AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరీ.. ఇలా ఉన్నారేంట్రా బాబు.. ట్రాఫిక్‌లో 5నిమిషాలు ఆగలేక ఏం చేశాడో చూస్తే..

సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో వేగంగా వైరల్ అవుతోంది. అందులో, ట్రాఫిక్ జామ్ నుండి తప్పించుకోవడానికి ఓ యువకుడు చేసిన స్టంట్ అందరినీ షాక్‌ అయ్యేలా చేసింది. ఆగి ఉన్న ట్రక్కు కింద నుండి అతడు తన బైక్‌తో పాటుగా బయటకు వెళ్లే ప్రయత్నం చేశాడు. అతడు చేస్తున్న స్టంట్‌ చూసిన స్థానికులు అతన్ని వీడియోలు తీశారు. ఇలా ఎందుకు చేస్తున్నావ్‌ అంటూ ప్రశ్నించారు.. అందుకు అతడు నవ్వుతు ఇలా సమాధానం ఇచ్చాడు..

మరీ.. ఇలా ఉన్నారేంట్రా బాబు.. ట్రాఫిక్‌లో 5నిమిషాలు ఆగలేక ఏం చేశాడో చూస్తే..
Biker's Dangerous Stunt
Jyothi Gadda
|

Updated on: Nov 11, 2025 | 11:31 AM

Share

సోషల్ మీడియా అనేది ఎన్నో రకాల వైరల్‌ వీడియోలకు వేదిక. ఈ క్రమంలోనే ఒక వీడియో వేగంగా వైరల్ అవుతోంది. దీన్ని చూసిన తర్వాత మీరు కోపాన్ని కంట్రోల్‌ చేసుకోలేరు. వైరల్‌ వీడియోలో ఓ బైకర్‌ ఆగివున్న భారీ కంటైనర్ కింద నుండి తన బైక్‌తో పాటు వెళ్లటం కనిపిస్తుంది. అతడు రోడ్డుపై ఆగివున్న ట్రక్కు కింద నుండి బైక్‌తో పాటు బయటకు వెళ్లాడు. అంతేకాదు..ఇదంతా వీడియో తీసిన వ్యక్తి ఇలా ఎందుకు చేశావని అడిగినప్పుడు, అతను నవ్వుతూ భలే సమాధానం చెప్పాడు. తాను ఒక కళాకారుడిని అంటూ చెప్పాడు.

ఈ వీడియో @sarviind అనే ఖాతా నుండి సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడింది. 56 సెకన్ల ఈ వైరల్ వీడియోలో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్‌ ఏర్పడింది. అన్ని భారీ వాహనాలే లారీలు, భారీ ట్రక్కులు రోడ్డుపై బారులు తీరి ఆగిపోయి ఉన్నాయి. ఈ క్రమంలోనే ఒక వ్యక్తి తన ప్రాణాలను పణంగా పెట్టి ట్రక్కు కింద నుండి తన బైక్‌ను బయటకు తీస్తుండటం కనిపించింది. అది చూసిన కొందరు స్థానికులు ఇదంతా వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

బైక్ నడుపుతున్న వ్యక్తి ట్రక్కు కింద నుంచి బైక్‌ను బయటకు తీస్తుంటే, అతని పక్కనే నిలబడి ఉన్న మరొక వ్యక్తి అతన్ని వీడియో తీస్తున్నాడు. అందులో అతను నవ్వుతూ భోజ్‌పురిలో ట్రక్కు కింద నుంచి బయటకు వస్తున్నాడని, ఇది బీహార్. ఏదైనా జరగవచ్చని అంటున్నాడు. వీడియో తీస్తున్న వ్యక్తి బైక్ నడుపుతున్న వ్యక్తిని మీరు ఏం చేస్తున్నారని అడిగితే, ఇది బీహార్, ఇక్కడ కళాకారులకు కొరత లేదు” అంటూ అతను సమాధానం చెప్పుకొచ్చాడు. అప్పుడు వీడియో కెమెరా పట్టుకున్న వ్యక్తి ఇది బీహార్ కళాకారుల భూమి అని అంటాడు.

వీడియో ఇక్కడ చూడండి..

అయితే, వీడియో క్యాప్షన్‌లో మాత్రం ఇలా ఉంది..బీహార్ కు చెడ్డపేరు తెస్తున్న ఇలాంటి వ్యక్తులను ఏం చేయాలి? అతను రోడ్డుపై ఆగివున్న ట్రక్కు కింద నుండి బైక్‌తో సహా రోడ్డు క్రాస్‌ చేస్తున్నాడు. పైగా అదేంటని అడిగితే వెటకారంగా సమాధానం చెబుతున్నాడు అని రాసి వుంది. అయితే, వీ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు తమదైన రీతిలో స్పందించారు. తను బీహార్ కు చెందిన వాడు.. ఏదైనా చేయగలడు. అతను రిస్క్ లకు భయపడడు అని రాశారు. మరొకరు ఇలాంటి రిస్క్ లు ఎప్పుడూ చేయకూడదని అంటున్నారు. సదరు వ్యక్తి బైక్ ను జప్తు చేయాలి..అప్పుడు అతను జీవితాంతం ఇలాంటి రెడ్ లైట్ క్రాస్‌ చేయాలంటే భయపడతాడు అని రాశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 2 లక్షల 45 వేలకు పైగా చూశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కోహ్లీ 53వ సెంచరీకి ఫిదా.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్
కోహ్లీ 53వ సెంచరీకి ఫిదా.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్