Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Phone Charging: ఫోన్ చార్జింగ్ పెట్టినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలివే.. లేకపోతే ఇక అంతే సంగతీ..!

ఫోన్‌కు చార్జింగ్ పెట్టే సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలలో ఎంతో ముఖ్యమైనదేమిటంటే.. ఫోన్ పేలిపోకుండా ఉంటుంది. ఇంకా ఎక్కువ..

Phone Charging: ఫోన్ చార్జింగ్ పెట్టినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలివే.. లేకపోతే ఇక అంతే సంగతీ..!
Tech Precautions To Be Follow While Charging Your Smartphone
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 06, 2023 | 9:16 AM

ప్రస్తుత కాలంలో మనుషుల కంటే ఫోన్‌లకు, వస్తువులకే విలువ ఎక్కువ అన్న రీతిలో చాలా మంది ప్రవర్తిస్తున్నారు. ఆ క్రమంలోనే చుట్టూ ఉన్నవారి కంటే ఫోన్​తోనే ఎక్కువగా గడుపుతున్నారు. ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే ఆహారం లేకుండా అయినా ఉంటున్నారు కానీ సెల్​ఫోన్​ లేకుంటే మాత్రం రోజు గడవడంలేదు. ఈ మాటల్లో అతిశయోక్తి లేనే లేదు. మరి అలాంటి ఫోన్​ను చాలా జాగ్రత్తగా చూసుకోవడం ఎంతో ముఖ్యం. ఫోన్​కు ప్రాణం పోసేది ఛార్జింగే కదా. కాబట్టి అలాంటి ఛార్జింగ్​ విషయంలో తగిన జాగ్రత్తలు తప్పనిసరని చెప్పాలి. ఇలా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలలో ఎంతో ముఖ్యమైనదేమిటంటే.. ఫోన్ పేలిపోకుండా ఉంటుంది. ఇంకా ఎక్కువ కాలం సరైన రీతిలో పనిచేస్తుంది. అందుకోసం చార్జింగ్ పెట్టే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  1. తక్కువ క్వాలిటి వాల్​ప్లగ్​లు: ఛార్జింగ్ పెట్టడానికి క్వాలిటీలెస్​ వాల్​ప్లగ్​లను వాడకూడదు. చార్జింగ్ కోసం నాణ్యమైనవి వాల్​ప్లగ్​లను వాడడమే మేలు. ఈ కామర్స్ సంస్థల్లో లేదా ఇంకెక్కడైనా తక్కువ ధరలో వస్తున్నాయని క్వాలిటీ లేని ఛార్జర్​లు కొనుగోలు చేస్తే అవి ఫోన్లను డ్యామేజ్ చేస్తాయి. అధిక నాణ్యత గల ఛార్జర్‌లను వాడాలి. ఇవి మీ ఫోన్‌ను ఓవర్‌చార్జింగ్ అయినప్పుడు పవర్ సప్లైను నిలిపివేయడమే కాకుండా ఫోన్ వేడెక్కకుండా ఉంచుతాయి. కాబట్టి ఛార్జర్‌ను కొనుగోలు చేసేటప్పుడు నాణ్యత అనేది చాలా ముఖ్యమైన విషయమరి గుర్తించండి.
  2. కంపెనీ ఛార్జర్లు: మనం ఫోన్​ కొనుగోలు చేసినప్పుడు ఇచ్చిన ఛార్జర్లను వాడటమే మంచిది. వేరే ఛార్జర్లను ఉపయోగించకపోవడమే చాలా ఉత్తమం. ఒకవేళ ఫోన్‌తో సహా వచ్చిన చార్జర్ చెడిపోతే.. కంపెనీ స్పెసిఫికేషన్లు ఉన్న ఛార్జర్లను మాత్రమే వాడాలి. వేరే ఛార్జర్లను వాడితే ఫోన్ పనితీరు దెబ్బతింటుంది. ఇంకా అనతి కాలంలోనే ఫోన్ పేలిపోయే ప్రమాదం పొంచిఉంది.
