Viral Video: క్యూట్ నెస్ వేరే లెవెల్.. ఊరగాయ తిన్నాక చిన్నారి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ మామూలుగా లేవుగా..
ఇంటర్నెట్ (Internet) లో మనం రోజూ రకరకాల వీడియోలు చూస్తాం. వీటిలో ఫన్నీ నుంచి ప్రమాదకరమైన వీడియోలు ఉంటాయి. ముఖ్యంగా చిన్నారులకు సంబంధించిన వీడియోలను చూశాక మనకు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. పాటలు పాడటం, డ్యాన్స్..
ఇంటర్నెట్ (Internet) లో మనం రోజూ రకరకాల వీడియోలు చూస్తాం. వీటిలో ఫన్నీ నుంచి ప్రమాదకరమైన వీడియోలు ఉంటాయి. ముఖ్యంగా చిన్నారులకు సంబంధించిన వీడియోలను చూశాక మనకు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. పాటలు పాడటం, డ్యాన్స్ చేయడం, ముద్దుముద్దుగా మాట్లాడడం, అల్లరి పనులు వంటి వీడియోలు ఎంతో క్యూట్ గా అనిపిస్తాయి. వారి అందమైన చేష్టలు మనసులను ఆకర్షిస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిఒక్కరూ ఒత్తిడితో సతమవుతున్నారు. అలాంటప్పుడు ఇలాంటి వీడియోలే (Video) మనకు ఉపశమనం కలిగిస్తాయి. అందుకే మిగతా వీడియోలతో పోలిస్తే చిన్నారుల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. చిన్నారులకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో ఒక పిల్లవాడు మొదటిసారిగా ఊరగాయను టేస్ట్ చేశాడు. పచ్చడి రుచి చూసిన తర్వాత ఆ బుడ్డోడు ఇచ్చే రియాక్షన్స్ వేరే లెవెల్ లో ఉంది. ఇది చాలా ఫన్నీగా అనిపిస్తుంది.
ఇవి కూడా చదవండిView this post on Instagram
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటివరకు మిలియన్ల మంది వీక్షించారు. 24 లక్షల మందికి పైగా పోస్ట్ ను లైక్ చేశారు. అంతే కాకుండా ఫన్నీ కామెంట్స్ ఇస్తున్నారు. ‘పిల్లల స్పందన నిజంగా ఫన్నీగా ఉంది’ అని, ‘పిల్లల అమాయకత్వాన్ని ఎవరూ గమనించవద్దు’ అని మరొక నెటిజన్ రాశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి