Lifestyle: మీలో ఈ లక్షణాలున్నాయా.? ఒమేగా-3 లోపం ఉన్నట్లే..

మరీ ముఖ్యంగా గర్భిణీలకు ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్‌ తగినంత లభించాలని నిపుణులు చెబుతుంటారు. అయితే శరీరంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ తగ్గితే శరీరంలో వెంటనే మార్పులు కనిపిస్తాయి. కొన్ని లక్షణాల ఆధారంగా శరీరంలో ఫ్యాటీ 3 యాసిడ్ తగ్గిన విషయాన్ని తెలుసుకోవచ్చు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Lifestyle: మీలో ఈ లక్షణాలున్నాయా.? ఒమేగా-3 లోపం ఉన్నట్లే..
stress
Follow us

|

Updated on: May 04, 2024 | 6:08 PM

శరీరానికి అవసరమైన అన్ని ప్రోటీన్లు అందితేనే ఆరోగ్యంగా ఉంటామమే విషయం తెలిసిందే. ఏ ఒక్కటి లోపించినా వెంటనే శరీరంపై ప్రభావం చూపుతుంది. శరీరానికి అవసరమైన పోషకాల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌ ఒకటి. జీవక్రియ సక్రమంగా సాగాలంటే శరీరానికి కచ్చితంగా అవసరమైనంత ఒమేగా 3 లభించాలి.

మరీ ముఖ్యంగా గర్భిణీలకు ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్‌ తగినంత లభించాలని నిపుణులు చెబుతుంటారు. అయితే శరీరంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ తగ్గితే శరీరంలో వెంటనే మార్పులు కనిపిస్తాయి. కొన్ని లక్షణాల ఆధారంగా శరీరంలో ఫ్యాటీ 3 యాసిడ్ తగ్గిన విషయాన్ని తెలుసుకోవచ్చు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* తరచూ డిప్రెషన్‌ బారిన పడే వారిలో ఒమేగా 3 యాసిడ్స్‌ తక్కువగా ఉంటాయని పరిశోధనల్లో వెల్లడైంది. అందుకే ఒమేగా 3 సప్లిమెంట్లను తీసుకోవడం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

* శరీరంలో ఒమేగా -3 లోపం మీ చర్మంపై స్పష్టంగా కనిపిస్తుంది. చర్మం పొడిగా మారడం, ఎర్రబడడం, మెటిమలు రావడం వంటి లక్షణాలు ఇందులో కనిపిస్తాయి. అలాగే జుట్టు ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి.

* ఒమేగా -3 కళ్ల ఆరోగ్యాన్ని కాపాడడంల కూడా కీలక పాత్ర పోషిస్తాయి. దీర్ఘకాలంలో కళ్లు పొడి బారే సమస్యతో ఇబ్బంది పడుతుంటే అది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌ లోపం కారణంగా భావించాలి.

* అలసట సాధారణంగా నిద్ర లేకపోవడం, ఒత్తిడి వల్ల వస్తుంది. అయితే ఒమేగా -3 లోపం వల్ల కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

వీటిలో పుష్కలంగా లభిస్తాయి..

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఎక్కువగా లభించే పదార్థాల్లో అవిసె గింజలు ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే సమస్య నుంచి బయటపడొచ్చు. అలాగే చియా గింజలు, వాల్‌నట్‌లు, సాల్మన్ చేపలు, సోయాబీన్స్ వంటి వాటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా లభిస్తాయి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Latest Articles