  3. ఫోన్ పౌచ్​: మనం ఫోన్​ కింద పడినప్పుడు పగిలిపోకుండా ఉండటం కోసం రక్షణగా ఫోన్ పౌచ్​లను ఉపయోగిస్తుంటాం. కానీ అవి కూడా మన ఫోన్ మీద ఎంతో ప్రభావం చూపుతాయి. ఛార్జింగ్ పెట్టినప్పుడు పౌచ్​ను అలాగే ఉంచితే ఫోన్​ వేడెక్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫోన్ ఎక్కువగా వేడెక్కుతుందని అనిపించినప్పుడు పౌచ్​ను తీసేయడం ఉత్తమం.
  4. ఛార్జింగ్ పెట్టి ఫోన్ ఉపయోగించడం: ఛార్జింగ్ పెట్టి ఫోన్​ను ఉపయోగించడం అనేది అత్యంత ప్రమాదకరమైన చర్య. ఛార్జింగ్​ పెట్టి ఫోన్​ను వాడితే మొబైల్ వేడెక్కుతుంది. ఈ ఒత్తిడి ఫోన్​ బ్యాటరీ, స్క్రీన్, ప్రాసెసర్ మీద పడుతుంది. అప్పుడు ఫోన్​ స్లో అవ్వడం, వేడెక్కడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. ఫోన్​లో ఛార్జింగ్ మొత్తం పూర్తయ్యేవరకు వాడకపోవడం మంచిది. కొన్నిసార్లు ఛార్జింగ్ పెట్టి ఫోన్ వాడటం వల్ల అవి పేలిపోయే అవకాశాలు సైతం ఉన్నాయి. ఎందుకంటే ఫోన్​కు పవర్ సప్లై అనేది రెండు దిశలలో జరుగుతుంది. దీని వల్ల ఎక్కువ ఒత్తిడి జరిగి పేలిపోయే ప్రమాదాలున్నాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. బ్యాటరీతో నడిచే పోర్టబుల్ ఛార్జర్‌లు: పోర్టబుల్ ఛార్జర్‌లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. నాణ్యమైన దానిని ఉపయోగించకుంటే అవి కూడా ఫోన్‌కు హాని కలిగిస్తాయి. మంచి బ్రాండ్‌లు, భద్రత ఉన్న ఛార్జర్లనే ఉపయోగించాలి. ప్లగ్-ఇన్ ఛార్జర్‌ల లాగానే యాపిల్ ప్రోడక్ట్స్ కాకుండా వేరేవి ఉపయోగించాలనుకుంటే యాపిల్ ఎఎఫ్​ఐ ధృవీకరణ ఉందో లేదో చూసుకొని తీసుకోవాలి. ఆండ్రాయిడ్ ఫోన్​లకు ఉపయోగించే సీ-పిన్​ ఛార్జర్లను యూఎస్​బీ-ఐఎఫ్​ ధృవీకరించిందో లేదో చూసుకోవాలి.
  7. ఫోన్​లో యాప్​లు: మన ఫోన్​లో ఎక్కువ స్పేస్​ను ఆక్రమించే యాప్​లు చాలానే ఉంటాయి. ఇవి ఎక్కువ స్పేస్ తీసుకోవడమే కాకుండా బ్యాటరీని కూడా అధికంగా ఉపయోగిస్తుంటాయి. దీనివల్ల ఛార్జింగ్ తొందరగా దిగి పోవడం లాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అందుకే ఎక్కువ బ్యాటరీ ఉపయోగించే యాప్​లను వాడకపోవడమే మంచిది. వాటి స్థానంలో లైట్ వర్షన్​ యాప్​లను ఉపయోగించడం చాలా మంచిది. స్పైవేర్, యాడ్‌వేర్, మాల్వేర్ లాంటి సమస్యలు మనకు తెలియకుండానే వస్తుంటాయి. అవి ఫోన్‌కు సోకాయో లేదో చూసుకోవాలి. ఎలాంటి వైరస్​లు ఫోన్​కు వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..