AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌తో ఉద్యోగం ఉష్‌ పటాక్..! లేడీ కానిస్టేబుల్‌ కొంపముంచిన రివాల్వర్‌ వీడియో..

Priyanka Mishra: ఆమె బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగి. పోలీస్‌ శాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తోంది. అయితే సోషల్ మీడియాలో పాపులర్ కావడంతో కోసం

ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌తో ఉద్యోగం ఉష్‌ పటాక్..! లేడీ కానిస్టేబుల్‌ కొంపముంచిన రివాల్వర్‌ వీడియో..
Priyanka Mishra
uppula Raju
|

Updated on: Sep 13, 2021 | 5:17 PM

Share

Priyanka Mishra: ఆమె బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగి. పోలీస్‌ శాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తోంది. అయితే సోషల్ మీడియాలో పాపులర్ కావడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇంకేముంది ఉద్యోగం ఉష్‌ పటాక్‌ అయిపోయింది. అదేంటి ఒక్క పోస్ట్ తోనే ఉద్యోగం నుంచి తీసేస్తారా.. అంటే అది మామూలుగా చేస్తే పర్వాలేదు కానీ పోలీస్‌ యూనిఫాంలో ఉండి రివాల్వర్‌ చేతిలో పట్టుకొని సినిమాలో మాదిరిగా డైలాగ్స్‌ చెబుతూ వీడియో చేసింది. దీంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఆమె తీరును తూర్పారబట్టారు. ఓ పోలీసు అయి ఉండీ ఇలా చేస్తారా అంటూ తలంటేశారు! సోషల్ మీడియాలో ఆమెపై విపరీతంగా నెగెటివ్ కామెంట్స్ వచ్చిపడ్డాయి! మరోవైపు..శాఖాపరమైన చర్యలు కూడా మొదలయ్యాయి. పైఅధికారులు ఆమెను విధులకు దూరంగా ఉంచారు. ఈ పరిస్థితుల్లో తీవ్ర డిప్రెషన్‌లో కూరుకుపోయిన ఆమె ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. తాజాగా అధికారులు ప్రియాంకామిశ్రా రాజీనామాను ఆమోదించారు. విధుల నుంచి తొలగించారు.

వాస్తవానికి ప్రియాంక మిశ్రా కాన్పూర్ నివాసి. 2020లో పోలీస్ కానిస్టేబుల్ పోస్టులో చేరారు. శిక్షణ పొందిన తరువాత మూడు నెలల క్రితం ఆగ్రాలోని MM గేట్ పోలీస్ స్టేషన్‌లో విధులలో చేరారు. రివాల్వార్‌తో చేసిన వీడియో వైరల్‌ కావడంతో ఆమెకు విపరీతంగా ఫాలోవర్లు పెరిగిపోయినప్పటికీ వృత్తి జీవితంలో మాత్రం ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అయితే ఇలా వీడియోలు చేయకూడదన్న విషయం తనకు తెలియదని ప్రియాంక తాజాగా పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తప్పు తెలిసిన వెంటనే వీడియోలను డిలీట్ చేశానన్నారు. కానీ ప్రియాంకను చాలామంది ‘రివాల్వర్ రాణి’ అంటూ ట్రోల్ చేశారు. అంతేకాదు.. సోషల్ మీడియా వేదికగా ఆమె బహిరంగంగా క్షమాపణ కూడా చెప్పింది.

9 మంది బౌలర్ల ఊచకోత.. 17 ఏళ్ల ప్లేయర్ పెను విధ్వంసం.. సూపర్ సెంచరీతో ప్రత్యర్ధికి చుక్కలు..

Viral Video: సింహంపై గుంపుగా హైనాల ఎటాక్.. చావు దాకా వెళ్లింది.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్.!

Allu Arjun: వావ్‌ వాటే సింప్లిసిటి.. రోడ్డు పక్కన టిఫిన్‌ చేసిన అల్లు అర్జున్‌. వైరల్‌ అవుతోన్న వీడియో..

Follow Us
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్