18 May 2024

చర్మం నుంచి దుర్వాసనా.? ఈ ఆహారం కారణం కావొచ్చు 

కొన్ని రకాల ఆహార పదర్థాలను తీసుకోవడం వల్ల శరీరం నుంచి దుర్వాస వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ ఫుడ్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

లవంగాలు, ఇలాచీ, మెంతుల వంటి మసాలాలు నాలుకకు, పళ్లకు అతుక్కుపోవడంతో ఒకరకమైన వాసన వచ్చేలా చేస్తాయి.

 ఇక మసాలాల అవశేషాలు కొన్ని మన శ్వాసలో, వెంట్రుకల్లో, చర్మం మీద గంటల కొద్దీ ఉండిపోతాయని వీటి కారణంగానే దుర్వాసన వచ్చే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.

వెల్లుల్లి, ఉల్లి కారణంగా కూడా నోటి నుంచి దుర్వాసన వస్తుందది. ఇవి నాలుకకు, దవడలకు అతుక్కుపోవటం వల్ల నోటి నుంచి వాసన వెలువడుతుంటుంది.

కొందరిలో ఉల్లి, వెల్లుల్లి జీవక్రియలు, శరీర ఉష్ణోగ్రత పెరిగేలా చేస్తాయి. చెమట కూడా ఎక్కువగా పడుతుంది. ఇది చర్మం మీద బ్యాక్టీరియాతో కలిసిపోయి ఒకరకమైన వాసన వస్తుంది.

మాంసం అధికంగా తీసుకునే వారిలోనూ శరీరం నుంచి ఒక రకమైన వాసన వస్తుందని చెబుతున్నారు. మాంసం వాసనలేని ప్రోటీన్లను విడుదల చేస్తుంది. ఇవి చర్మం మీద బ్యాక్టీరియాతో కలిసి వాసన పెరుగుతుంది.

ఇక క్యాబేజీ, గోబీ వంటి వాటిలో సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ అధికంగా ఉంటాయి. ఇది చెమట, శ్వాస, గ్యాస్‌ ద్వారా బయటకు వచ్చేటప్పుడు దుర్వాసన వస్తుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.