Viral Video: అందమైన ఆ ‘రోటీ అమ్మాయి’.. ఎవరో తెలిసిపోయింది.. పూర్తి వివరాలు మీకోసం…
Viral Video: సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న ‘రోటీ అమ్మాయి’.. ఎవరో తెలిసిపోయింది. కొన్నాళ్లుగా రోటీలు..
Viral Video: సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న ‘రోటీ అమ్మాయి’.. ఎవరో తెలిసిపోయింది. కొన్నాళ్లుగా రోటీలు చేస్తున్న ఓ అందమైన అమ్మాయికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలను చూసిన ప్రతీ ఒక్కరు అమ్మాయి ముగ్ధమనోహార రూపానికి ఫిదా అయిపోయారు. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకునేందుకు తెగ ప్రయత్నించారు. గూగుల్‌లో ఓ రేంజ్‌లో సెర్చ్ చేశారు. అయితే, తాజాగా ఆ అమ్మాయి ఎవరో తెలిసిపోయింది. హృదయాలు కట్టిపడేసే ముఖ వర్ఛస్సు కలిగిన ఆ అమ్మాయి పాకిస్తాన్‌కు చెందిన యువతిగా తేలింది.
ఇప్పటి వరకు మనం ఎన్నో వీడియోలు చూశాం. మారుమూల ప్రాంతాలలో ఏవో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న యువతీ, యువకులు.. సోషల్ మీడియా కారణంగా రాత్రికి రాత్రే వరల్డ్ ఫేమస్ అయిన వారు ఎందరో ఉన్నారు. ఈ యువతి కూడా ఒక్క వీడియోతో ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్లను తెగ ఆకట్టుకుంది. కట్టెల పొయ్యిపై రొట్టెలు చేస్తున్న యువతిని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. అందమైన ఆ అమ్మాయి ఎవరో తెలుసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు ఇప్పుడు ఫలించాయి. పాకిస్తాన్‌లోని కరాచీకి చెందిన యువతిగా తెలిసింది. సంచార తెగకు చెందిన ఈ యువతి పేరు అమీనా రియాజ్. వయస్సు 15 సంవత్సరాలు. ఈ అమ్మాయి రోజూలాగే తన కుటుంబం కోసం కట్టెల పొయ్యిపై రోటీలు చేస్తుండా.. ఓ కుర్రాడు ఆమెను వీడియో తీశాడు. ఆ వీడియో ఇంట్రస్టింగ్‌గా ఉండటంతో సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇక అంతే.. ఆ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అయ్యింది. వీడియోలోని యువతి చిరునవ్వుకి నెటిజన్లు అంతా ఫిదా అయిపోయారు. ఆమె ఎవరా? అని ఆరా తీయడం ప్రారంభించారు. సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేసిన యువకుడు కూడా ఇంతలా ఫేమస్ అవుతుందని ఊహించి ఉండడు. ఈ నేపథ్యంలో యువతి గురించిన సమాచారం అందుకున్న పాత్రికేయులు.. వారు ఉండే ప్రాంతానికి వెళ్లారు. యువతితో, యువతి కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే, వారు వీడియోలో కనపడేందుకు నిరాకరించారు.
ఇదిలాఉంటే.. అమీనాకు ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఉంది. దాదాపు 3 లక్షల ఫాలోవర్లు కూడా ఉన్నారు. ఈ పేజీలో, అమీనా.. కూరగాయలు కత్తిరించడం, వంట చేయడం, పండ్లు కోయడం వంటి ఇంటి పనులు చేస్తున్న వీడియోలు షేర్ చేస్తుంటుంది. ఇక్కడ ఇంట్రస్టింగ్ పాయింట్ ఏంటంటే.. అమీనాకు ప్రపంచ వ్యాప్తంగా ఫాలోవర్స్ ఉన్నారు. అందులో భారతీయులు కూడా అధికంగానే ఉన్నారు. మొత్తానికి హృదయాలు కట్టిపడేసే అమాయకత్వం, అందం కలగలిపినట్లు ఉన్న అమీనా ముఖ వర్ఛస్సుకు దాసోహం అయిపోతున్నారు. యువతిని అందాన్ని పొడుగుతూ నెటిజన్లు కవిత్వాలు వల్లె వేస్తున్నారు.
Viral Video:
View this post on Instagram
Also read:
10 పరుగులిచ్చి 10 వికెట్లు.. అందులో ఓ హ్యాట్రిక్.. టెస్టుల్లో అరుదైన రికార్డు.. ఆ బౌలర్ ఎవరంటే.!