అతి తక్కువ ఖర్చుతో సామాన్యులు కూడా సందర్శించదగిన దేశాలు

Phani.ch

18 May 2024

భారత దేశానికి దగ్గరగా దక్షిణాన ఉన్న దేశం శ్రీలంక. ఇక్కడ రామాయణ ఇతిహాసాలకు సంబంధించి ఎన్నో ప్రదేశాలను అతి తక్కువ ఖర్చతో సందర్శించవచ్చు. 

మన పొరుగున ఉన్న మరో దేశం నేపాల్. ఇక్కడికి వెళ్లడానికి ఎలాంటి వీసా, పాస్‌పోర్ట్ అవసరం లేదు.  అతి తక్కువ ఖర్చుతో ఇక్కడ ఎన్నో అద్భుత ఆలయాలున్నాయి. 

భారత దేశం నుంచి అతి తక్కువ ఖర్చుతో వెళ్లే దేశాల్లో థాయ్‌లాండ్ ఒకటి.  ఇక్కడ బీచ్‌లతో ఈ దేశం పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఫుకెట్, కో స్యామ్యూయ్ ద్వీపాలను సందర్శించవచ్చు.

వియత్నాంలో ఎంతో ఉల్లాసభరితమైన ప్రకృతి దృష్యాలకు నిలయం. అంతేకాదు అక్కడి చారిత్రక వంటకాలకు ప్రసిద్ది. హలోంగ్ బేలోని సుందరమైన ప్రదేశాల మధ్య ప్రయాణించవచ్చు.

మన దేశం నుంచి అతి చౌక ధరలతో ప్రయాణించే దేశాల్లో కంబోడియా ఒకటి. కొంత మంది ఇది ఒకప్పటి కాంభోజ దేశంగా పిలిచేవారట. 

అద్భుతమైన బీచ్‌లు, దట్టమైన అరణ్యాలతో పర్యాటకలను ఆకర్షిస్తోన్న దేశాల్లో ఇండోనేషియా ఒకటి. అతి తక్కువ ఖర్చుతో పురాతన ఆలయాలతో పాటు అగ్ని పర్వతాలను సందర్శించవచ్చు.

మన దేశం నుంచి అతి తక్కువ ఖర్చుతో ప్రయాణించే దేశాల్లో మలేషియా ఒకటి. ఇక్కడ అద్భుతమైన ప్రకృతి రమణీయ దృష్యాలతో పాటు నగరాలతో అలరారుతోంది. 

 ఫిలిఫైన్స్ లో అద్భుతమైన బీచ్‌లు, రిసార్టులకు పెట్టింది పేరు. ఫిలిప్పీన్స్ బడ్జెట్ ప్రయాణికులకు స్వర్గధామం అని చెప్పాలి.