AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: మెట్రోలో ఇద్దరు లే’ఢీ’స్.. జుట్లు పట్టుకుని పొట్టుపొట్టుగా.. వైరల్ వీడియో..

పబ్లిక్ రవాణా అంటేనే రద్దీగా ఉంటుంది. బస్సుల్లో నిత్యం వందల మంది ప్రయాణిస్తూ ఉంటారు. ఇక ట్రైన్ లలో అయితే ఈ సంఖ్య పదిరెట్లు ఎక్కువగా ఉంటుంది. అందులోనూ ఇది ఆధునిక యుగం. త్వరగా గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అందులో భాగంగానే మెట్రో రైలు ప్రతి ఒక్క పెద్ద నగరాల్లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఢిల్లీ మెట్రో తరచూ ఏదో ఒక సంఘటనతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

Watch Video: మెట్రోలో ఇద్దరు లే'ఢీ'స్.. జుట్లు పట్టుకుని పొట్టుపొట్టుగా.. వైరల్ వీడియో..
Delhi Metro
Srikar T
|

Updated on: Dec 31, 2023 | 8:00 PM

Share

పబ్లిక్ రవాణా అంటేనే రద్దీగా ఉంటుంది. బస్సుల్లో నిత్యం వందల మంది ప్రయాణిస్తూ ఉంటారు. ఇక ట్రైన్ లలో అయితే ఈ సంఖ్య పదిరెట్లు ఎక్కువగా ఉంటుంది. అందులోనూ ఇది ఆధునిక యుగం. త్వరగా గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అందులో భాగంగానే మెట్రో రైలు ప్రతి ఒక్క పెద్ద నగరాల్లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఢిల్లీ మెట్రో తరచూ ఏదో ఒక సంఘటనతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. నిన్న మొన్నటి వరకూ అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతూ వైరల్ అయిన వీడియోలు చాలా ఉన్నాయి. అలాగే రైలులో ప్రయాణిస్తున్న తోటి ప్రయాణికుల మధ్య ఉన్నపళంగా డాన్సులు వేస్తూ్ తమ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి లైకులు పొందేందుకు ఇష్టపడిన వారు వందల్లోనే ఉన్నారు.

తాజాగా ఢిల్లీ మెట్రోలో ఇద్దరు మహిళలు గొడవ పడ్డారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. ఢిల్లీ నగరం అంటేనే నిత్యం లక్షల మంది ఉద్యోగాల నిమిత్తం, వ్యక్తిగత పనులమీద బయటకు వెళ్తూ ఉంటారు. అందుకు ప్రజారవాణాను వినియోగిస్తారు. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అయిన మెట్రోరైలులో రద్దీ ఎక్కువగా ఉన్న కారణంగా.. ఒక మహిళ ప్రమాదవశాత్తూ తోటి మహిళపై కాలు వేయడంతో గొడవ ప్రారంభమైనట్లు సమాచారం. తోటి ప్రయాణికులు జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, మహిళలు ఒకరినొకరు కొట్టుకోవడం, ఒకరి జుట్టు మరొకరు లాగడం ఈ వీడియోలో కనిపిస్తోంది. పోరపాటున తన కాలు తోటి ప్రయాణికురాలిపై పడటంతో ఆమె తనను తొక్కినట్లు భావించి గొడవ పెట్టుకున్నారు. పొరపాటున జరిగిందని ఎంత చెప్పినా వినిపించుకోలేదు.

ఇవి కూడా చదవండి

దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అది చిలికిచిలికి గాలివానగా మరినట్లు సిగపట్లకు దారితీసింది. ఈ వీడియా సామాజిక మాధ్యమ వేదిక అయిన ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ వైరల్ అయిన వీడియోలో.. మహిళల అరుపులు, గొడవ పడిన దృశ్యాలు కనిపించాయి. దీంతో మెట్రో ప్రయాణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంఘటనతో ప్రజారవాణాలోని భద్రతపై తీవ్ర చర్చ నడిచింది. సంబంధిత శాఖ అధికారులు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..