మనందరం సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘శివాజీ’ సినిమాను చూసే ఉంటాం. ఆ సినిమాలో రజినీ తన రెండు చేతులతో పేపర్ల మీద సంతకాలు చేయడం చూసి మనమంతా వావ్ అనుకున్నాం కదా.. అలాంటి ప్రతిభ కలిగిన ఓ యువతి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ యువతి ప్రత్యేకత ఏమంటే.. ఆమె చూడకుండా రాయగలదు. అంతే అనుకుంటున్నారా..? చూడకుండా రెండు చేతులతో ఒకే సారి రెండు వేర్వేరు భాషలలో రాయగలదు. ఇంకా పాటలు పాడడం, మిమిక్రీ చేయడం కూడా చేయగలదు. ఇదేం సాదాసీదా టాలెంట్ కాదు కదా.. అందుకే వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
ఇక ఈ వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి తెలిపిన వివరాల ప్రకారం ‘ఆది స్వరూప మంగళూరుకు చెందిన ఆది స్వరూప(17).అమె రెండు చేతులతో ఒకేసారి రాయవచ్చు. అది కూడా కళ్లు మూసుకుని రాయగలదు. ఇంకా మొత్తం 11 విధాల చేతివ్రాతను రాయగలదు. అంతేకాదు ఆమెకు ఇంగ్లీషు, కన్నడ ఒకేసారి రాయగలదు! ఆమె రచనా నైపుణ్యం చాలా ప్రత్యేకమైనది. మొత్తంమీద ఆమె ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు రాసే క్రమంలో తన మెదడు ఏకకాలంలో పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇంకా పది లక్షల మందిలో ఒకరికి మాత్రమే ఈ ప్రత్యేక సామర్థ్యం, ప్రతిభ ఉంటుంది’. ఇదే కథనాన్ని ప్రముఖ న్యూస్ ఏజన్సీ ANI కూడా ప్రచురించింది.
వైరల్ అవుతున్న వీడియోను ఇక్కడ చూడండి..
She is ‘Aadi Swaroopa’ from Mangalore. She can WRITE in 11 different style. Both Parts of her BRAIN functions at the Same Time, one in a million. Amazing!
This Skill is Known as Ambidexterityhttps://t.co/n3p0LtLksT pic.twitter.com/31g58QrDlb
— Ravi Karkara (@ravikarkara) February 5, 2023
కాగా, ఆది స్వరూప స్టడీ సెంటర్‌ను ఏర్పాటు చేసి రెండు చేతులతో రాయడంలో ఆసక్తి ఉన్న వారికి శిక్షణ కూడా అందిస్తోంది. ఆమె 10వ తరగతి పరీక్షను కూడా తన రెండు చేతులతో రాసింది. ఇక Ravi Karkara అనే ట్విట్టర్ ఖాతా నుంచి షేర్ అయిన వీడియోకు ఇప్పటికే దాదాపు 25 లక్షల వీక్షణలు, 10 వేల లైకులు వచ్చాయి. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడంతో పాటు ఆమె ప్రతిభను కీర్తిస్తున్నారు.
ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం ఏమంటే.. రాయడం వల్ల మనకు ఏకాగ్రత పెరుగుతుందని కూడా పలు అధ్యయనాలు నిరూపించాయి. అందుకే ప్రస్తుత కాలంలో గ్రాఫాలజీకి మంచి ఆదరణ లభించడం ప్రారంభమైంది. ఆ క్రమంలోనే చాలా మందిలో కీబోర్డు లేదా చేతి ద్వారా రాయాలనే ఆశ, ఆసక్తి పెరుగుతాయి. గ్రాఫాలజీని అనుసరించడం వల్ల వ్యక్తిత్వ లోపాలను, అభ్యసనా లోపాలను పరిష్కరించుకోవచ్చని పరిశోధనాధారిత అధ్యయనాలు సూచిస్తున్నాయి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..