చావుకు దగ్గరగా మత్స్యకారులు.. ఒళ్లు గగుర్పాటు కలిగిస్తున్న వీడియో

ఎవ్వరూ సాహసం చేయాలనుకున్నారో ఏమో తెలీదు గానీ.. ఇద్దరు మత్య్సకారులు చావుకు దగ్గరగా వెళ్లారు. అయితే వీరికి ఇంకా భూమిపై నూకలు ఉన్నట్లు ఉన్నాయి. అందుకే అదృష్టవశాత్తు బయటకు వచ్చేశారు. ఒళ్లు గగుర్పాటు పుట్టిస్తోన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైలర్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఇంగ్లాండ్‌లోని డైర్బీషైర్‌లోని లేడి బోవర్ రిజర్వాయర్‌లోకి ఇటీవల కొందరు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో ఇద్దరు మత్స్యకారులు మాత్రం అందులో ఉన్న 66 అడుగుల ప్లగ్‌ […]

చావుకు దగ్గరగా మత్స్యకారులు.. ఒళ్లు గగుర్పాటు కలిగిస్తున్న వీడియో
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 23, 2019 | 1:59 PM

ఎవ్వరూ సాహసం చేయాలనుకున్నారో ఏమో తెలీదు గానీ.. ఇద్దరు మత్య్సకారులు చావుకు దగ్గరగా వెళ్లారు. అయితే వీరికి ఇంకా భూమిపై నూకలు ఉన్నట్లు ఉన్నాయి. అందుకే అదృష్టవశాత్తు బయటకు వచ్చేశారు. ఒళ్లు గగుర్పాటు పుట్టిస్తోన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైలర్‌గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. ఇంగ్లాండ్‌లోని డైర్బీషైర్‌లోని లేడి బోవర్ రిజర్వాయర్‌లోకి ఇటీవల కొందరు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో ఇద్దరు మత్స్యకారులు మాత్రం అందులో ఉన్న 66 అడుగుల ప్లగ్‌ హోల్‌కు చాలా దగ్గరగా వెళ్లారు. సాధారణంగా అక్కడికి వెళ్లేందుకు ఎవరూ సాహసించరు. ఎందుకంటే ప్లగ్ హోల్స్ దగ్గర వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది. ఇక అక్కడికి వెళ్తే.. దాదాపుగా అందులో కొట్టుకుపోవడం ఖాయం. అది తెలిసి కూడా ఆ ఇద్దరు దగ్గరగా వెళ్లారు. దీన్నంతా బయట ఉన్న ఫ్లో నెల్సన్ అనే మహిళ వీడియో తీసింది. హోల్‌కు దగ్గరగా పోతున్న సమయంలో పడవలను మత్స్యకారులు కంట్రోల్‌గానే నడుపుతున్నప్పటికీ.. ఆ వీడియో చూస్తుంటే ఒళ్లు గగుర్పాటు కలుగుతుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక దీన్ని వీక్షించిన రిజర్వాయల్ అధికారులు.. సంబంధిత అధికార వర్గాలు మత్య్సకారులకు హెచ్చరికలు జారీ చేశాయి. రిజర్వాయర్‌ను చేపల వేట కోసం ఉపయోగించడం సంతోషంగా ఉంది. కానీ ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు కొని తెచ్చుకోవద్దంటూ పేర్కొంది. ఈ రిజర్వాయర్‌లోనే రెండు ప్రమాదకర బిలాలు ఉన్నాయని.. ప్రజలు వాటికి దూరంగా ఉండాలని తెలిపింది.

Latest Articles