Viral News: వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రభావం.. బాస్ ని ‘హే’ అంటూ మెసేజ్ చేసిన ఉద్యోగి.. బాస్ రియాక్షన్ వైరల్

|

Jul 03, 2022 | 7:01 AM

'దయచేసి హే అని అడ్రస్ చేయవద్దు.. హే పదం ఉపయోగించవద్దు. ఇలా అనడం అభ్యంతరకరంగా ఉంది. మీకు నా పేరు గుర్తులేకపోతే నాకు హాయ్ అని పంపండని బాస్ తన ఉద్యోగిని కోరాడు.

Viral News: వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రభావం.. బాస్ ని హే అంటూ మెసేజ్ చేసిన ఉద్యోగి.. బాస్ రియాక్షన్ వైరల్
Viral News
Follow us on

Viral News: కరోనా మహమ్మారి (Corona Virus) వెలుగులోకి రాకముందు చాలా కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏమిటో కూడా తెలియదు. అయితే ఈ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో చదువుకునే విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకూ అందరూ ఇంటికే పరిమితమయ్యారు. తమ తమ కార్యకలాపాలను ఇంటి నుంచే జరుపుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు దాదాపు రెండేళ్ల నుంచి ఇంటి నుండి పని చేస్తూనే ఉన్నారు. ఇలా వర్క్ ఎట్ హోమ్ వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి.. అదే సమయంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఉద్యోగులు ఆఫీసుకు వెళ్లనందున.. అటువంటి పరిస్థితిలో.. తాము ఏదైనా తమ పై అధికారులకు, లేదా తమ కొలీగ్ కు చెప్పాలనుకుంటే.. మెసేజ్, ఈ మెయిల్‌ ను ఆశ్రయిస్తున్నారు. వాట్సాప్‌లో కూడా తమ పని గురించి తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఓ ఉద్యోగికి సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అందులో ఒక ఉద్యోగి తన యజమానికి ఒక సందేశంలో అలాంటి విషయం వ్రాసాడు మరి..

ఉద్యోగి తన యజమానితో సంభాషణ స్క్రీన్‌షాట్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. మెసేజ్‌లో బాస్.. తన ఉద్యోగిని ‘మీరు  నివేదికను సమర్పించారా?’ అని అడిగారు.. ఆ మెసేజ్ కు ఉద్యోగి రిప్లై ఇస్తూ… ‘హే లేదు, ఇప్పుడు కాదు’ అని పేర్కొన్నాడు. దీంతో తనను తన కింద ఉద్యోగి తనకు రిప్లై ఇచ్చిన విధానంపై బాస్ చాలా బాధపడ్డాడు. అంతేకాదు.. తన ఉద్యోగికి వెంటనే ఓ సలహా ఇచ్చాడు. ‘దయచేసి హే అని అడ్రస్ చేయవద్దు.. హే పదం ఉపయోగించవద్దు. ఇలా అనడం   అభ్యంతరకరంగా ఉంది. మీకు నా పేరు గుర్తులేకపోతే నాకు హాయ్ అని పంపండని బాస్ తన ఉద్యోగిని కోరాడు. అంతేకాదు.. బాస్ మరొక మెసేజ్ లో ..  ‘డ్యూడ్, మ్యాన్ అంటూ ఎప్పుడూ ప్రొఫెషనల్ వృత్తిలో అడ్రస్ చేయకూడదు.  అందుకు బదులుగా హలో లేదా హాయ్ అని వ్రాయవచ్చని తెలిపాడు..

అయితే తన బాస్.. ఇచ్చిన సలహాపై ఉద్యోగి స్పందిస్తూ.. మన మధ్య సంభాషణ వాట్సాప్‌లో జరిగింది..  ఇమెయిల్ లేదా లింక్డ్‌ఇన్‌లో కాదని అన్నాడు. మళ్ళీ బాస్ స్పందిస్తూ.. వాట్సాప్ లో నాకు వ్యక్తిగతంగా మెసేజ్ చేయలేదు.. ఉద్యోగ విధుల పర్వంగా మెసేజ్ చేసారు.. ‘నేను నా భావజాలాన్ని మీపై రుద్దడం లేదు. మీరు అర్థం చేసుకుంటే మంచిది..  మీకు నేను చెప్పింది..  అర్థం కాకపోతే మీకు త్వరలో అర్థమవుతుందని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ సంభాషణ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వీడియోల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..