AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: తల్లి గర్భమే ఆ చిన్నారికి శత్రువు.. శిశివు పెరుగుదలను సహకరించని తల్లి శరీరం.. ఎందుకంటే

ఇవి విన్న వారికీ కొంచెం వింతగా అనిపించవచ్చు. అయితే ఇది పూర్తిగా నిజం. అమెరికాలో నివసిస్తున్న సామ్ విలియం మహిళ గర్భవతి. ఆమె కడుపులో పెరుగుతున్న ఆర్థర్ విలియం తల్లి కడుపులో సురక్షితంగా లేదు. అందుకే తల్లి కడుపులో ఉన్నప్పటికీ చిన్నారికి ఇప్పటికి రెండు సార్లు రక్తాన్ని మార్చాల్సి వచ్చింది. ఏ శిశివు అయినా సరే తల్లి కడుపులో తొమ్మిది నెలలు ఉండి.. తర్వాత జన్మిస్తాడు.

Viral News: తల్లి గర్భమే ఆ చిన్నారికి శత్రువు.. శిశివు పెరుగుదలను సహకరించని తల్లి శరీరం.. ఎందుకంటే
Viral NewsImage Credit source: social Media
Surya Kala
|

Updated on: Aug 10, 2024 | 10:13 AM

Share

ప్రపంచంలోని ప్రతి జీవికి తన తల్లి గర్భమే అత్యంత సురక్షితమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. తల్లి గర్భంలో ఉన్న బిడ్డను మృత్యువు కూడా తాకలేని ప్రదేశం అని చెబుతారు. అయితే పుట్టబోయే బిడ్డకు తల్లి శరీరమే యమ పాశంగా మారితే ఎలా ఉంటుంది. ఇది విన్న వారికీ కొంచెం వింతగా అనిపించవచ్చు.. అయితే ఇది పూర్తిగా నిజం. తల్లి శరీరమే బిడ్డకు అతి పెద్ద శత్రువుగా మారింది. భూమి మీదకు రాకుండానే మరణం అంచుల వరకూ వెళ్ళే వరకూ వెళ్ళింది. ప్రస్తుతం ఈ తల్లికి సంబంధించిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఇవి విన్న వారికీ కొంచెం వింతగా అనిపించవచ్చు. అయితే ఇది పూర్తిగా నిజం. అమెరికాలో నివసిస్తున్న సామ్ విలియం మహిళ గర్భవతి. ఆమె కడుపులో పెరుగుతున్న ఆర్థర్ విలియం తల్లి కడుపులో సురక్షితంగా లేదు. అందుకే తల్లి కడుపులో ఉన్నప్పటికీ చిన్నారికి ఇప్పటికి రెండు సార్లు రక్తాన్ని మార్చాల్సి వచ్చింది. ఏ శిశివు అయినా సరే తల్లి కడుపులో తొమ్మిది నెలలు ఉండి.. తర్వాత జన్మిస్తాడు. అయితే విలియం గర్భంలో ఉన్న చిన్నారి పెరుగుదల వేగంగా లేదు. కనుక నిర్ణీత సమయం కంటే ముందే ఆపరేషన్ చేసి తల్లి గర్భం నుంఛి ప్రపంచంలోకి అడుగు పెట్టేలా చేశారు.

అసలు తల్లి శరీరం బిడ్డకు ఎందుకు శత్రువుగా మారుతోందంటే

ఇవి కూడా చదవండి

వైద్యులు.. గర్భంలో పెరుగుతున్న శిశివుకి అరుదైన రక్తంతో ఉన్నాడని అది చిన్నారి తండ్రి మాట్ విలియమ్స్ (33) కు ఉన్న అరుదైన రక్తం వచ్చిందని కనుగొన్నారు. RH నెగటివ్ ని గుర్తించారు. మరియు తల్లి సామ్ విలియమ్స్( 29) బ్లడ్ గ్రూప్ భిన్నంగా ఉంది. తల్లి శరీరం బిడ్డను అంగీకరించకపోవడానికి ఇదే కారణం. ఈ కేసు చూసిన వైద్యుడు చాలా ఆశ్చర్యపోయాడు. ఈ కథనాన్ని వైద్యరంగంలో అరుదైన కేసుగా పరిగణిస్తున్నారు.

ప్రస్తుతం ఆర్థర్‌ను రెండు వారాల క్రితం సి-సెక్షన్ ద్వారా తల్లి గర్భం నుంచి బయటకు తీశారు. అక్కడ వైద్యులు చిన్నారికి తీవ్రమైన కామెర్లు ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత కార్డిక్‌లోని నోహ్ ఆర్క్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఇక్కడ వైద్యులు సైతం ఆశ్చర్యపడుతున్న విషయం ఏమిటంటే.. సాధారణంగా ఈ వ్యాధి బారిన పడిన వ్యక్తుల రంగు పాలిపోయినట్లు ఉంటుంది. ఈ చిన్నారికి అలాంటిదేమీ లేదు. ఆర్థర్‌కు ఏడు నెలల వయస్సు ఉన్నప్పుడు.. శరీరం తగినంత వేగంతో అభివృద్ధి చెందడం లేదని వైద్యులు గమనించారు. అప్పుడు గర్భస్థ శిశివుని పరీక్షించినప్పుడు, భవిష్యత్తులో ఆర్థర్ తీవ్రమైన కామెర్లు, వినికిడి లోపంతో బాధపడే అవకాశం ఉందని తేలింది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..