చేయడం వలన చేపలు త్వరగా పాడవ్వవు. చేపలను ప్రిడ్జ్ నుంచి బయటకు తీసిన వెంటనే వంట చేయవద్దు. డీఫ్రాస్టింగ్ తర్వాత మాత్రమే ఉడికించాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..