పుట్ట గొడుగులు ఫైబర్‌కు పెట్టింది పేరు. కాబట్టి పుట్టగొడుగులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యల బారిన పడకుండా చూసుకోవచ్చు.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా పుట్టగొడుగులు ఉపయోగపడతాయని నిపుణులు ఉన్నారు. ఇందులో పొటాషియం ఎక్కువ, సోడియం తక్కువగా ఉండడమే దీనికి కారణం.
మహిళలకు పుట్ట గొడుగులు ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఇందులోని లినోలిక్ యాసిడ్ రొమ్ము క్యాన్సర్ నుంచి రక్షించడంలో సహాయపడుతుంది.
మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా పుట్ట గొడుగులు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. పుట్ట గొడుగులు తినేవారికి డిప్రెషన్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటున్నట్టు పలు పరిశోధనల్లో తేలింది.
పుట్టగొడుగులను ఆహారంలో భాగం చేసుకుంటే చర్మం ముడతలు పడకుండా ఉంటాయి. అలాగే కణాలను పునరుజ్జీవింప చేయడంలోనూ సహాయపడుతుంది.
రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా పుట్ట గొడుగులు ఎంతగానో ఉపయోపగపడతాయని నిపుణులు చెబుతున్నారు. పలు రకాల ఇన్ ఫెక్షన్లు, వ్యాధులు, అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.
మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో పుట్ట గొడుగులు కీలక పాత్ర పోషిస్తాయి. మతి మరుపు, జ్ఞాపక శక్తి నశించడం, అల్జీమర్స్ రాకుండా అడ్డుకుంటాయి
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం.