Job News: నిద్రపోయే ఉద్యోగం.. జోక్ కాదు.. ఆగష్టు 11తో ముగియనున్న దరఖాస్తు గడువు..
ఆఫీసులో కొంచెం సేపు నిద్రపోయినా.. బాస్ ఊరుకోడు. అందుకే నిద్ర వచ్చినా ఆపుకుంటూ పనిచేస్తాం.. కాని అమెరికాలోని న్యూయార్క్ కు చెందిన ఓ పరుపుల కంపెనీ స్లీపింగ్ జాబ్స్ కు నోటిఫికేషన్ ఇచ్చింది. ఓన్లీ ప్రొఫెషనల్ స్లీపర్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని కోరింది. ఈ నోటిఫికేషన్ చూసిన వారంతా జోక్ అనుకుంటున్నారు. కాని స్లీపింగ్ జాబ్స్
Job News: ఆఫీసులో కొంచెం సేపు నిద్రపోయినా.. బాస్ ఊరుకోడు. అందుకే నిద్ర వచ్చినా ఆపుకుంటూ పనిచేస్తాం.. కాని అమెరికాలోని న్యూయార్క్ కు చెందిన ఓ పరుపుల కంపెనీ స్లీపింగ్ జాబ్స్ కు నోటిఫికేషన్ ఇచ్చింది. ఓన్లీ ప్రొఫెషనల్ స్లీపర్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని కోరింది. ఈ నోటిఫికేషన్ చూసిన వారంతా జోక్ అనుకుంటున్నారు. కాని స్లీపింగ్ జాబ్స్ రిక్రూట్ మెంట్ నిజమేనని సదరు కంపెనీ క్లారిటీ ఇచ్చింది. ఈఉద్యోగాలకు అమెరికాలోని న్యూయర్క్ లో నివాసముండేవారు లేదా..ఇతర ప్రాంతాల వారైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. సాధారణంగా ఇంట్లో అయినా సమయానికి మించి ఎక్కువ సేపు నిద్రపోతే పొదస్తమాను నిద్రపోకపోతే.. ఏదైనా పనిచేసుకోవచ్చు కదా అని తిడుతుంటారు పేరెంట్స్, ఎక్కువుగా పడుకుంటే సోమరితనం పెరిగిపోతుందంటారు. కాని ఇప్పుడు నిద్రపోయేందుకు జీతాలిస్తామంటున్నాయి కంపెనీలు..ఇంతకీ స్లీపింగ్ జాబ్స్ ఇచ్చి.. జీతాలెందుకిస్తారనుకుంటున్నారా.. ఇక్కడే ఉందొక చిన్న ట్విస్ట్.
ప్రాజెక్టులో పాల్గొనేవారు తప్పనిసరిగా ప్రొఫెషనల్ స్లీపర్లు అయి ఉండాలి. ఈఉద్యోగాలకు అప్లై చేసుకునేవారు తమ ప్రొడక్ట్ పరుపులపై ఎలా నిద్ర పోతారు. పరుపుపై పడుకోవడం వల్ల వారు ఎటువంటి విలాసవంతమైన అనుభవాలను పొందుతారనే దాని గురించి సోషల్ మీడియాలో పోస్టు చేయాలని కంపెనీ పేర్కొంది. దీని కోసం భారీ ప్యాకేజీని ఆఫర్ చేస్తామంటోంది. తమ కంపెనీ ప్రొపెషనల్ స్లీపర్స్ కోసం వెతుకుతుందని, అనుభవమున్న స్లీపర్లు టిక్ టాక్ వీడియో ద్వారా తమ నైపుణ్యాలను ప్రదర్శించి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని న్యూయర్క్ కు చెందిన పరుపుల కంపెనీ కోరుతోంది. ఈఉద్యోగానికి దరఖాస్తు గడువు ఆగష్టు 11తో ముగుస్తుందని వెల్లడించింది. మరెందుకు ఆలస్యం మీరు ప్రొఫెషనల్ స్లీపర్స్ అయితే ఈజాబ్ కు అప్లై చేసేయండి.. మరోవైపు ఈ జాబ్ నోటిఫికేషన్ పై కూడా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఎంత మంచి ఉద్యోగం అని కొందరు అంటుంటే.. ఈఉద్యోగానికి అప్లై చేసి నిద్రతో స్ఫూర్తి నింపాలంటున్నారు మరికొందరు.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..