Viral Video: ‘చాక్లెట్‌ వడాపావ్‌’.. ఇదేం ఐడియా తల్లీ! ఈ మహిళ చేసిన ప్రయోగం చూస్తే..!

|

Aug 01, 2024 | 3:33 PM

ఇకపోతే, వీడియో చూసిన చాలా మంది భోజన ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేం ప్రయోగం తల్లి అంటూ మండిపడుతున్నారు. ప్రజలకు ఇష్టమైన ఆహారాన్ని ఇలాంటి ప్రయోగాల పేరుతో పాడు చెయొద్దంటూ చాలా మంది నెటిజన్లు రకరకాలుగా కామెంట్‌ చేస్తున్నారు.

Viral Video: చాక్లెట్‌ వడాపావ్‌.. ఇదేం ఐడియా తల్లీ! ఈ మహిళ చేసిన ప్రయోగం చూస్తే..!
Vada Pav With Chocolate Paan
Follow us on

Viral Vada Pav Video: వడాపావ్ గురించి మనవారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మన దేశంలో ఎన్నో ఫేమస్‌ స్ట్రీట్ ఫుడ్స్ లో వడాపావ్‌ ఒకటి. ఎనిమిదేళ్ల పిల్లవాడి నుంచి ఎనభై ఏళ్ల పెద్దల వరకు పుల్లపుల్లగా, ఉప్పు, కారంగా ఉండే ఈ స్నాక్‌ ఐటమ్‌ని ఇష్టంగా తింటారు.
ముంబై, మహారాష్ట్రలకు ఎక్కువగా గుర్తింపు పొందిన ఈ స్నాక్ ఐటమ్‌ ప్రపంచంలోని ఫుడ్ లవర్స్ ను కూడా మెప్పించింది. ఇటీవలే వడాపావ్‌కు అంతర్జాతీయంగా అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచంలో అత్యుత్తమ శాండ్‌విచ్‌లలో ఒకటిగా వడాపావ్‌కు స్థానం దక్కింది. టేస్ట్ అట్లాస్ ప్రపంచంలో అత్యుత్తమ శాండ్‌విచ్‌లతో ఓ జాబితా రూపొందించింది. దీంట్లో వడాపావ్ 13వ స్థానంలో నిలిచింది. అలాంటి వడాపావ్‌ తియ్యగా తయారు చేస్తే ఎలా ఉంటుందో ఎప్పుడైనా రుచి చూశారా..?అవును మీరు విన్నది నిజమే.. ఢిల్లీవీధుల్లో విభిన్నమైన వడాపావ్‌ కనిపిచింది. చాక్లెట్ వడాపావ్‌ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

వడాపావ్‌ పేరు వినగానే స్పైసీ డిష్ రుచి గుర్తుకు వస్తుంది. కానీ, ఇప్పుడి చాక్లెట్‌తో చేసిన వడాపావ్‌ ప్రయోగం ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్ట్రీట్ ఫుడ్ వీడియో ద్వారా పోస్ట్ చేశారు. వీడియోలో ఒక యువతి రోడ్డుపక్కన చాక్లెట్ బార్లు అమ్ముతూ కనిపించింది. వీడియో ప్రారంభంలో ఇలాంటి వడాపావ్‌ ఢిల్లీలో ఎక్కడా దొరకదు. నేను స్వీట్ వడాపావ్‌ అందిస్తున్నాను. దాని పేరు చాక్లెట్ పాన్ వడాపావ్ అంటూ ప్రచారం చేస్తోంది. అంతేకాదు. ఈ చాక్లెట్‌ వడాపావ్‌ తయారీ విధానాన్ని కూడా ఆమె వీడియోలో స్పష్టంగా చూపించింది. ఈ తియ్యటి వడాపావ్‌లో చివరకు గుల్కంద్, చాక్లెట్, చెర్రీస్ తో పాటు కట్‌ చేసిన బన్‌ మధ్యలోచాక్లెట్‌ సిరప్‌ను కూడా యాడ్‌ చేసింది. కాగా, ఈ వీడియో ఇంటర్‌నెటలో వైరల్‌గా మారింది..ఇప్పటికే 3 లక్షలకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది.

ఇవి కూడా చదవండి

ఇకపోతే, వీడియో చూసిన చాలా మంది భోజన ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేం ప్రయోగం తల్లి అంటూ మండిపడుతున్నారు. ప్రజలకు ఇష్టమైన ఆహారాన్ని ఇలాంటి ప్రయోగాల పేరుతో పాడు చెయొద్దంటూ చాలా మంది నెటిజన్లు రకరకాలుగా కామెంట్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..