AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: జ్యువెలరీ షాపులో బంగారు హారం దొంగతనం.. ఈ వీడియోలో దొంగ ఎవరో తెలిస్తే షాకవుతారు

సాధారణంగా జ్యూలరీ షాపుల్లో దొంగతనాలు జరుగుతుండటం చూసే ఉంటారు. తర్వాత కేసు నమోదు చేసి నిందితులను పోలీసులు పట్టుకోవడం జరుగుతూనే ఉంటుంది. కానీ ఓ జ్యూలరీ..

Viral Video: జ్యువెలరీ షాపులో బంగారు హారం దొంగతనం.. ఈ వీడియోలో దొంగ ఎవరో తెలిస్తే షాకవుతారు
Viral Video
Subhash Goud
|

Updated on: Feb 07, 2023 | 5:54 AM

Share

సాధారణంగా జ్యూలరీ షాపుల్లో దొంగతనాలు జరుగుతుండటం చూసే ఉంటారు. తర్వాత కేసు నమోదు చేసి నిందితులను పోలీసులు పట్టుకోవడం జరుగుతూనే ఉంటుంది. కానీ ఓ జ్యువెలరీ షాపులో జరిగిన దొంగతనం గురించి తెలిస్తే ఆశ్చర్యపోక మానదు. సీసీటీవీ పరిశీలిస్తే కానీ అసలు దొంగతనం ఎలా జరిగిందనే తెలియలేదు. జ్యూలరీ షాపులో ఓ హారం దొంగతనం జరిగింది. కానీ మనుషులు మాత్రం ఆ హారాన్ని దొంగిలించలేదు. మరి మనుషులు కాకుండా మరెవరు దొంగతనం చేస్తారనేగా మీ అనుమానం. అసలు నెక్లెస్‌ను ఎత్తుకెళ్లింది ఎలుక. ఏంటి నమ్మాలనిపించడం లేదా..? ఇది నిజమేనండోయ్‌.. ఈ చోరీకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ సంఘటన కేరళ రాష్ట్రంలోని కాసర్‌గడ్‌లోని ఓ ప్రముఖ నగల దుకాణంలో చోటు చేసుకుంది. ఓ ఎలుక ప్రముఖ బంగారు దుకాణ షాపులో చోరీకి పాల్పడింది. రోజులాగే రాత్రి జ్యూలరీ షాపును మూసివేసి ఇంటికి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం యజమాని షాపు తీసే సరికి డిస్‌ప్లేలో ఓ హారం కనిపించలేదు. కంగారు పడిన షాపు యజమాని షాపులో దొంగతనం జరిగిందని, దొంగలు హారాన్ని ఎత్తుకెళ్లారని షాపు సిబ్బంది సీసీటీవీ పుటేజీని పరిశీలించారు.

అందులో కనిపించిన దృశ్యం చూసి యజమాని సహా షాపు సిబ్బంది షాక్ అయ్యారు. వారి నోట మాట రాలేదు. నెక్లెస్ చోరీ అయిన విషయం వాస్తవమే. కానీ, దాన్ని ఎవరు ఎత్తుకెళ్లారో చూసి వారి మైండ్ బ్లాంక్ అయ్యింది. ఓ ఎలుక ఖరీదైన నెక్లెన్ ను ఎత్తుకెళ్లినట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది.

ఇవి కూడా చదవండి

అర్థరాత్రి.. షాపు సీలింగ్ నుంచి ఓ ఎలుక బయటకు వచ్చింది. సరిగ్గా దాని కన్ను అక్కడే డిస్ ప్లే లో ఉంచిన బంగారు నెక్లప్ పై కన్నుపడింది. ఆ నెక్లెస్ పై దానికి ఎలాంటి మోజు కలిగిందో తెలియదు కానీ.. ఆ ఎలుక చేసిన చోరీ అందరిని ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ నగను చూసిన ఎలుక నోటితో పైకి ఎత్తుకెళ్లింది. ఇదంతా కూడా ఫుటేజీలో రికార్డ్ అయ్యింది. ఎలుక చేసిన పని చూసి అంతా షాక్ అయ్యారు. ఎలుక ఎంత పని చేసింది? అని తల పట్టుకున్నారు.

ఖరీదైన నెక్లెస్ ను ఎలుక ఎత్తుకెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. వాలెంటైన్స్ డే దగ్గర పడింది కదా.. ఆ ఎలుక తన లవర్ కి గిఫ్ట్ గా ఇచ్చేందుకు ఇలా నగను చోరీ చేసి ఉంటుందని ట్వీట్ చేస్తున్నారు నెటిజన్లు. 30 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోను ఐపీఎస్ అధికారి రాజేష్ హింగాంకర్ ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వాంఖడే సాక్షిగా చరిత్ర సృష్టించిన సూర్య..కోహ్లీ రికార్డ్ బ్రేక్
వాంఖడే సాక్షిగా చరిత్ర సృష్టించిన సూర్య..కోహ్లీ రికార్డ్ బ్రేక్
మద్యం మత్తులో దారుణం.. పెట్రోల్‌ పోసి యువకుడి హత్య!
మద్యం మత్తులో దారుణం.. పెట్రోల్‌ పోసి యువకుడి హత్య!
వాలెంటైన్స్ డే.. భారీగా హోటల్‌ రూమ్‌ బుకింగ్స్‌!
వాలెంటైన్స్ డే.. భారీగా హోటల్‌ రూమ్‌ బుకింగ్స్‌!
టీమిండియా వరల్డ్ రికార్డ్.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ సంచలనం
టీమిండియా వరల్డ్ రికార్డ్.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ సంచలనం
ఓటీటీలో రవితేజ సంక్రాంతి హిట్ సినిమా.. ' స్ట్రీమింగ్ డేట్ ఇదే
ఓటీటీలో రవితేజ సంక్రాంతి హిట్ సినిమా.. ' స్ట్రీమింగ్ డేట్ ఇదే
ప్రేమపెళ్లి చేసుకుని తప్పుచేశా.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి సూసైడ్
ప్రేమపెళ్లి చేసుకుని తప్పుచేశా.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి సూసైడ్
టాప్‌-10 బెస్ట్‌ సెల్లింగ్‌ బైక్‌లు, స్కూటర్లు.. ధర ఎంతో తెలుసా?
టాప్‌-10 బెస్ట్‌ సెల్లింగ్‌ బైక్‌లు, స్కూటర్లు.. ధర ఎంతో తెలుసా?
జీతాల పెంపు కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్‌!
జీతాల పెంపు కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్‌!
హోమ్‌వర్క్‌ చేయలేదనీ.. 2వ తరగతి పిల్లాడిని చితకబాదిన టీచర్‌!
హోమ్‌వర్క్‌ చేయలేదనీ.. 2వ తరగతి పిల్లాడిని చితకబాదిన టీచర్‌!
కేవలం 300 సెకన్లలో రూ.2700 కోట్ల చారిత్రాత్మక డీల్ చేశారట..!
కేవలం 300 సెకన్లలో రూ.2700 కోట్ల చారిత్రాత్మక డీల్ చేశారట..!