రూ. 5వేల జీన్స్‌..! 5 వాష్‌లకే రంగుపోయింది..కంపెనీపై కోర్టుకెక్కిన కస్టమర్‌.. ఏం జరిగిందంటే..

|

Feb 16, 2024 | 11:18 AM

గత ఏడాది అక్టోబర్‌లో ఈ కేసులో న్యాయపరమైన విచారణ ప్రారంభమైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేసు విచారణ ముగిసింది. విచారణ సందర్భంలో కోర్టు న్యాయమూర్తి మేరకు.. ఆదిత్య బిర్లా ప్యాషన్ కంపెనీ ఈ జీన్స్‌ను ఉతకడం గురించి కస్టమర్‌కు సూచనలు ఇవ్వలేదన్నారు.. ఈ విషయమై కంపెనీకి పలుమార్లు నోటీసులు ఇచ్చినా కంపెనీ అధికారులు విచారణకు హాజరుకాలేదని చెప్పారు.

రూ. 5వేల జీన్స్‌..! 5 వాష్‌లకే రంగుపోయింది..కంపెనీపై కోర్టుకెక్కిన కస్టమర్‌.. ఏం జరిగిందంటే..
Van Heusen Jeans
Follow us on

ఖరీదైన జీన్స్‌లు కూడా కొన్ని వాష్‌ల తర్వాత షేడ్‌ అవుతుంటాయి. కలర్‌ పోయి డల్‌గా కనిపిస్తుంటాయి. దాంతో వాటిని మనం వార్డ్‌రోబ్‌లోంచి బయట పడవేస్తుంటాం.. అయితే, బెంగళూరుకు చెందిన హరిహరన్ బాబు ఏకే అలా చేయలేదు. వాన్ హ్యూసెన్ కంపెనీకి చెందిన జీన్స్ 4499 రూపాయలకు కొనుగోలు చేశాడు. ఐదుసార్లు ఉతికిన తర్వాత ఆ జీన్స్ రంగు వాడిపోయింది. దాంతో అతను కీలక నిర్ణయం తీసుకున్నాడు. దాంతో అతడు జీన్స్‌ తయారీ కంపెనీపై విజయం సాధించాడు. జీన్స్‌ కోసం తను ఖర్చు చేసిన డబ్బు మొత్తం తిరిగి పొందగలిగాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆదిత్య బిర్లా ఫ్యాషన్ & రిటైల్ లిమిటెడ్ ఏప్రిల్ 16, 2023న కొనుగోలు చేసిన జీన్స్ మూడు నెలల్లో ఐదు వాష్‌లలో పూర్తిగా మాసిపోయింది. దీంతో విసుగు చెందిన హరిహరన్ షోరూమ్‌లో ఫిర్యాదు చేశాడు. తను చెల్లించిన డబ్బు తిరిగి వాపస్‌ చేయాలని కోరాడు. అందుకు సిబ్బంది వివరణ ఇచ్చారు. ఈ జీన్స్ తయారీ కోసం ఇండిగో డైని వాడుతున్నారు. క్రమంగా దాని సహజ రంగు మసకబారుతుందని తెలిపారు. దీంతో సంతృప్తి చెందని హరిహరన్ తన మోసంపై వినియోగదారుల పరిష్కార కమిషన్‌లో ఫిర్యాదు చేశాడు.

గత ఏడాది అక్టోబర్‌లో ఈ కేసులో న్యాయపరమైన విచారణ ప్రారంభమైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేసు విచారణ ముగిసింది. విచారణ సందర్భంలో కోర్టు న్యాయమూర్తి మేరకు.. ఆదిత్య బిర్లా ప్యాషన్ కంపెనీ ఈ జీన్స్‌ను ఉతకడం గురించి కస్టమర్‌కు సూచనలు ఇవ్వలేదన్నారు.. ఈ విషయమై కంపెనీకి పలుమార్లు నోటీసులు ఇచ్చినా కంపెనీ అధికారులు విచారణకు హాజరుకాలేదని చెప్పారు. జీన్స్‌ కొనుగోలు చేసిన వ్యక్తికి బిల్లు వాపస్‌ ఇవ్వలేదు. చివరకు జీన్స్‌ రూ. 4016, అదనంగా మరో వెయ్యి రూపాయలు రెండు నెలల్లో కస్టమర్‌కు చెల్లించాలని బెంగళూరుకు చెందిన వినియోగదారుల పరిష్కార కమిషన్‌ తీర్పును వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

ఇండియన్‌ ఫ్యాషన్, రిటైల్ పరిశ్రమలో ప్రముఖ కంపెనీ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్. ఇది భారతదేశంలోని అతిపెద్ద సమ్మేళనాలలో ఒకటైన ఆదిత్య బిర్లా గ్రూప్‌లో భాగం. ABFRL ఫార్మల్, క్యాజువల్ వేర్‌లతో సహా వివిధ విభాగాలకు అందించే ఫ్యాషన్ బ్రాండ్‌ల విభిన్న పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తుంది. దాని ప్రసిద్ధ బ్రాండ్లలో కొన్ని వాన్ హ్యూసెన్, అలెన్ సోలీ, పాంటలూన్స్, పీటర్ ఇంగ్లాండ్, ఇంకా అనేకం ఉన్నాయి. కంపెనీ దుస్తులు, ఉపకరణాల తయారీ, పంపిణీ, రిటైలింగ్‌ నిర్వహిస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..