Viral Video: పెళ్లి వేదికకు వెళ్లకుండా.. ధర్నాలో కూర్చున్న వరుడు.. అసలు విషయం ఏంటో తెలుసా?
Trending Video: ఉత్తరాఖండ్‌లో వరుడి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఊరేగింపుగా స్టేజ్ వద్దకు వెళ్లకుండా రాజకీయ నేతలతో కలిసి ధర్నాకు దిగాడు.

ప్రస్తుతం వివాహాల సీజన్ నడుస్తోంది. ఇటువంటి పరిస్థితిలో సోషల్ మీడియాలో వివాహాలకు సంబంధించిన అద్భుత వీడియోలు సందడి చేస్తున్నాయి. ఎందుకంటే వధూవరులకు సంబంధించిన కంటెంట్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం, ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది కాస్త భిన్నంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక వరుడు వధువు వద్దకు వెళ్లకముందే రోడ్డుపై నిరసన వ్యక్తం చేశాడు.
మీడియా కథనాల ప్రకారం, ఇది ఉత్తరాఖండ్‌కు చెందినది. వాస్తవానికి, గత నెలలో కొండచరియలు విరిగిపడటంతో కత్‌గోడం హైదఖాన్ రహదారి విరిగిపోయింది. ఈ నేపథ్యంలో రోడ్డు కోసం స్థానిక ప్రజలు, కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. ఇంతలో వరుడు తన ఊరేగింపుతో వెళ్తున్నాడు. రోడ్డు డిమాండ్ కోసం నిరసన జరుగుతుండడం చూసిన వరుడు పెళ్లికూతురు ఇంటికి వెళ్లకుండా అక్కడే ధర్నాకు దిగి బారాతీలతో పాటు రోడ్డు బాగు చేయాలని డిమాండ్ చేశాడు.




వీడియోను ఇక్కడ చూడండి..
कोटाबाग से पतलिया जाने वाली एक बारात को पैदल सफर तय करना पड़ा, दूल्हे राहुल अपनी दुल्हन को लेने क्षतिग्रस्त मार्ग से पैदल पतलिया क़े लिये निकले ,दूल्हे राहुल भी कांग्रेस के उपवास को समर्थन देने के लिए धरना स्थल पर पहुँचे।@INCIndia @devendrayadvinc @INCUttarakhand pic.twitter.com/GnC3zW45ZD
— Yashpal Arya (@IamYashpalArya) December 6, 2022
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ ఊరేగింపును వదిలి రాజకీయ ధర్నాకు కూర్చున్న వరుడు.. ఈ సమస్య పరిష్కారమయ్యే వరకు ఈ ధర్నాను కొనసాగిస్తానని పట్టుబట్టాడు. ఈ వీడియోను కాంగ్రెస్ నేత యశ్‌పాల్ ఆర్య తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. వార్త రాసే సమయానికి వందల కొద్దీ వీక్షణలు, లైక్‌లు వచ్చాయి.
వీడియోపై వ్యాఖ్యానిస్తూ, ‘బ్రదర్, మీరు ధర్నాలో కూర్చుంటే, పెళ్లి మిస్ అవుతుంది’ అని రాసుకొచ్చాడు. మరోవైపు, మరొక యూజర్, ‘ఏయ్ బ్రదర్, అతను పెళ్లికి ముందే నిరసన ప్రారంభించాడు..’ అని రాసుకొచ్చాడు. ‘ప్రజలు తమ వివాహాన్ని ప్రత్యేకంగా చేసుకోవడానికి ఏమి చేస్తారో తెలియదు..’ అంటూ రాసుకొచ్చాడు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..